Apple October 2025 Event
Apple October 2025 Event : ఆపిల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఆపిల్ మరో కొత్త ఈవెంట్ జరగనుంది. ఇటీవలే (Awe-Dropping) ఈవెంట్‌లో కొత్త ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసిన ఆపిల్ అక్టోబర్ 2025 ఈవెంట్‌కు రెడీ అవుతోంది. ఆపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ఎయిర్ మోడల్స్ మార్కెట్లోకి విడుదల చేసింది.
అయితే, ఇప్పుడు కంపెనీ అక్టోబర్‌లో (Apple October 2025 Event) కొత్త ఈవెంట్ నిర్వహించాలని యోచిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మ్ ప్రకారం.. కుపెర్టినో ఆధారిత దిగ్గజం ఈ ఈవెంట్‌లో ఆపిల్ M5 చిప్‌సెట్‌తో పాటు ఆపిల్ టీవీ, మ్యాక్‌బుక్ ప్రో, విజిన్ ప్రో వంటి కొత్త ప్రొడక్టులను కూడా తీసుకురానుంది. రాబోయే ఆపిల్ అక్టోబర్ ఈవెంట్ 2025లో ఏయే ప్రొడక్టులను లాంచ్ చేయనుందో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యాక్‌బుక్ ప్రో :
ఆపిల్ M5 ప్రాసెసర్‌తో లేటెస్ట్ మ్యాక్‌బుక్ ప్రో రాబోయే ఈవెంట్లోనే లాంచ్ కానుందని అనేక రిపోర్టులు సూచించాయి. ఈ డివైజ్‌కు సంబంధించి ఇతర పుకార్ల ప్రకారం.. ఆపిల్ ఈ అక్టోబర్‌లో మాత్రమే ప్రకటించే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్ సన్నని ఛాసిస్, OLED టచ్ స్క్రీన్ వంటి మరిన్ని అప్‌గ్రేడ్‌లతో రానుంది. జనవరి 2026కి ముందుగా సేల్ ప్రారంభమయ్యే అవకాశం లేదని అంటున్నారు.
ఆపిల్ టీవీ :
ఆపల్ టీవీ A17 ప్రో చిప్‌తో రానుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా సపోర్టు అందిస్తుంది. ఆపిల్ టీవీతో N1 చిప్, వై-ఫై సపోర్టును కూడా అందిస్తుంది. ఆపిల్ టీవీలో కూడా ఇంటర్నల్ ఫేస్‌టైమ్ కెమెరాను అందించే అవకాశం ఉంది.
ఎయిర్ ట్యాగ్, ఐప్యాడ్ ప్రో :
రాబోయే ఆపిల్ ఈవెంట్ సందర్భంగా ఎయిర్‌ట్యాగ్ 3x లాంగ్ ప్రొడక్టు ట్రాకింగ్ రేంజ్, వెరీ లో బ్యాటరీ నోటిఫికేషన్‌లతో వస్తుంది. అంతేకాదు.. ఐప్యాడ్ ప్రో డ్యూయల్ ఫ్రంట్ సెన్సార్‌లతో పాటు M5 ప్రాసెసర్‌ను అందించనుంది.
హోమ్‌పాడ్ మినీ :
లేటెస్ట్ హోమ్‌పాడ్ మినీ ఆపిల్ ఇంటెలిజెన్స్, సిరి సపోర్టుతో ఆపిల్ S9 ప్రాసెసర్ లాంచ్ చేయనుంది. ఇతర ఫీచర్లు N1 చిప్, వైఫై 7 సపోర్ట్, మెరుగైన ఆడియో అవుట్‌పుట్, కొత్త కలర్ ఆప్షన్‌లు ఉండొచ్చు.
విజన్ ప్రో, స్టూడియో డిస్‌ప్లే :
ఈ ఏడాదిలో ఆపిల్ విజన్ ప్రో కొత్త హెడ్ స్ట్రాప్‌తో పాటు M5 ప్రాసెసర్ (కనీసం M4) ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొత్త స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, 2025 అక్టోబర్ ఈవెంట్‌లో స్టూడియో డిస్‌ప్లే కొత్త వెర్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో మినీ LED సహా మరిన్ని ఫీచర్లను తీసుకువస్తుంది.