iPhone Call Record : ఆపిల్ ఐఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ వచ్చేసింది.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేస్తే చాలు.. ఇదేలా పనిచేస్తుందంటే?

iPhone Call Record : ఎట్టకేలకు ఐఫోన్ యూజర్ల కోసం కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త రికార్డింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ల ఫీచర్‌కు సమానంగా ఉంటుంది. ఇదేలా పనిచేస్తుందంటే?

Apple iPhones get call recording feature

iPhone Call Record : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ ఐఫోన్‌లో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి. ఆపిల్ ఐఫోన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీపరంగా అనేక ఫీచర్లు ఉన్నాయి. తాజాగా ఐఓఎస్ 18 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐఓఎస్ అప్‌డేట్.. ఆపిల్ మిలియన్ల మంది యూజర్లకు అద్భుతమైన కొత్త యాక్టివిటీని ప్రవేశపెట్టింది. దాంతో ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎట్టకేలకు ఐఫోన్ యూజర్లకు కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త రికార్డింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ల ఫీచర్‌కు దగ్గరగా ఉంటుంది. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఆపిల్ మొదటిసారి కాల్ రికార్డింగ్‌ను ప్రవేశపెట్టింది. ఐఓఎస్ 18.1 అప్‌‌డేట్ అనుసరించి వినియోగదారులు వారి సంభాషణల సమయంలో కాల్‌లను రికార్డ్ చేసే ఆప్షన్ గమనించవచ్చు. మీ ఐఫోన్‌లో కాల్స్‌ను ఎలా రికార్డ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

  • రికార్డుకు ముందు కాల్‌ చేయండి లేదా ఇన్‌కమింగ్‌ కాల్స్ లిఫ్ట్ చేయండి.
  • కాల్ కనెక్ట్ అయిన తర్వాత, మీ స్క్రీన్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఈ వైట్ బటన్‌ను ట్యాప్ చేయడం ద్వారా రికార్డింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
  • కాల్ రికార్డ్ అవుతుందని అవతలి వైపు ఉన్న వ్యక్తికి తెలియజేసే ప్రకటన ప్లే అవుతుందని గమనించాలి.

మీరు రికార్డింగ్‌ని స్టాప్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఫైల్ తర్వాత యాక్సెస్ కోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆటోమాటిక్‌గా సేవ్ అవుతుంది. అయితే, రికార్డింగ్ కాల్స్ చట్టపరమైన చిక్కుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారత్‌లో థర్డ్ పార్టీ అనుమతి లేకుండా ఫోన్ కాల్ సంభాషణను రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘన కిందకు వస్తుంది. చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల, మీరు కాల్‌ను రికార్డ్ చేయాలనుకుంటే, ఎల్లప్పుడూ ముందుగా అవతలి వ్యక్తి నుంచి అనుమతిని పొందండి.

ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌లో బ్యాక్ కెమెరాతో సమస్యలను పరిష్కరించే సర్వీసు ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. బాధిత వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు లేకుండా 12 నెలల పాటు కాంప్లిమెంటరీ రిపేర్‌లను పొందవచ్చు. ఆపిల్ ప్రకటనకు ముందు ఆపిల్ ఐఫోన్ రిపేరింగ్ ఖర్చులను భరించిన వినియోగదారులు వాపసుకు అర్హులు. ఆపిల్ ఫ్రీ సర్వీస్ ప్రోగ్రామ్ కింద వినియోగదారులు తమ డివైజ్ వెరిఫికేషన్ తర్వాత బ్యాక్ కెమెరా సమస్యకు రిపేరింగ్ ఎలాంటి ఖర్చు లేకుండా పొందవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ మోడల్స్ మాత్రమే ఈ కెమెరా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కంపెనీ నివేదించింది.

Read Also : BSNL Recharge Plan : జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా..!