Jio Recharge Plan : గుడ్ న్యూస్.. ఈ కొత్త జియో రీఛార్జ్ ప్లాన్ అదుర్స్.. అన్ లిమిటెడ్ కాలింగ్, 2GB హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ..
Jio Recharge Plan : జియో యూజర్లకు పండగే.. ఈ కొత్త జియో ప్లాన్ ద్వారా నెల మొత్తం అన్ లిమిటెడ్ కాలింగ్స్, 2GB హైస్పీడ్ డేటా కూడా పొందవచ్చు.

Jio Recharge Plan
Jio Recharge Plan : జియో యూజర్లకు అద్భుతమైన ఆఫర్.. చీపెస్ట్ రీఛార్జ్ కోసం చూస్తున్నారా? జియో ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. జియో ఇటీవల రూ. 189 కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను (Jio Recharge Plan) ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తక్కువ బడ్జెట్‌లో కాలింగ్, డేటా, ఎంటర్‌టైన్మెంట్ ఫుల్ ప్యాకేజీని అందిస్తుంది. జియో 189 ప్లాన్ ద్వారా ప్రతి నెలా చౌకైన రీఛార్జ్ పొందవచ్చు. ఈ కొత్త జియో రీఛార్జ్ ప్లాన్ ఎలా పొందాలంటే?
జియో రూ.189 ప్లాన్ బెనిఫిట్స్ :
ఈ రీఛార్జ్ ప్లాన్ ధర కేవలం రూ.189 మాత్రమే. జియో ప్లాన్‌లో కస్టమర్లు 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ SMS వంటి సర్వీసులను పొందవచ్చు.
28 రోజుల వ్యాలిడిటీ
అన్‌లిమిటెడ్ కాలింగ్
మొత్తం 2GB హై-స్పీడ్ డేటా (నో డైలీ లిమిట్)
రోజుకు 100 SMS బెనిఫిట్స్ (Jio Recharge Plan) :
JioTV, JioAICloud వంటి డిజిటల్ సర్వీసులు కూడా ఉచితంగా లభిస్తాయి. మీరు ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించకపోతే నెల పొడవునా కాలింగ్, బేసిక్ డేటాతో పాటు ఎంటర్‌టైన్మెంట్ పొందవచ్చు.
BSNL రీఛార్జ్ ప్లాన్ :
BSNL గతంలో చౌకైన రీఛార్జ్ ప్లాన్లు అందించేది. కానీ, ఇప్పుడు రూ.147, రూ.99 ప్లాన్ల వంటి అనేక ప్లాన్లపై వ్యాలిడిటీని తగ్గించింది. ఇకపై బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు నెలకు రెండుసార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మరింత ఖర్చు పెరుగుతుంది.
బీఎస్ఎన్ఎల్ కచ్చితంగా చౌకైన ప్లాన్‌లను కలిగి ఉంది. కానీ, మీరు నెట్‌వర్క్ క్వాలిటీ, వ్యాలిడిటీ, డిజిటల్ సర్వీసులు, సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే.. జియో రూ. 189 ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.
ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ప్రతి నెలా ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఆపై ఎలాంటి టెన్షన్ లేకుండా కాలింగ్, ఇంటర్నెట్, ఎంటర్‌టైన్మెంట్ పొందవచ్చు. మరోవైపు, BSNL ఇప్పుడు ప్లాన్‌లు, నెట్‌వర్క్‌పై దృష్టిపెట్టాలి. లేకపోతే, యూజర్లు క్రమంగా కోల్పోవాల్సి వస్తుంది.