Apple iOS 18 6
Apple iOS 18.6 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ల కోసం సరికొత్త iOS 18.6 అప్‌డేట్ వచ్చేసింది. ఈసారి అప్‌డేట్ ద్వారా కొత్త ఫీచర్లను చేర్చలేదు. ఈ అప్‌డేట్ ప్రధానంగా బగ్ (Apple iOS 18.6) ఇష్యూలపై ఫోకస్ పెట్టింది.
ఈ ఏడాది చివరిలో iOS 26 అప్‌డేట్ రిలీజ్ కానుంది. కానీ, ఆపిల్ iOS 18.6 అప్‌డేట్ ద్వారా ఐఫోన్లలో ప్రస్తుత బగ్ ఇష్యూలను ఫిక్స్ చేస్తుంది. ఆపిల్ ఐఓఎస్ 18.6 అప్‌డేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏయే ఫీచర్లు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
iOS 18.6 అప్‌డేట్ రిలీజ్ :
ఫోర్బ్స్ ప్రకారం.. ఆపిల్ iOS 18.6లో ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు. అప్‌డేట్ ప్రధానంగా బగ్ ఇష్యూ, సేఫ్టీ అప్‌గ్రేడ్స్ దృష్టి పెట్టింది. అయితే, ముఖ్యమైన మార్పు ఫొటోల యాప్‌లోని బగ్ ఇష్యూ ఫిక్స్ చేస్తుంది. రిలీజ్ నోట్ ప్రకారం.. కొత్త అప్‌డేట్ ఫోటోలలో మెమరీ మూవీలను షేర్ చేయకుండా నిరోధించే ఇష్యూను ఫిక్స్ చేస్తుంది.
iOS 18.6 ఎలా డౌన్‌లోడ్ చేయాలి? :
iOS 18.6 సపోర్టెడ్ ఫోన్లు :
iOS 18 సిరీస్‌లోని గత అప్‌డేట్‌ల మాదిరిగానే iOS 18.6 2018 నుంచి అన్ని ఐఫోన్‌లకు సపోర్టు చేస్తుంది. ఇందులో iPhone Xs, Xs Max, XRతో పాటు అప్పటి నుండి రిలీజ్ అయిన ప్రతి మోడల్ ఉన్నాయి. ఐఫోన్ 16 లైనప్‌లోని అన్ని మోడళ్లతో పాటు సెకండ్, థర్డ్ జనరేషన్ ఐఫోన్ SE రెండూ కూడా సపోర్టు ఇస్తాయి. రాబోయే iOS 19 అప్‌డేట్ కూడా ప్రస్తుతం పబ్లిక్ బీటాలో ఉంది. పబ్లిక్‌గా లాంచ్ అయ్యాక ఐఫోన్ 11 సిరీస్, కొత్త డివైజ్‌లకు మాత్రమే సపోర్టు చేస్తుంది.