POMIS Scheme : పోస్టాఫీసులో 5ఏళ్ల సూపర్ స్కీమ్.. కనీసం రూ. వెయ్యి పెట్టుబడి.. ప్రతినెలా రూ. 5,500 వడ్డీనే పొందొచ్చు..!

POMIS Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) పథకం ద్వారా పెట్టుబడితో ప్రతినెలా రూ. 5500 వడ్డీ పొందవచ్చు.

POMIS Scheme : పోస్టాఫీసులో 5ఏళ్ల సూపర్ స్కీమ్.. కనీసం రూ. వెయ్యి పెట్టుబడి.. ప్రతినెలా రూ. 5,500 వడ్డీనే పొందొచ్చు..!

Post Office Scheme

Updated On : July 24, 2025 / 4:40 PM IST

POMIS Scheme : పెట్టుబడి పెడుతున్నారా? ఎందులో పెట్టబడి పెడితే అధిక ఆదాయం వస్తుందో తెలుసా? అన్నింటిలో కన్నా సురక్షితమైన ఆదాయం పొందాలంటే (POMIS Scheme) పోస్టాఫీస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) అనే అద్భుతమైన పథకం ఉంది. పోస్టాఫీస్ అందించే ప్రత్యేక నెలవారీ ఆదాయ పథకంగా చెప్పవచ్చు. ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసిన నెల తర్వాత నుంచి వడ్డీ వస్తుంది. ఈ మొత్తం అమౌంట్ మెచ్యూరిటీ వరకు అందుబాటులో ఉంటుంది.

మీరు నెలవారీ, త్రైమాసిక, 6 నెలలు లేదా వార్షికంగా వడ్డీ డబ్బును తీసుకోవచ్చు. పేద, మధ్యతరగతి కుటుంబాలు పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి. ఎందుకంటే.. ఇందులో స్థిరమైన రాబడితో పాటు పెట్టుబడికి భద్రత కూడా ఉంటుంది.

పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత వడ్డీ తీసుకోవచ్చు. ఈ పథకంలో ఖాతాదారులకు 7.4శాతం నెలవారీ వడ్డీ పొందవచ్చు. పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Read Also : Child Aadhaar Card : ఐదేళ్లలోపు పిల్లలకు ‘బాల్ ఆధార్’ కార్డ్.. ఎక్కడికి వెళ్లకుండానే ఇంటి వద్దనే పొందొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

POMIS పథకం ప్రయోజనాలివే :
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)లో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 9 లక్షల వరకు ఉంటుంది. జాయింట్ అకౌంటులో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసిన నెల తర్వాత వడ్డీ ప్రారంభమవుతుంది. ఈ డబ్బు మెచ్యూరిటీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. తద్వారా ప్రతి నెలా ఆదాయాన్ని పొందవచ్చు.

నెలకు రూ. 5,500 ఆదాయం ఎలా? :
ఈ స్పెషల్ పోస్టాఫీసు పథకం కింద వడ్డీ నెల తర్వాత ప్రారంభమవుతుంది. వడ్డీ నుంచి వచ్చే ఆదాయం నెలకు రూ. 5,500 వరకు ఉంటుంది. ఒకే ఖాతాదారుడు తన అకౌంటులో గరిష్టంగా రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ. 5,500 చొప్పున 7.4శాతం వడ్డీ రేటుతో పొందవచ్చు.

జాయింట్ అకౌంట్ విషయంలో ఈ నెలవారీ వడ్డీ మొత్తం రూ. 9,250 అవుతుంది. గరిష్టంగా రూ. 15 లక్షల పెట్టుబడి పొందవచ్చు. నెలవారీ, త్రైమాసిక, 6 నెలలు లేదా వార్షికంగా వడ్డీ డబ్బును తీసుకోవచ్చు. 5 ఏళ్ల వ్యవధి తర్వాత అకౌంటులో డిపాజిట్ చేసిన అసలు మొత్తం సంపాదించిన వడ్డీ కలిపి పొందవచ్చు. 

Disclaimer : పోస్టాఫీసులో ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు ఆ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను పోస్టాఫీసులో సంప్రదించి తెలుసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడి పెట్టండి. ఎవరైనా నిపుణుల సలహాలు తీసుకోండి.