Apple iPhone 17 Series
Apple iPhone 17 Series : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కొనేందుకు చూస్తున్నారా? ఇటీవలే ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. సెప్టెంబర్ 19 నుంచి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, సరికొత్త ఐఫోన్ ఎయిర్‌తో సహా ఐఫోన్ 17 సిరీస్ అధికారికంగా సేల్ మొదలైంది. టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త ఐఫోన్ మోడళ్లను సొంతం చేసుకునేందుకు అభిమానులు ఆపిల్ స్టోర్ల వెలుపల భారీగా క్యూ కట్టేస్తున్నారు.
కొత్త ఐఫోన్‌లతో పాటు (Apple iPhone 17 Series) ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఆపిల్ వాచ్ అల్ట్రా 3, ఆపిల్ వాచ్ SE 3, ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 వంటి అనేక అప్లియన్సెస్ కూడా ఆపిల్ రిలీజ్ చేసింది. గత వార ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్‌లో ఐఫోన్ ఎయిర్ అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత సన్నని ఐఫోన్‌గా నిలిచింది. కేవలం 5.6 మిమీ మందం ఉంటుంది. ఐఫోన్ 17 సిరీస్ వేరియంట్ ధరల నుంచి ఆఫర్ల వరకు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ 17 ధర, ఆఫర్లు :
స్టాండర్డ్ ఐఫోన్ 17 ధర 256GB వేరియంట్ ధర రూ. 82,900 కాగా, 512GB మోడల్ ధర రూ. 1,02,900కు కొనుగోలు చేయొచ్చు. కొనుగోలుదారులు ట్రేడ్-ఇన్ ఆఫర్లలో రూ. 64వేల వరకు పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్లు నెలకు రూ. 7,521 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఐఫోన్ లావెండర్, సేజ్, మిస్ట్ బ్లూ, వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఐఫోన్ ఎయిర్ ధర, ఆఫర్లు :
ఐఫోన్ ఎయిర్ 3 స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 256GB ధర రూ.1,19,900, 512GB ధర రూ.1,39,900, 1TB ధర రూ.1,59,900. ఈఎంఐ నెలకు రూ.10,878 నుంచి ప్రారంభమవుతుంది. రూ.64,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. స్కై బ్లూ, లైట్ గోల్డ్, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మొత్తం 3 వేరియంట్లలో వస్తుంది. 256GB ధర రూ. 1,34,900, 512GB ధర రూ. 1,54,900, 1TB ధర రూ. 1,74,900. సిల్వర్, డీప్ బ్లూ, కాస్మిక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇతర మోడళ్ల మాదిరిగానే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర, ఆఫర్లు :
ఐఫోన్ 17 ప్రో మాక్స్ 4 స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 256GB ధర రూ.1,49,900, 512GB ధర రూ.1,69,900, 1TB ధర రూ.1,89,900, 2TB ధర రూ.2,29,900. ఐఫోన్ 17 ప్రో మాదిరిగానే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఆసక్తిగల కస్టమర్లు 64,000 వరకు ట్రేడ్-ఇన్ వాల్యూను పొందవచ్చు.