Apple iPhone Foldable : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ వస్తోందోచ్.. లాంచ్ ఎప్పుడు? ఫీచర్లు, ధర వివరాలు లీక్..!
Apple iPhone Foldable : ఆపిల్ ఫస్ట్ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది. లాంచ్ టైమ్‌లైన్, డిస్‌ప్లే, స్పెషిఫికేషన్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి..

Apple iPhone Foldable
Apple iPhone Foldable : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది గ్లోబల్ మార్కెట్‌లోకి ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. రాబోయే ఈ ఐఫోన్ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిస్‌ప్లే, ఇతర కీలక అంశాలు రివీల్ అయ్యాయి.
మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐఫోన్ ఫోల్డ్ ఫీచర్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఐఫోన్ ఫోల్డ్ లోపలి, బయటి స్క్రీన్‌ల సైజులను రివీల్ చేసింది. ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 కన్నా చిన్న స్క్రీన్ కలిగి ఉండొచ్చు.
బ్లూమ్‌బెర్గ్‌కు మార్క్ గుర్మాన్, ప్రముఖ ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి-కువో కూడా రాబోయే ఫోల్డబుల్ ఐఫోన్ గురించి కొన్ని స్పెషిఫికేషన్లను రివీల్ చేశారు. ఆపిల్ కొత్త ఫోల్డబుల్ ఐఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి కొన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫోల్డబుల్ ఐఫోన్ డిస్‌ప్లే (అంచనా) :
ట్రెండ్‌ఫోర్స్ రిపోర్టు ప్రకారం.. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ 5.5-అంగుళాల కవర్ డిస్‌ప్లే, 7.8-అంగుళాల లోపలి స్క్రీన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ గురించి కంపెనీ మరిన్ని వివరాలను రివీల్ చేయలేదు.
ఆపిల్ ఫోల్డబుల్ యూజ్ కేసుల కోసం డీప్ iOS ఆప్టిమైజేషన్ తీసుకువస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. ఫోల్డబుల్ ఐఫోన్‌లో క్రీజ్-ఫ్రీ ఇన్నర్ స్క్రీన్ ఉండొచ్చు. శాంసంగ్ డిస్‌ప్లే చేస్తోంది. ఇందులో ఫైన్ M-టెక్ రూపొందించిన కస్టమ్ మెటల్ హింజ్, బ్యాక్‌ప్లేట్‌తో కూడా ఈ ఐఫోన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఫోల్డబుల్ ఐఫోన్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
హార్డ్‌వేర్ పరంగా పరిశీలిస్తే.. ఫోల్డబుల్ ఐఫోన్ టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉండొచ్చు. హింజ్ టైటానియం, స్టెయిన్‌లెస్ స్టీల్ కలిగి ఉంటుంది. కెమెరా విషయానికొస్తే.. ఫోల్డబుల్ ఐఫోన్‌లో రెండు బ్యాక్ కెమెరాలు, ఒక ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌లో టచ్ ఐడీ సెన్సార్‌కు ఫేస్ ఐడీని తొలగించే అవకాశం ఉంది.
ఫోల్డబుల్ ఐఫోన్ ధర (అంచనా) :
మార్క్ గుర్మాన్ బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ ధర దాదాపు 2వేలు డాలర్ల వరకు ఉండవచ్చు.
ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చే ఏడాది 2026 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఆ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.