iPhone SE 4: శుభవార్త.. ఇక రెడీగా ఉండండి.. ఐఫోన్ ఎస్‌ఈ4 వచ్చేస్తోంది.. ధర ఇంత తక్కువా?

అందరూ అనుకున్నదానికంటే అతి త్వరలోనే...

iPhone SE 4

ఆపిల్‌ నుంచి ఐఫోన్ ఎస్‌ఈ4 కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఐఫోన్‌ వచ్చే వారంలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఆపిల్‌ సంస్థ నుంచి 2025 ఏడాదిలో విడుదల కానున్న మొదటి ఐఫోన్ ఇది.

ముందుగా ఇది ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో వస్తుందని అంచనాలు వచ్చాయి. అయితే, అనుకున్నదానికంటే ముందుగానే ఐఫోన్ ఎస్‌ఈ4 విడుదల అవుతుండడం గమనార్హం.

ఐఫోన్ ఎస్‌ఈ 4.. ఇతర ఐఫోన్‌ల కంటే తక్కువ ధరకు వస్తుండడం, ఫీచర్లు అదిరిపోయేలా ఉండడంతో ఇది బాగా అమ్ముడుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. 2022లో విడుదలైన ఐఫోన్‌ ఎస్‌ఈ 3 మోడల్‌ ప్రారంభ ధర రూ.39,999తో మార్కెట్లోకి వచ్చింది.

ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ ఐఫోన్ ఎస్‌ఈ4 దాని కంటే కొంచెం ఎక్కువ ధరతో వస్తుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్‌ ఎస్‌ఈ 3 ధర రూ.47,600గా ఉండడంతో ఐఫోన్ ఎస్‌ఈ4 ధర రూ.50,000 ఉండవచ్చని తెలుస్తోంది.

Group 1 Result: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. రిజల్ట్స్‌ వచ్చేస్తున్నాయ్..

ఐఫోన్ ఎస్‌ఈ4 గత ఐఫోన్‌ల కంటే భిన్నమైన ఫీచర్లతో వస్తుంది. 6.1 అంగుళాల స్క్రీన్‌తో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇందులో హోమ్ బటన్ ఉండదు. ఫేస్ ఐడీ ఫీచర్‌తో ఇది వస్తుంది.

గత ఏడాది విడుదలైన ఐఫోన్‌ 16 మోడళ్లలో కనపడిన స్పోర్టింగ్‌ కలర్స్‌తో పాటు ఆకర్షణీయమైన షేడ్స్ ఐఫోన్‌ ఎస్‌ఈ 4లోనూ ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పవర్ ఫుల్ ఇంటర్నల్స్ ఐఫోన్ ఎస్‌ఈ4లో ఉంటాయి.

ఐఫోన్ 16లోని స్పోర్టింగ్ ఫన్ కలర్స్ లాంటివి కూడా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ ఎస్‌ఈ4 ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో విడుదల కానుంది. 5జీని సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఐఫోన్‌ ఎస్‌ఈ మోడళ్లు మొత్తం మూడు వచ్చిన విషయం తెలిసిందే.