Vivo V50 Launch Date : గుడ్ న్యూస్.. ఏఐ ఫీచర్లతో వివో V50 ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ ఇదేనట.. గెట్ రెడీ!

Vivo V50 Launch Date : ఏపీ ఫీచర్లతో వివో V50 ఫోన్ వచ్చే్స్తోంది. భారత మార్కెట్లో ఈ నెల 17న లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo V50 Launch Date : గుడ్ న్యూస్.. ఏఐ ఫీచర్లతో వివో V50 ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ ఇదేనట.. గెట్ రెడీ!

Vivo V50 India Launch Date

Updated On : February 9, 2025 / 6:24 PM IST

Vivo V50 Launch Date : కొత్త స్మార్ట్‌‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఇటీవలి రోజుల్లో వివో V50 టీజర్లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. రాబోయే ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు ప్రదర్శిస్తున్నాయి. డిస్‌ప్లే, కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలతో సహా కీలక స్పెసిఫికేషన్లు కూడా కంపెనీ ధృవీకరించింది.

వివో ఇప్పుడు భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గతంలో, లీక్‌లు అంచనా ఫీచర్ల గురించి సూచించాయి. ఈ వివో ఫోన్ నవంబర్ 2024లో చైనాలో లాంచ్ అయిన వివో S20 రీబ్రాండెడ్ వెర్షన్ అని సూచిస్తున్నాయి.

Read Also : Best ACs Under 30K : బాబోయ్ వేసవి వస్తోంది.. కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ ఏసీలు మీకోసం..!

వివో V50 ఇండియా లాంచ్ తేదీ ఎప్పుడంటే? :
వివో V50 ఫోన్ ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని కంపెనీ ఎక్స్ పోస్ట్‌లో ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అధికారికంగా వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఫోన్‌ను విక్రయిస్తాయి. అధికారిక టీజర్‌లు ఈ ఫోన్‌ను రోజ్ రెడ్, స్టార్రి బ్లూ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్‌లలో అందిస్తున్నట్లు నిర్ధారించాయి.

వివో V50లో సర్కిల్ టు సెర్చ్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్ వంటి ఏఐ ఫీచర్లతో పాటు ఎరేజ్ 2.0, లైట్ పోర్ట్రెయిట్ 2.0 వంటి ఏఐ-బ్యాక్డ్ ఫోటో ఇమేజింగ్, ఎడిటింగ్ ఫీచర్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. వివో V50 క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని వివో ధృవీకరించింది.

ఈ హ్యాండ్‌సెట్ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 7.39ఎమ్ఎమ్ సన్నని ప్రొఫైల్ ఉందని కంపెనీ చెబుతున్నారు. 6,000mAh బ్యాటరీతో ఈ కేటగిరీలో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు.

Read Also : PF Account Balance : ప్రతి నెలా మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బు క్రెడిట్ అవుతుందో లేదో ఇలా ఒక్క క్షణంలో తెలుసుకోండి!

ఆప్టిక్స్ విషయానికొస్తే.. :
వివో V50 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను పొందుతుంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, ఆరా లైట్ ఫీచర్‌తో పాటు 50ఎంపీ అల్ట్రావైడ్ షూటర్ ఉంటాయి. మరోవైపు, ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వివో V50 క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15తో వస్తుంది. గత లీక్‌లను పరిశీలిస్తే.. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుందని సూచించాయి. 12జీబీ + 512జీబీ ర్యామ్, స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లో వస్తుందని భావిస్తున్నారు. 12జీబీ వర్చువల్ ర్యామ్ విస్తరణకు కూడా సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు.