Future Apple Watch may be able to monitor blood glucose without pricking the skin
Apple Watch Blood Glucose Feature : ఆపిల్ స్మార్ట్‌వాచ్.. మీ చేతికి ఉంటే డాక్టర్ మీతోనే ఉన్నట్టే.. ఎందుకంటే.. ఆపిల్ వాచ్ ఇప్పుడు డాక్టర్ మాదిరిగా ఎంతోమంది ప్రాణాలను రక్షిస్తోంది. శరీరంలోని అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి వెంటనే అలర్ట్ చేస్తుంది. ఆపిల్ వాచ్‌లో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు అత్యాద్భుతంగా పనిచేస్తున్నాయి. సాధారణంగా ఆపిల్ వాచ్ (Apple Watch) హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లలో ఇప్పటికే గుండె రేటు మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి అనేక ఆరోగ్య సంబంధిత ఫీచర్లను అందిస్తుంది.
ఆపిల్ సొంత వాచీలకు సంబంధించి కొత్త అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లపై నిరంతరం పని చేస్తోంది. కొన్ని ఏళ్ల క్రితమే అనేక వాచ్ మోడల్‌లలో ECG ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. రాబోయే రోజుల్లో ఆపిల్ వాచ్ ద్వారా రక్తంలో గ్లూకోజ్ మానిటరింగ్ సపోర్టు కూడా లభించనుంది. లేటెస్ట్ నివేదిక ప్రకారం.. ఆపిల్ వాచ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్‌ను పొందుతుందనే పుకార్లు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
Apple Watch Blood Glucose Feature : Future Apple Watch may be able to monitor blood glucose
బ్లూమ్‌బెర్గ్ లేటెస్ట్ నివేదిక ప్రకారం.. ఆపిల్ అనుకున్నదానికంటే చాలా వేగంగా కొత్త హెల్త్ ఫీచర్లపై పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సపోర్ట్‌తో త్వరలో ఆపిల్ వాచ్ డయాబెటిక్, నాన్-డయాబెటిక్ పేషెంట్లకు చర్మంపై గుచ్చాల్సిన అవసరం లేకుండానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను టెస్ట్ చేయడంలో సాయపడుతుంది. రక్తం లేకుండా గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించడానికి.. ఆపిల్ ఆప్టికల్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించే సిలికాన్ ఫోటోనిక్స్ చిప్‌ను ఆపిల్ డెవలప్ చేస్తోందని నివేదిక వెల్లడించింది.
అంతేకాదు.. శరీరంలోని గ్లూకోజ్ సాంద్రతను గుర్తించడానికి చర్మం కింద లేజర్ నుంచి కాంతిని పంపిస్తుందని తెలిపింది. ఆపిల్ నో-ప్రిక్ గ్లూకోజ్ మానిటరింగ్ ఇప్పుడు ‘ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ స్టేజ్’లో ఉందని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. అయితే, ఆపిల్ వేరబుల్ వాచ్ ఎవరైనా సులభంగా ధరించడానికి వీలుగా చేతిమణికట్టుకు సరిపోయేలా చాలా చిన్న పరిమాణంలో ఉండాల్సి ఉంటుంది.
Apple Watch Blood Glucose Feature : Future Apple Watch may be able to monitor blood glucose without pricking the skin
చర్మంపై గుచ్చకుండానే బ్లడ్ గూక్లోజ్ టెస్టింగ్? :
ప్రస్తుతం, ప్రోటోటైప్ (prototype) డివైజ్ ఐఫోన్‌కు సమానమైన పరిమాణంలో ఉందని, దీన్ని సులభంగా మనిషి చేతికి పెట్టుకోవచ్చునని చెప్పారు. ఆపిల్ ఫ్యూచర్ వాచ్‌లో రక్తంలో గ్లూకోజ్ మానిటర్ రాబోతుందని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, కంపెనీ చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. నివేదికల ప్రకారం.. 2010లో ఆపిల్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ స్టార్టప్ రేర్‌లైట్ (RareLight)ని కొనుగోలు చేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది.
అప్పటి నుంచి కంపెనీ చాలా రహస్యంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. సీఈఓ టిమ్ కుక్ (Tim Cook), ఆపిల్ వాచ్ హార్డ్‌వేర్ లీడ్ యూజీన్ కిమ్ ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారంటూ ఓ నివేదిక పేర్కొంది. ఆపిల్ చాలా ఏళ్లుగా బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ టెక్‌పై పనిచేస్తున్నప్పటికీ.. చర్మానికి గుచ్చకుండానే రక్తంలో గ్లూకోజ్‌ని పరీక్షించగల రియల్-వరల్డ్ ప్రొడక్టును ఇప్పటివరకూ మార్కెట్లోకి రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Apple Watch Blood Glucose Feature : Future Apple Watch may be able to monitor blood glucose
రక్తంలో గ్లూకోజ్ మానిటరింగ్ సపోర్టుతో ఆపిల్ వాచ్‌ను అధికారికంగా లాంచ్ చేసే ముందు Apple చాలా సమయం తీసుకుంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. Apple కన్నా ముందు.. కొన్ని ఇతర టెక్ కంపెనీలు గతంలో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ టెక్‌పై పనిచేశాయి. అయితే ఇంకా రియల్ ప్రొడక్టులను ప్రకటించలేదు.
2018లో, Alphabet ఆరోగ్య అనుబంధ సంస్థ కన్నీళ్లను ఉపయోగించి గ్లూకోజ్‌ని ట్రాక్ చేసే స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ కోసం ప్లాన్‌లను పూర్తిగా నిలిపివేసింది. భవిష్యత్తులో ఆపిల్ వాచ్‌లు చర్మంపై గుచ్చుకునే అవసరం లేకుండా రక్తంలో గ్లూకోజ్‌ను కచ్చితంగా మానిటరింగ్ చేయలగలవా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఆపిల్ వాచ్ ద్వారా నిజంగానే గ్లూకోజ్ లెవల్స్ టెస్టింగ్ చేయడం సాధ్యమవుతుందా లేదో చూడాలి.