Apple Watch Series 10 : భారీ డిస్‌ప్లే, న్యూ డిజైన్‌తో ఆపిల్ వాచ్ సిరీస్ 10 వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Apple Watch Series 10 : కొత్త ఆపిల్ వాచ్ రిఫ్రెష్డ్, అత్యంత సన్నని డిజైన్‌తో పాటు భారీ స్క్రీన్‌లతో వస్తుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 10 ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Apple Watch Series 10 announced with bigger screen and thinner design

Apple Watch Series 10 : ఆపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్ ప్రారంభమైంది. ఈవెంట్ ప్రారంభమైన తర్వాత కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఆపిల్ వాచ్ 10 గురించి ప్రకటించారు. కొత్త ఆపిల్ వాచ్ రిఫ్రెష్డ్, అత్యంత సన్నని డిజైన్‌తో పాటు భారీ స్క్రీన్‌లతో వస్తుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 10 ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ వాచ్ 10వ వెర్షన్ మరో ఆపిల్ వాచ్ అల్ట్రాలో డిస్‌ప్లే కన్నా పెద్దదిగా ఉండే 40 శాతం బ్రైట్‌నెస్ వైడ్ యాంగిల్ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 10 కేవలం 9.7 మిల్లీమీటర్ల మందంగా ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 9 కన్నా 10 శాతం సన్నగా ఉంటుంది.

ఆపిల్ భారీ ఓఎల్ఈడీ స్క్రీన్ ఇప్పటివరకు ఆపిల్ వాచ్‌లో ఉపయోగించిన అతిపెద్ద స్క్రీన్ ఇదే కావడం విశేషం. వేరబుల్ డివైజ్‌లలో అదనపు లైన్‌ను కలిగి ఉంటుంది. ఆపిల్ వాచ్ వినియోగదారులు వాచ్ స్క్రీన్‌పై లైవ్ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇమెయిల్‌లు చెక్ చేయొచ్చు. అలాగే, మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు.

Apple Watch Series 10 announced ( Image Source : Google )

ఆపిల్ వాచ్ 10వ జనరేషన్.. కంపెనీ స్మార్ట్‌వాచ్ కోసం దాదాపు దశాబ్దం అప్‌డేట్స్ తర్వాత వస్తుంది. ఆపిల్ మొదట్లో దీనిని ఫ్యాషన్ యాక్సెసరీగా, ఐఫోన్ తదుపరి మోడల్‌గా మార్కెటింగ్ చేయడంపై దృష్టిపెట్టింది. అయితే, ఆపిల్ వాచ్ అప్పటి నుంచిహార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు, (watchOS)కి కొత్త ఫీచర్ల ద్వారా ముఖ్యమైన ఆరోగ్య, ఫిట్‌నెస్ టూల్‌గా మారిపోయింది

ఆపిల్ వాచ్ సిరీస్ 10 గత ఏడాదిలో ఆపిల్ వాచ్ సిరీస్ 9 మాదిరిగా ఉంటుంది. ఫోన్ కాల్‌లకు “డబుల్ ట్యాప్” గెచర్ ఆప్షన్ కలిగి ఉంది. బ్రైట్‌నెస్ స్క్రీన్, కొత్త S9 SiP (ప్యాకేజీలో సిస్టమ్) వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. అలాగే, సిరి రిక్వెస్ట్‌లను కూడా సులభంగా ప్రాసెస్ చేయగలదు. గతంలో ఆపిల్ వాచ్ సిరీస్ 8 అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్, క్రాష్ డిటెక్షన్ టెంపరేచర్ సెన్సార్‌లను కలిగి ఉంది. ఆపిల్ వాచ్ అల్ట్రాతో పాటుగా లాంచ్ అయింది. అయితే, ఈ వాచ్ లార్జ్ స్క్రీన్, ఎక్స్‌ట్రా బటన్లు, ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది.

