Whatsapp Guest Chats : వావ్.. గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ అవసరం లేదు.. అకౌంట్ లేకున్నా నేరుగా ‘గెస్ట్’ చాట్ చేయొచ్చు.. ఎలాగంటే?
Whatsapp Guest Chats : వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తులతో కమ్యూనికేట్ అయ్యేందుకు "గెస్ట్ చాట్స్" అనే ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తోంది.

Whatsapp Guest Chats
Whatsapp Guest Chats : వాట్సాప్.. ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ తప్పనిసరి. వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండదనే చెప్పాలి. అంతగా వాట్సాప్ భాగమైపోయింది. అలాంటి వాట్సాప్ (Whatsapp Guest Chats) ఇప్పుడు అకౌంట్ లేకపోయినా ఎవరికైనా మెసేజ్ పంపొచ్చు అంటే నమ్ముతారా? ఓసారి ఊహించుకోండి. వింతగా అనిపిస్తోంది కదా? కానీ, వాట్సాప్ ఇప్పుడు దీనిపైనే వర్క్ చేస్తోంది.
ఇదిగానీ వచ్చిందంటే గేమ్-ఛేంజర్ కావచ్చు. WABetaInfo రిపోర్టు ప్రకారం.. “Guest Chats” అనే కొత్త ఫీచర్ రాబోతుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.22.13లో కనిపించింది. ఇంకా డెవలప్ స్టేజీలో ఉన్నప్పటికీ, ఈ టూల్ రాబోయే కొన్ని వారాల్లో అందుబాటులోకి రావచ్చు. వాట్సాప్ లేని యూజర్లతో చాటింగ్ చేయొచ్చు.
గెస్ట్ చాట్స్ అంటే ఏంటి? :
మీరు వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తికి లింక్ పంపితే.. వారు వెంటనే మీతో చాట్ చేయొచ్చు. ఇందుకోసం ప్రత్యేకించి వాట్సాప్ డౌన్‌లోడ్ అవసరం లేదు, అకౌంట్ క్రియేట్ చేయాల్సిన పనిలేదు. వారు వెబ్ బ్రౌజర్‌లో (WhatsApp Web) లింక్‌ను ఓపెన్ చేసి మీతో ఫేస్ టు ఫేస్ చాట్ చేయొచ్చు. ఈ చాట్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. అవతలి వ్యక్తి యాప్‌ను వాడకపోయినా మీ చాట్స్ ప్రైవేట్‌గానూ చాలా సేఫ్‌గా ఉంటాయి.
యూజర్లు ఏం చేయగలరు? ఏం చేయలేరంటే? :
గెస్ట్ చాట్స్ అనేవి వినడానికి ఎంత బాగున్నా లిమిట్స్ ఉంటాయి. ఈ గెస్ట్ చాట్స్ ఏయే ఫీచర్లకు సపోర్టు చేయవో ఇప్పుడు చూద్దాం..
- నో మీడియా షేరింగ్ ఆప్షన్ (ఫోటోలు, వీడియోలు, GIF)
- వాయిస్ లేదా వీడియో మెసేజ్‌లు లేవు
- ఫోన్ కాల్స్ లేవు
- గ్రూప్ చాట్‌లు లేవు
ప్రస్తుతానికి కేవలం టెక్స్ట్-ఓన్లీ మాత్రమే ఉంటుంది. వాట్సాప్ ఇప్పటికే థర్డ్-పార్టీ చాట్ ఇంటిగ్రేషన్ కోసం చూస్తోంది. అది కూడా ఈయూ EU నిబంధనలకు అనుగుణంగా ఉండనుంది. గెస్ట్ చాట్స్ పూర్తిగా ఇన్-హౌస్‌గా ఉంటాయి. అంటే.. ఏ ఎక్స్‌ట్రనల్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడవు.
ప్రైవసీతో పాటు యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అసలు వాట్సాప్ అకౌంట్ లేని వారు కూడా ఈజీగా వాట్సాప్ యాక్సస్ చేయొచ్చు. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకుండానే ఇతర వాట్సాప్ యూజర్లతో చాట్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు.