Apple iPhone Plan : ఆపిల్ బిగ్ ప్లాన్.. 2026 నాటికి అమెరికాలో విక్రయించే ఐఫోన్ల అసెంబ్లీ మొత్తం భారత్‌కు..!

iPhone Plan : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన టారిఫ్ నిబంధనల తర్వాత చైనాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ఆపిల్ అడుగులు వేస్తోంది. 2026 నాటికి ఐఫోన్ల అసెంబ్లీని భారత్‌కు మార్చనుంది.

US iPhones in India

Apple iPhone Plan : వచ్చే ఏడాది నాటికి అమెరికాలో విక్రయించే అన్ని ఐఫోన్‌ల అసెంబ్లీని భారత్‌కు మార్చాలని ఆపిల్ యోచిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ నిర్ణయం దేశంలో సరఫరా గొలుసు తగినంత విస్తరణతో పాటు అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలపై ఆధారపడి ఉంటుంది.

Read Also : IRCTC Tour Package : వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీలివే.. ఇలా బుక్ చేసుకోవచ్చు!

రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఆపిల్ కంపెనీని చైనా నుంచి బయటకు వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. సుంకాలకు సంబంధించి చైనాతో చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ సూచించారు.

భారత్‌లో రికార్డు స్థాయిలో ఐఫోన్ల అసెంబ్లీ :
అమెరికాలో విక్రయించే ఐఫోన్‌ల అసెంబ్లీని వచ్చే ఏడాది నాటికి భారత్‌కు మార్చాలని ఆపిల్ యోచిస్తోంది. అయితే, ఆపిల్ కాంట్రాక్ట్ తయారీదారులు ఇప్పటికే ఉన్న సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు. ఫాక్స్‌కాన్ బెంగళూరు ప్లాంట్ ఈ నెలలో గరిష్టంగా 20 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో పనిచేయనుంది.

బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఆపిల్ గత ఏడాదిలో భారత్‌లో 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అసెంబుల్ చేసిన అన్ని ఐఫోన్‌లలో భారత్ ఇప్పుడు దాదాపు 20శాతం వాటాను కలిగి ఉంది. కంపెనీ సరఫరా గొలుసు వ్యూహంలో ఇదో పెద్ద మార్పుగా చెప్పవచ్చు.

Read Also : Oppo A5 Pro vs Vivo T4 : వివో కావాలా? ఒప్పో కావాలా? ఈ రెండు 5G ఫోన్లలో ఏది కొంటే బెటర్? మీదే ఛాయిస్..!

3 నెలల్లో 3 మిలియన్ల ఐఫోన్లు రవాణా :
ఈ ఏడాది 2025 మొదటి 3 నెలల్లో భారత్ నుంచి 30 లక్షలకు పైగా IFO యూనిట్లు సరఫరా అయ్యాయి. భారత్ నుంచి మార్చి త్రైమాసికంలో ఇప్పటివరకు జరిగిన అత్యధిక అమ్మకాలు ఇవే. నో-కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్, ఇ-టైలర్ డిస్కౌంట్లు వంటి పథకాల నేపథ్యంలో ఐఫోన్ అమ్మకాలు ఈ రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఐడీసీ పరిశోధన నిర్వాహకురాలు ఉపాసన జోషి అన్నారు. ఈ ఏడాది భారత్‌లో ఆపిల్ వార్షిక వృద్ధి రేటు 10 శాతం నుంచి 15 శాతం ఉంటుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది.