Group 1 Result: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్..
గ్రూప్-1 పోస్టుల నియామకాలు ముగిశాక, గ్రూప్-2, అనంతరం గ్రూప్-3 పరీక్షల రిజల్ట్స్ విడుదల చేయాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది.

Telangana group-1 Results
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్. మెయిన్స్ ఫలితాలు వారం-పది రోజుల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 563 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది.
ఇందులో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై టీజీపీఎస్సీ పరిశీలన చేస్తోంది. రిజల్ట్స్ వచ్చాక అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను నిర్వహిస్తారు.
Gold And Silver Price: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇక తగ్గవా ఏంటి?
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను మొత్తం 21,093 మంది రాశారు. అంటే 563 పోస్టుల్లో ప్రతి పోస్టుకు సుమారు 38 మంది పోటీలో ఉన్నారు. గ్రూప్-1 పోస్టుల నియామకాలు ముగిశాక, గ్రూప్-2, అనంతరం గ్రూప్-3 పరీక్షల రిజల్ట్స్ విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది.
కాగా, గ్రూప్-1 మెయిన్స్‌లో అభ్యర్థులకు వచ్చిన మార్కులను టీజీపీఎస్సీ తమ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుంది. 6 పేపర్లలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితాను వెల్లడిస్తారు.
అలాగే, అన్ని సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను అభ్యర్థుల పర్సనల్ లాగిన్‌లో ఉంచుతారు. రీకౌంటింగ్ కోసం ఆప్షన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రీకౌంటింగ్ చేయించాలనుకుంటున్న అభ్యర్థులు.. మెరిట్ జాబితా విడుదలైన 15 రోజుల్లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.