PF Account Balance : ప్రతి నెలా మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బు క్రెడిట్ అవుతుందో లేదో ఇలా ఒక్క క్షణంలో తెలుసుకోండి!
PF Account Balance : పీఎఫ్ అకౌంటుదారులు సులభంగా మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతినెలా మీ పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా?

How To Know Your PF Account Balance
PF Account Balance : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. మీ పీఎఫ్ అకౌంట్లలో నెలకు ఎంత మొత్తంలో పీఎఫ్ క్రెడిట్ అవుతుందో తెలుసా? ఎప్పుడైనా మీరు చెక్ చేసుకున్నారా? అసలు పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఏమి చేయాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి :
పీఎఫ్ బ్యాలెన్స్ 7738299899కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, మీ అకౌంట్లలో అందుకున్న లేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇది కాకుండా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు.
మీరు ప్రైవేట్ రంగంలో పనిచేస్తుంటే.. మీకు పీఎఫ్ అకౌంట్ కూడా ఉంటుంది. మీ ఈ పీఎఫ్ అకౌంట్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12 శాతం పీఎఫ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అదే సమయంలో, కంపెనీ ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లో అంతే మొత్తాన్ని క్రెడిట్ చేస్తుంది.
ఈ డబ్బు పీఎఫ్, పెన్షన్ రెండింటికీ వెళుతుంది. ఈ మొత్తంపై భారీ మొత్తంలో వడ్డీ లభిస్తుంది. ఇప్పుడు కంపెనీ తమ పీఎఫ్ అకౌంట్లలో డబ్బు క్రెడిట్ చేస్తుందా లేదా అనే ప్రశ్న చాలా మంది ఉద్యోగుల మదిలో మెదులుతూనే ఉంది. మీరు మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను కొన్ని సులభమైన మార్గాల్లో చెక్ చేయవచ్చు. అంతేకాదగ.. మీ పీఎఫ్ అకౌంట్లలో ఎంత డబ్బు క్రెడిట్ అవుతుందో కూడా మీకు తెలుస్తుంది.
ఈ నంబర్‌కు మెసేజ్ పంపండి :
ఈపీఎఫ్ఓ సభ్యులు 7738299899కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా వారి పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, వారి ఖాతాలో అందుకున్న లేటెస్ట్ కాంట్రిబ్యూషన్ చెక్ చేయవచ్చు. ఇందుకోసం, మీరు రిజిస్టర్డ్ నంబర్ నుంచి (AN EPFOHO ENG) అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. ఇక్కడ (ENG) అంటే ఇంగ్లీష్ అని అర్థం. మీరు వేరే లాంగ్వేజీలో తెలుసుకోవాలని భావిస్తే.. ఆ భాషలోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేయండి.
ఉమాంగ్ యాప్ ద్వారా ఎలా చెక్ చేయాలంటే? :
ఉద్యోగులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. ఈ యాప్‌ని ఉపయోగించి వినియోగదారులు క్లెయిమ్‌లను సమర్పించవచ్చు. వారి ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను చెక్ చేయొచ్చు. వారి క్లెయిమ్‌లను ట్రాక్ చేయవచ్చు. ఇందుకోసం, మీరు యాప్‌లో మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి, వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి :
మీ మొబైల్ నంబర్ యూఎఎన్‌తో రిజిస్టర్ చేసి ఉంటే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ చేసిన తర్వాత మీకు ఈపీఎఫ్ఓ నుంచి కొన్ని మెసేజ్‌లు వస్తాయి. అందులో మీరు మీ పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్‌ను సులభంగా చెక్ చేయొచ్చు.
ఈపీఎఫ్ఓ పోర్టల్ :
ఈపీఎఫ్ఓ (EPFO) వెబ్‌సైట్‌కి వెళ్లి ఉద్యోగుల సెక్షన్‌పై క్లిక్ చేసి, ఆపై సభ్యుల పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. మీ (UAN) పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీరు పీఎఫ్ పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయవచ్చు. ప్రారంభ, ముగింపు బ్యాలెన్స్‌తో పాటు ఉద్యోగి, యజమాని కాంట్రిబ్యూషన్ షేరింగ్ కూడా చూపుతుంది. ఏదైనా పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ మొత్తం, సేకరించిన పీఎఫ్ పీఎఫ్ వడ్డీ మొత్తం కూడా ఇందులో కనిపిస్తుంది.