Apple iPhone 17 Pro Max
Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఆపిల్ ఐఫోన్ రాబోతుంది. రాబోయే ఐఫోన్ 17 ప్రో మాక్స్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఐఫోన్ 17, 17 ప్రో, సరికొత్త (Apple iPhone 17 Pro Max) ఐఫోన్ 17 ఎయిర్‌లతో పాటు లాంచ్ కానుంది. ఐఫోన్ ప్రో మాక్స్, డిజైన్, పర్ఫార్మెన్స్, ఇమేజింగ్‌లో అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని అంచనా. రాబోయే ఐఫోన్ 17 ప్రో మాక్స్ గురించి మరిన్ని ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ : డిజైన్, కొత్త కలర్ ఆప్షన్లు (అంచనా) :
ఈ ఏడాదిలో ఆపిల్ కలర్ ఆప్షన్ మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. లీక్‌లను పరిశీలిస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ రిఫ్రెష్ డిజైన్‌ను కలిగి ఉండొచ్చు. బ్యాక్ సైడ్ దీర్ఘచతురస్రాకార ట్రిపుల్-కెమెరా లేఅవుట్, లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఆపిల్ లోగో కూడా ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ లైనప్ 5 కలర్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు. వైట్, బ్లాక్, బ్రైట్ బ్లూ, నారింజ, యాష్ కలర్ కలిగి ఉండొచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఆపిల్ కొత్త A19 ప్రో చిప్‌పై ఐఫోన్ 17 ప్రో మాక్స్ రన్ అవుతుంది. TSMC 3nm ప్రాసెస్ కలిగి ఉంది. 12GB ర్యామ్ మల్టీ టాస్కింగ్ AI ఫీచర్లను పొందవచ్చు. ఈ ఫోన్ ఆపిల్ బిగ్ బ్యాటరీ ఉండవచ్చు. గత ఏడాదిలో 4,676mAh నుంచి దాదాపు 5,000mAh వరకు ఉంటుంది. వాస్తవానికి, సన్నని బెజెల్స్‌తో 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే పొందవచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ కెమెరా అప్‌గ్రేడ్స్ :
ఆపిల్ ట్రిపుల్ 48MP సెటప్‌తో రానుంది. టెలిఫొటో, టెట్రాప్రిజం లెన్స్ ద్వారా 8K వీడియో రికార్డింగ్ ఉండవచ్చు. సెల్ఫీలు కూడా అప్‌గ్రేడ్ చేయొచ్చు. 24MP ఫ్రంట్ సెన్సార్ కూడా ఉండొచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్.. భారత్ లాంచ్ తేదీ, ధర (అంచనా) :
నివేదిక ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 9, 2025న ఆవిష్కరించాలని యోచిస్తోంది. భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ దాదాపు రూ.1,64,900 నుంచి అందుబాటులో ఉండనుంది.