Vivo X100 Pro 5G : ఇది కదా ఆఫర్.. అమెజాన్‌లో వివో X100 ప్రో 5G అతి చౌకైన ధరకే.. ఇలాంటి డిస్కౌంట్ మళ్లీ రాదు.. త్వరపడండి!
Vivo X100 Pro 5G : వివో ఫోన్ అదిరింది.. అతి తక్కువ ధరకే లభ్యమవుతుంది. అమెజాన్‌లో వివో X100 ప్రో 5G ఇలా కొనేసుకోండి..

Vivo X100 Pro 5G
Vivo X100 Pro 5G : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. అద్భుతమైన కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం వివో X100 ప్రో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో అమెజాన్‌లో రూ. 31,500 తగ్గింపుతో అందుబాటులో ఉంది.
భారత మార్కెట్లో వివో X100 ప్రో రూ. 89,999 ధరకు లాంచ్ అయింది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, అమోల్డ్ ప్యానెల్, 5,400mAh బ్యాటరీతో ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తుంది. మీరు ఈ వివో ఫోన్ కొనేందుకు చూస్తుంటే అమెజాన్‌లో వివో X100 ప్రో ధర ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో వివో X100 ప్రో 5G ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో వివో X100 ప్రో 5G ఫోన్ రూ.59,999కి అందుబాటులో ఉంది. భారీ రూ.30వేలు తగ్గింపు పొందవచ్చు. అదనంగా, కొనుగోలుదారులు HDFC, OneCard ఇతర కార్డులతో సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.1,500 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.
అమెజాన్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. కొనుగోలుదారులు తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుని రూ.33,400 వరకు బెస్ట్ వాల్యూను పొందవచ్చు. అయితే, కచ్చితమైన వాల్యూ అనేది మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. అదనంగా చెల్లిస్తే ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
వివో X100 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
వివో X100 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. జనరేషన్ ఫ్లాగ్‌షిప్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,400mAh బ్యాటరీ కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన ZEISS-ట్యూన్ 50MP సోనీ IMX989 సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది.