Apple Watch Series
Apple Watch Series : ఆపిల్ కొత్త వాచ్ సిరీస్ వచ్చేసింది. కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు “అవే డ్రాపింగ్” సెప్టెంబర్ ఈవెంట్‌లో నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేసింది. ప్రధానంగా 3 కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. అందులో ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఆపిల్ వాచ్ SE 3, వాచ్ అల్ట్రా 3పై మోడల్స్ ఉన్నాయి.
ప్రతి ఒక్క ఆపిల్ వాచ్ వేర్వేరు రకాల యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. 5G కనెక్టివిటీ, అడ్వాన్స్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్ల నుంచి స్పీడ్ ప్రాసెసర్‌లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ వరకు ఆపిల్ వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3, వాచ్ SE 3 గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్ వాచ్ సిరీస్ 11 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ రేంజ్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 11 బెస్ట్ మోడల్. 5G కనెక్టివిటీకి సపోర్టుతో వచ్చిన మొట్టమొదటి ఆపిల్ వాచ్. జర్నీలో ఉన్నప్పుడు ఐఫోన్‌పై ఆధారపడాల్సిన పని ఉండదు. 30 రోజుల వ్యవధిలో బ్లడ్ ప్రెజర్ రేంజ్ ట్రాక్ చేయగలదు. హైపర్‌టెన్షన్ మానిటరింగ్ వంటి ఫీచర్లు, హెల్త్ ట్రాకింగ్ డేటాను అందిస్తుంది. నేరుగా ట్రాన్సాలేషన్ చేయగలదు. రియల్ టైమ్ లాంగ్వేజీ అసిస్టెన్స్ అందిస్తుంది.
Apple Watch Series 11
మన్నిక పరంగా వాచ్ సిరీస్ 11 మోడల్ గత ఏడాది మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, స్ట్రాంగ్ IonX గ్లాస్‌తో వస్తుంది. ఇప్పుడు రెండు రెట్లు స్క్రాచ్-రెసిస్టెంట్. రీసైకిల్ అల్యూమినియం, టైటానియం ఫినిషింగ్‌లలో లభిస్తుంది. 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
రెస్ట్, ఇన్ సైట్స్ కోసం స్లీప్ ప్యాట్రన్స్, స్లీప్ స్కోర్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. watchOS 26లో రన్ అవుతుంది. స్మార్ట్ స్టాక్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆధారితమైన వర్కౌట్ బడ్డీ, రిఫ్రెష్ “లిక్విడ్ గ్లాస్” ఇంటర్‌ఫేస్ వంటి కొత్త ఫీచర్లు, గెచర్ ఆధారిత కంట్రోలింగ్ కూడా పొందవచ్చు.
ఈ ఎంట్రీ-లెవల్ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ S10 ప్రాసెసర్ కలిగి ఉంది. పాత SE కన్నా వేగంగా ఉంటుంది. మొదటిసారిగా ఆపిల్ వాచ్ SE సిరీస్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లేను కలిగి ఉంది. మణికట్టు ఫ్లిక్, డబుల్ ట్యాప్‌ల వంటి గెచర్ కంట్రోలింగ్ సపోర్టు ఇస్తుంది.
ఆపిల్ SE 3కి స్లీప్ అప్నియా డిటెక్షన్, స్లీప్ స్కోర్‌లను అందిస్తుంది. స్పీకర్ ద్వారా నేరుగా మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లను కూడా ప్లే చేయగలదు. డబుల్ ఛార్జింగ్ స్పీడ్, 18 గంటల బ్యాటరీ లైఫ్‌తో కొత్త SE 2022 వెర్షన్ కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది.
Apple Watch SE 3
ఆపిల్ వాచ్ అల్ట్రా 3 : స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ వాచ్ అల్ట్రా 3 అనేది ఆపిల్ వాచ్‌లో ఇప్పటివరకు అతిపెద్ద డిస్‌ప్లే, సన్నని బెజెల్స్ కలిగి ఉంది. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే ప్యానెల్ డైనమిక్‌గా ఉంటుంది. రియల్-టైమ్ సెకన్లను కూడా చూపుతుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 11 మాదిరిగానే అల్ట్రా 3 హైపర్‌టెన్షన్ ట్రాకింగ్, స్లీప్ స్కోర్‌ను కలిగి ఉంది.
కానీ, శాటిలైట్ ఆధారిత ఎమర్జెన్సీ SOS (మూడు ఏళ్లు ఉచితం), ఫైండ్ మై ద్వారా లొకేషన్ షేరింగ్‌తో వస్తుంది. ఆపిల్ వాచ్ 5G కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. బ్యాటరీ లైఫ్ మరొక హైలైట్. సింగిల్ ఛార్జ్‌పై 42 గంటల వరకు లైఫ్ ఉంటుంది. కొనుగోలుదారులు నేచురల్ టైటానియం, కొత్త బ్లాక్ టైటానియం ఫినిషింగ్ మధ్య ఎంచుకోవచ్చు.
ఆపిల్ కొత్త వాచ్ ధరలను కూడా నిర్ణయించింది. ఆపిల్ వాచ్ సిరీస్ 11 ధర రూ. 46,900, ఆపిల్ వాచ్ SE 3 ధర రూ. 25,900, ప్రీమియం వాచ్ అల్ట్రా 3 ధర రూ. 89,900. భారత్ సహా 50కి పైగా దేశాలలో ప్రీ-ఆర్డర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ స్టోర్‌లు, ఇతర రిటైల్ పార్టనర్ల స్టోర్లలో సెప్టెంబర్ 19 నుంచి ఆపిల్ వాచ్ సిరీస్ లభ్యం కానున్నాయి.