Apple iPhone 17 Sale : ఆపిల్ ఐఫోన్ 17 సేల్ మొదలైందోచ్.. కొత్త ఐఫోన్ కోసం స్టోర్ల వద్ద ఎగబడుతున్న జనం.. పొట్టు పొట్టు కొట్టేసుకున్నారు..!

Apple iPhone 17 Sale : ఆపిల్ ఐఫోన్ 17 కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి ముంబై వరకు అభిమానులు ఆపిల్ స్టోర్ల వెలుపల భారీగా క్యూలో నిలబడ్డారు.

Apple iPhone 17 Sale

Apple iPhone 17 Sale : ఐఫోన్ ప్రియులకు పండగే పండగ.. ఇటీవలే ఆపిల్ ఐఫోన్ 17 లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ ఈరోజు (సెప్టెంబర్ 19) నుంచి సేల్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలోని ఆపిల్ స్టోర్లలో భారీగా జనసందోహం కనిపిస్తోంది.

ఆగ్నేయ ఢిల్లీలోని సాకేత్ మాల్ వద్ద తెల్లవారుజాము నుంచి ఐఫోన్ అభిమానులు (Apple iPhone 17 Sale) భారీ క్యూలో గుడికూడారు. ఐఫోన్ 17 మొదటి కొనుగోలుదారిగా ఉండేందుకు అభిమానులు తెల్లవారుజాము నుండే వేచి ఉన్నారు.

Apple iPhone 17 Sale

ముంబైలోనూ ఇదే సందడి నెలకొంది, ఆపిల్ BKC స్టోర్‌ వద్ద కూడా భారీ రద్దీ కనిపించింది. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ ఈరోజు నుంచి ఆపిల్ స్టోర్లలో అమ్మకానికి రావడంతో గురువారం రాత్రి నుంచి ఢిల్లీ, ముంబైలోని ఆపిల్ స్టోర్ల వెలుపల జనం గుమిగూడారు.

ఐఫోన్ ప్రియులు కూడా ఎక్స్ వేదికగా లేటెస్ట్ మోడల్‌ కొనుగోలుకు సంబంధించి ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఆపిల్ స్టోర్ల వెలుపల పొడవైన క్యూలతో కిటకిటలాడుతున్నాయి. ఢిల్లీ నుంచి ముంబై వరకు స్టోర్ల వద్ద ఐఫోన్ కొనుగోలుదారుల వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తున్నాయి.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. ఒప్పో రెనో 14 సిరీస్, ఒప్పో K13 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..

కొనుగోలుదారుల మధ్య ఘర్షణ :

BKC జియో సెంటర్ స్టోర్ వెలుపల ఐఫోన్ కొనుగోలుదారుల మధ్య ఘర్షణ చెలరేగింది. క్యూలో కొద్దిసేపు పొట్టు పొట్టుమని కొట్టేసుకున్నారు. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగడంతో ఐఫోన్ కొనుగోలుదారుల మధ్య గొడవ సర్దుమనిగింది.

ముంబై, ఢిల్లీ స్టోర్ల వద్ద భారీగా క్యూలు :
గురువారం రాత్రి నుంచి ముంబైలోని బీకేసీలోని ఆపిల్ స్టోర్ వెలుపల భారీ క్యూలలో నిలబడి ఉన్నారు. ఎందుకంటే.. ఐఫోన్ 17 కొనుగోలు చేసే మొదటి వ్యక్తి కావాలని అందరికి కన్నా ముందుగా వచ్చి క్యూలో నిలబడ్డారు. నివేదికల ప్రకారం.. కొంతమంది ఐఫోన్ 17 కొనుగోలు కోసం 7 నుంచి 8 గంటలు వేచి ఉన్నారు. మరికొంతమంది కస్టమర్లు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నారు.

ఐఫోన్ 17 సిరీస్ ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో అనేక ముఖ్యమైన మార్పులు చేసింది. ఐఫోన్ 17 మోడల్ 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే కలిగి ఉంది. గతంలో ఐఫోన్ ప్రో మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా , ఐఫోన్ 17 సిరీస్‌లోని లేటెస్ట్ A19 చిప్‌సెట్ వెరీ పవర్‌ఫుల్. ఐఫోన్ 17 ఎయిర్ ఈ సిరీస్‌లో స్పెషల్ మోడల్. కేవలం 5.5 మిల్లీమీటర్ల అత్యంత సన్నగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌.

ఐఫోన్ 17 సిరీస్ ఆపిల్ లేటెస్ట్ సిలికాన్ చిప్‌తో వస్తుంది. iOS 26పై రన్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త ఏఐ ఫీచర్లు కలిగి ఉంది. ఈ ఐఫోన్ 17 సిరీస్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణేలోని ఆపిల్ అధికారిక స్టోర్‌లలో అలాగే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల వినియోగదారులు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, క్విక్ కామర్స్ యాప్‌లు, అధీకృత ఆపిల్ రిటైలర్‌ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 17 Sale

ఐఫోన్ 17 సిరీస్ ధరలు, ఆఫర్లు :

  • ఐఫోన్ 17 (256GB): రూ. 82,900
  • ఐఫోన్ 17 (512GB): రూ. 1,02,900
  • ఐఫోన్ ఎయిర్ (256GB): రూ. 1,19,900
  • ఐఫోన్ ఎయిర్ (1TB): రూ. 1,59,900
  • ఐఫోన్ 17 ప్రో (256GB): రూ. 1,34,900
  • ఐఫోన్ 17 ప్రో మాక్స్ (256GB): రూ. 1,49,900
  • ఐఫోన్ 17 ప్రో మాక్స్ (2TB): రూ. 2,29,900