×
Ad

Apple iPhone 18 Pro : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. కొత్త ఐఫోన్ 18 ప్రో వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. భారీ మార్పులివే..!

Apple iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. డిస్‌ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్, లాంచ్ టైమ్ లైన్ వంటి వివరాలపై ఓసారి లుక్కేయండి..

1/7
Apple iPhone 18 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? రాబోయే రోజుల్లో టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి మరో కొత్త మోడల్ ఐఫోన్ 18 ప్రో రాబోతుంది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు సంబంధించి లీక్‌లు ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. లేటెస్ట్ లీక్‌లు డిజైన్, కెమెరా, హార్డ్‌వేర్ పర్ఫార్మెన్స్ సహా భారీ మార్పులు ఉండనున్నాయి.
2/7
ప్రస్తుతానికి దీనిపై ఆపిల్ ఎలాంటి వివరాలను ధృవీకరించలేదు. కానీ, ఐఫోన్ 18 ప్రో ఫస్ట్ లుక్ స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. 2025 ప్రారంభంలో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. 2026లో రాబోయే ఐఫోన్ 18 ప్రోకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
3/7
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో డిస్‌ప్లే : ఇన్ఫర్మేషన్ రిపోర్టు ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లలో డిస్‌ప్లే కింద ఫేస్ ఐడీ సెన్సార్లతో వస్తుందని చెబుతున్నారు. ఇటీవలి ఐఫోన్ మోడళ్లలో ఉన్న పిల్-ఆకారపు డైనమిక్ ఐలాండ్ కటౌట్‌ను ఎత్తేస్తుంది. ఫ్రంట్ సైడ్ వైపు కెమెరా కూడా కనిపిస్తుంది.
4/7
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో కెమెరాలు : ఆపిల్ రియర్ కెమెరా సెటప్‌లో కూడా భారీ మార్పులను తీసుకురావచ్చు. ఇదే నిజమైతే.. ఐఫోన్ 18 ప్రోలోని ఒక కెమెరాకు మెకానికల్ ఐరిస్ ఉంటుంది. వేరియబుల్ ఎపర్చర్ కంట్రోలింగ్ ఉంటుంది. కెమెరా పరిస్థితుల ఆధారంగా లైటింగ్ అడ్జెస్ట్ చేస్తుంది.
5/7
డే టైమ్‌లో తక్కువ కాంతిలో పర్ఫార్మెన్స్ మెరుగుపరుస్తుంది. మెయిన్ కెమెరా 48MP సెన్సార్‌గా ఉంటుందని భావిస్తున్నారు. కానీ, ఇటీవలి ప్రో మోడళ్లలో వాడిన స్టేబుల్-ఎపర్చర్ సిస్టమ్‌ల కన్నా ఎక్కువ యాక్సస్ ఉంటుంది.
6/7
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో చిప్‌సెట్ : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ A20 ప్రో చిప్‌సెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. TSMC 2nm తయారీ ప్రక్రియతో రూపొందించారు. చిన్న ప్రాసెస్ నోడ్‌తో పాటు ఆపిల్ మెమరీని నేరుగా ప్రాసెసర్ న్యూరల్ ఇంజిన్‌తో ఇంటిగ్రేట్ చేసే కొత్త చిప్ ప్యాకేజింగ్ విధానాన్ని తీసుకురానుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. డివైజ్‌లో ఏఐ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో టెంపరేచర్ కెపాసిటీని కూడా అప్‌గ్రేడ్ చేస్తుంది.
7/7
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ : రిపోర్టుల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026లో లాంచ్ కావచ్చు. అయితే, వెనిల్లా ట్రిమ్ తరువాత బహుషా 2027లో లాంచ్ అవుతుంది. ఆపిల్ ఇంకా ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.