Apple Watch Series 10

కేవలం 30నిమిషాల్లో 80శాతం రీఛార్జ్ :
ఆపిల్ వాచ్ సిరీస్ 10 కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. 2021 తర్వాత ఆపిల్ తన స్మార్ట్ వాచ్ డిజైన్‌ను అప్‌డేట్ చేయడం ఇదే తొలిసారి. బాడీ ఇప్పుడు సన్నగా ఉంది. రెండు మోడల్‌లలో స్క్రీన్‌లు పెద్దవిగా ఉంటాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 10 కొత్త ఇంటర్నల్ స్పీకర్‌ను కలిగి ఉంది. వినియోగదారులు సాంగ్స్ లేదా పాడ్‌క్యాస్ట్‌లను ప్లే చేయొచ్చు. కొత్త ఆపిల్ వాచ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా కలిగి ఉంది. వినియోగదారులు కేవలం 30 నిమిషాల్లో 80శాతం వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆపిల్ కొత్త బిగ్ స్క్రీన్‌ బెనిఫిట్స్ అందిస్తుంది.

స్లీప్ అప్నియా డిటెక్షన్ ఫీచర్లు :
హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఆపిల్ వాచ్ సిరీస్ 10 స్లీప్ అప్నియాను గుర్తించగలదు. మీరు నిద్రిస్తున్నప్పుడు శ్వాస పదేపదే ఆగి, ప్రారంభమవుతుంది. స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ ఆధారంగా వినియోగదారుకు స్లీప్ అప్నియా ఉన్నప్పుడు ఆపిల్ వాచ్ సిరీస్ 10 గుర్తించగలదు. ఆపిల్ వాచ్ (watchOS 11)లోని కొత్త (Vitals) యాప్‌ ఎలా వర్క్ చేస్తుందో అదేవిధంగా, స్లీప్ అప్నియాకు వినియోగదారులు కొన్ని రోజుల పాటు నిద్రిస్తున్నప్పుడు ఆపిల్ వాచ్‌ని ధరించాల్సి ఉంటుంది.

Apple Watch Series 10 announced ( Image Source : Google )

కొత్త ఆపిల్ వాచ్ మోడల్‌లు దాదాపు నీటి నిరోధకతను కలిగి ఉన్నాయి. ఇప్పుడు 20 మీటర్ల లోతు వరకు హై-స్పీడ్ వాటర్ స్పోర్ట్స్ కూడా కంపెనీ ధృవీకరించింది. దీని కారణంగా, ఆపిల్ డెప్త్ యాప్‌ను (ప్రస్తుతం అల్ట్రా మోడల్‌లకు మాత్రమే కాకుండా) సిరీస్ 10కి తీసుకువస్తోంది. పాలిష్ చేసిన అల్యూమినియంతో జెట్ బ్లాక్ వెర్షన్, స్టెయిన్‌లెస్ స్టీల్ వెర్షన్‌తో పాలిష్ చేసిన టైటానియంతో వస్తుంది.

ఈ నెల 20 నుంచే ప్రీఆర్డర్ సేల్ :
ఆపిల్ వాచ్ సిరీస్ 10 అల్యూమినియం, పాలిష్ టైటానియం ఎండ్ రెండింటిలోనూ వస్తుంది. ఆపిల్ కూడా స్పీడ్ ఛార్జింగ్ ఆపిల్ వాచ్ అని పేర్కొంది. ఈ వాచ్ ధర జీపీఎస్ 44ఎమ్ఎమ్ వెర్షన్‌ ధర 399 డాలర్లు (రూ. 33,498), జీపీఎస్ ప్లస్ సెల్యులార్ వెర్షన్ ధర 499 డాలర్లు (రూ. 41894 ) ఉంటుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 10 ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 9 నుంచే ప్రారంభమవుతాయి. అధికారికంగా వచ్చే వారం సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది.

Read Also : iPhone 16 Pro Price : ఆపిల్ బిగ్ ఈవెంట్‌కు ముందే లేటెస్ట్ ఐఫోన్ 16 ప్రో ధర వివరాలు లీక్..!

ట్రెండింగ్ వార్తలు