Site icon 10TV Telugu

iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక స్పెసిఫికేషన్లు, ధర లీక్.. ఫీచర్లపై భారీ అంచనాలివే!

iPhone 17 Pro Max

iPhone 17 Pro Max

Apple iPhone 17 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ వచ్చేస్తోంది. వచ్చే నెలలో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాంచ్ కానుంది. ఆపిల్ రాబోయే ఈ ఐఫోన్ మోడల్ గురించి ఎలాంటి (Apple iPhone 17 Pro Max) అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, పుకార్లు, నివేదికలు సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ అవుతాయని సూచిస్తున్నాయి. రాబోయే లైనప్ ప్లస్ మోడల్ స్థానంలో కొత్త ఎయిర్ మోడల్‌ లాంచ్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.

రాబోయే ఏళ్లలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను పొందే అవకాశం ఉంది. అధికారిక లీక్‌ల ప్రకారం.. రీడిజైన్ కెమెరా మాడ్యూల్, అప్‌గ్రేడ్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ కెమెరా, యాంటీ-రిఫ్లెక్టివ్ డిస్‌ప్లే కోటింగ్‌ సూచిస్తున్నాయి. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర, ఇతర వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ తేదీ (లీక్) :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రోలతో పాటు, సెప్టెంబర్ 8 లేదా సెప్టెంబర్ 9న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19న సేల్ ప్రారంభమవుతుంది. కేవలం ఊహాగానాలు అయినప్పటికీ అధికారిక తేదీలు ఇంకా ప్రకటించలేదు.

Read Also : Vivo X100 Pro 5G : ఇది కదా ఆఫర్.. అమెజాన్‌లో వివో X100 ప్రో 5G అతి చౌకైన ధరకే.. ఇలాంటి డిస్కౌంట్ మళ్లీ రాదు.. త్వరపడండి!

ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్, కలర్ ఆప్షన్లు (లీక్) :
నివేదికల ప్రకారం.. ఈ ఐఫోన్ 17 ప్రో బ్లాక్, వైట్, యాష్, బ్రైట్ బ్లూ, ఆరెంజ్ షేడ్స్‌తో సహా 5 వేర్వేరు కలర్ ఆప్షన్లలో రావచ్చు. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 8.7mm మందంతో వస్తుంది. కెమెరా ఐలండ్ రైట్ సైడ్ ఫ్లాష్, LiDAR సెన్సార్‌తో త్రిభుజాకార కెమెరా సెటప్‌ కలిగి ఉంది. భారీ రెక్టాంగులర్ కెమెరా ఐలండ్ కలిగి ఉంటుంది. అదనంగా, టైటానియం ఫ్రేమ్‌ను తొలగించి అల్యూమినియం ఫ్రేమ్‌ను పొందుతుంది. స్టీమ్ కూలింగ్ రూమ్ ఉండవచ్చు.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు (లీక్) :
హార్డ్‌వేర్ విషయానికొస్తే.. ఈ ఐఫోన్ 6.9-అంగుళాల OLED ప్యానెల్‌ను వేరియబుల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉండవచ్చు. 12GB ర్యామ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో వస్తుంది. లేటెస్ట్ A19 ప్రో చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు.

ఈ హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీ, 5,000mAh బ్యాటరీ, 50W మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్‌ను పొందే అవకాశం ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 48MP ప్రైమరీ, 48MP టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ సైడ్ 24MP సెల్ఫీ షూటర్‌ కలిగి ఉండవచ్చు.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర (లీక్) :
ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ ధరలను పెంచవచ్చు. లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర భారత మార్కెట్లో దాదాపు రూ.1,64,999 వరకు ఉండవచ్చు. అయితే, కంపెనీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Exit mobile version