Apple iPhone SE 4 : ఆపిల్ లవర్స్‌కు పండుగే.. అతి తక్కువ ధరకే ఐఫోన్ SE 4 వస్తోంది.. డిజైన్, ఫీచర్లు కెవ్వు కేక.. గెట్ రెడీ!

Apple iPhone SE 4 Launch : ఆపిల్ ఐఫోన్ SE 4 కోసం చూస్తున్నారా? ఫిబ్రవరి 11న ఐఫోన్ ఎస్ఈ 4 మోడల్ లాంచ్ కానుంది. ఈ ఐఫోన్ సరసమైన ధరలో వస్తుందని భావిస్తున్నారు. ధర, ఫీచర్లు, డిజైన్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Apple iPhone SE 4 rumoured to launch

Apple iPhone SE 4 : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ SE 4 వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 11న ఈ ఐఫోన్ మోడల్ అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఐఫోన్ SE మోడల్ అద్భుతమైన ఫీచర్లతో రానుంది. గత వారమే ఆపిల్ విశ్లేషకుడు మార్క్ గుర్మాన్ ఇదే విషయాన్ని వెల్లడించారు.

ఐఫోన్ SE 4 లాంచ్ ఈ వారమే ఉంటుందని ముందుగానే నివేదికలు తెలిపాయి. గతంలో ఐఫోన్ SE 3వ జనరేషన్ మార్చి 2022లో లాంచ్ అయింది. ఇప్పుడు దీనికి అప్‌గ్రేడ్ వెర్షన్ ఐఫోన్ SE 4 మోడల్ 3 ఏళ్ల తర్వాత వస్తుంది. లాంచ్ టైమ్ దగ్గరపడుతున్న కొద్ది ఈ ఐఫోన్ SE 4 మోడల్‌పై మరింత ఆసక్తి పెరుగుతోంది. నెక్స్ట్-జెన్ ఎస్ఈ మోడల్ డిజైన్, స్పెసిఫికేషన్ల పరంగా ఎలా ఉంటుందా? అని ఐఫోన్ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

Read Also : Vivo V50 Launch Date : గుడ్ న్యూస్.. ఏఐ ఫీచర్లతో వివో V50 ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ ఇదేనట.. గెట్ రెడీ!

ఆపిల్ ఐఫోన్ SE 4 డిజైన్ (అంచనా) :
కొత్త ఐఫోన్ ఎస్ఈ పాత డిజైన్‌ను తొలగించి ఐఫోన్ 14 వంటి అద్భుతమైన డిజైన్ అందించనుందని అంచనా. ఈ రీడిజైన్ హోమ్ బటన్, టచ్ ఐడీని తొలగిస్తుంది. ఆ ప్లేసులో ఫేస్ ఐడి టెక్నాలజీని అందించనుంది.

టిప్‌స్టర్ ప్రకారం.. లీకైన డమ్మీ యూనిట్లను పరిశీలిస్తే.. ప్రీమియం మోడళ్లలో కనిపించే డైనమిక్ ఐలాండ్‌కు బదులుగా ఫోన్ ట్రెడేషనల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. అంతేకాదు.. సింగిల్ రియర్ కెమెరా, అలర్ట్ స్లైడర్ స్థానంలో యాక్షన్ బటన్‌ను కూడా ఉండొచ్చునని లీక్‌లు చెబుతున్నాయి.

ఆపిల్ ఐఫోన్ SE 4 ధర (అంచనా) :
ప్రస్తుత మోడల్ ప్రారంభ ధర 429 డాలర్లు కన్నా దాదాపు 500 డాలర్లు వరకు ఉంటుందని అంచనా. కానీ, ఇప్పటికే ఐఫోన్ 16 లాంచ్ కాగా ఈ ఐఫోన్ ధర 799 డాలర్ల వద్ద ఉంది. ఈ ఐఫోన్ కన్నా ఐఫోన్ ఎస్ఈ 4 మోడల్ అత్యంత సరసమైనదిగా చెప్పవచ్చు.

ఆపిల్ ఐఫోన్ SE 4 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, ఫేస్ ఐడీ, USB-C పోర్ట్, సింగిల్ 48MP రియర్ కెమెరాతో వస్తుందని అంచనా. ఆపిల్ మొట్టమొదటి ఇన్-హౌస్ 5G మోడెమ్‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. A18 చిప్ ద్వారా పవర్, 8GB RAMతో వస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

Apple iPhone SE 4 rumoured to launch

ఈ ఐఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు ఇస్తుందని, పర్ఫార్మెన్స్, ఏఐ సామర్థ్యాలతో వస్తుందని భావిస్తున్నారు. ఆసక్తికరంగా, కొత్త ఐఫోన్ SE క్వాల్‌కామ్ స్థానంలో ఇన్-హౌస్ సెల్యులార్ మోడెమ్‌తో రానుంది. తద్వారా ఆపిల్ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే కానుంది.

అదనంగా, ఈ ఐఫోన్ USB-C పోర్ట్‌ను కలిగి ఉంటుందని, ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత మోడల్ యూరోపియన్ మార్కెట్లలో ఆపిల్ అమ్మకాలను తిరిగి ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.

Read Also :  Maha Kumbh : ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసిన కుంభమేళా.. 300 కి.మీ మేర రద్దీ.. 11 గంటలకు పైగా నిలిచిన వాహనాలు.. నెటిజన్ల రియాక్షన్!

ఇందులో టాప్ సైడ్ నాచ్, అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బిల్డ్, వాల్యూమ్, మ్యూట్ బటన్‌తో ఫుల్ స్క్రీన్ ఫ్రంట్ ప్యానెల్‌తో ఉంటుంది. ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుందని, అందుకే తక్కువ ధరలో వస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాదు.. ఆపిల్ ఐఫోన్ SE 3 మాదిరిగా 64GBకి బదులుగా 128GB బేస్ స్టోరేజ్ ఆప్షన్‌ను అందించవచ్చు. కెమెరా ఫీచర్ల విషయానికొస్తే.. ఐఫోన్ SE 4 48MP రిజల్యూషన్‌తో ఒకే రియల్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాతో రానుంది. చివరగా, ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14 మాదిరిగానే బ్యాటరీతో బ్యాకప్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఐఫోన్ 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందించగలదని అంచనా.