Apple October 28 Event : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మ్యాక్‌బుక్ ప్రో నుంచి ఐమ్యాక్ వరకు భారీ అప్గ్రేడ్లు?
Apple October 28 Event : ఆపిల్ అక్టోబర్ 28న నిర్వహించనున్న ‘Pro and Tell’ ఈవెంట్లో టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రో, కొత్త ఐప్యాడ్ మినీ, ఐమ్యాక్ 2026 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫీచర్లు, అంచనా స్పెసిఫికేషన్లు వివరాలివే..
- Sreehari A
- Published on- October 20, 2026 / 04:45 PM IST
Apple October 28 Event
- టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రో, కొత్త ఐప్యాడ్ మినీ వస్తున్నాయా?
- ఆపిల్ ప్రో అండ్ టెల్ ఈవెంట్లో 3 కొత్త ప్రొడక్ట్స్.. ఫీచర్లు ఇవే
- మ్యాక్‌బుక్ ప్రో నుంచి ఐమ్యాక్ వరకు భారీ అప్గ్రేడ్లు?
Apple October 28 Event : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 28న జరగనున్న ‘Pro and Tell’ ఈవెంట్‌పై టెక్ ప్రపంచంలో ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో కంపెనీ పలు కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో, కొత్త ఐప్యాడ్ మినీ, అప్గ్రేడ్లతో ఐమ్యాక్ 2026 ఈ ఈవెంట్లో హైలైట్‌గా నిలవవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలివే..
ఆపిల్ ‘ప్రో అండ్ టెల్’ ఈవెంట్ ఎప్పుడు? :
అక్టోబర్ 28న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 10 గంటలకు, భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. కొత్త ఆపిల్ డివైజ్‌లను మీడియా ప్రతినిధులు నేరుగా పరిశీలించే అవకాశం కూడా ఉండవచ్చని తెలుస్తోంది.
టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో? :
ఆపిల్ ఈవెంట్లో మ్యాక్‌బుక్ ప్రో అత్యంత ఆకర్షణీయంగా ఉండొచ్చు. ఇందులో ఫస్ట్ టైమ్ టచ్ ప్యానెల్‌ను ఆపిల్ అందించే అవకాశం ఉంది. 14, 16 అంగుళాల వేరియంట్లలో లభించవచ్చని అంచనా. ప్రోమోషన్ టెక్నాలజీతో ఓఎల్ఈడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, P3 వైడ్ కలర్ గామట్ వంటి ఫీచర్లు ఉండవచ్చని సమాచారం. డైనమిక్ ఐలాండ్ తరహా డిస్ప్లే, ఎం5 ప్రో చిప్సెట్, అల్యూమినియం బాడీ కూడా ఇందులో ఉండే ఛాన్స్ ఉంది.
Read Also : Poco X8s Launch : పోకో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త Poco X8s వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!
కొత్త ఐప్యాడ్ మినీ ప్రత్యేకతలివే :
కొత్త ఐప్యాడ్ మినీలో 8.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, సన్నని బెజెల్స్ ఉండవచ్చని అంచనా. A20 ప్రో చిప్సెట్, 12GB ర్యామ్, IP68 రేటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. అంతేకాదు.. 12MP ఫ్రంట్ కెమెరాతో పాటు రియర్ కెమెరా, స్పీకర్లలోనూ అప్గ్రేడ్లు రావచ్చని తెలుస్తోంది.
ఐమ్యాక్ 2026లో అప్గ్రేడ్లివే.. :
ఐమ్యాక్ 2026లో M5 చిప్సెట్, అద్భుతమైన డిస్ప్లే, 32GB ర్యామ్, 2TB స్టోరేజ్ వంటి స్పెసిఫికేషన్లు ఉండవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వివరాలన్నీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఆపిల్ ఈవెంట్లో ఏయే ప్రొడక్టులను ప్రకటిస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాల్సిందే..
