Apple Watch : బతికుండగానే భార్యను సమాధిలో పాతిపెట్టిన భర్త.. రక్షించిన ఆపిల్ వాచ్.. ఎలాగో తెలుసా?

Apple Watch : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకూ చాలా స్మార్ట్ వాచ్‌లోని ఫీచర్లు ఎంతో మంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు.. ఆపిల్ స్మార్ట్ వాచ్ ధరించిన ఎంతో మంది యూజర్ల ప్రాణాలను కూడా రక్షించింది.

Apple Watch : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకూ చాలా స్మార్ట్ వాచ్‌లోని ఫీచర్లు ఎంతో మంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు.. ఆపిల్ స్మార్ట్ వాచ్ ధరించిన ఎంతో మంది యూజర్ల ప్రాణాలను కూడా రక్షించింది. ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్‌లలోని హెల్త్ ఫీచర్లు యూజర్లను అనేక సందర్భాల్లో కాపాడాయి. ఆరోగ్య సంబంధత సమస్యలను ముందుగానే డిటెక్ట్ చేసి వినియోగదారులను ఆపిల్ వాచ్ లు అలర్ట్ చేశాయి. ఆపిల్ వాచ్ అలర్ట్ చేసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుని చాలామంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

ఇప్పటికే అనేకమంది ప్రాణాలను కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచ్ మరో మహిళ ప్రాణాలను కాపాడింది. మహిళను ఆమె భర్త కత్తితో పొడిచి ప్రాణాలు ఉండగానే సమాధిలో పాతిపెట్టేశాడు. ఆ సమయంలో ఆమె చేతికి ఆపిల్ వాచ్ ధరించి ఉంది. అదే ఆమె పాలిట దేవుడిలా మహిళ ప్రాణాలు కాపాడింది. ఆపిల్ వాచ్ లేకుంటే ఆ మహిళ బతికే ఉండేది కాదు. గతంలోనూ ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి హృదయ స్పందనల గురించి వెంటవెంటనే అలర్ట్ చేస్తుంటుంది. అలా అనేక మంది ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిన అనేక సంఘటనలు ఉన్నాయి. కానీ ఈసారి, ఆపిల్ వాచ్ భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఒక మహిళను రక్షించడంలో సాయపడింది. ఈ ఘటన వాషింగ్టన్‌లో చోటుచేసుకుంది.

డైలీ మెయిల్‌ నివేదిక ప్రకారం.. భర్త చేతిలో హత్యకు గురైన భార్య కత్తిపోట్లకు గురైంది. అయితే అప్పటికి ప్రాణాలు కోల్పోలేదు. ఇంకా కొనఊపిరితోనే ఉంది. అయినప్పటికీ ఆమె చనిపోయిందనకుకుని సమాధిని తవ్వి భార్యను అందులో పూడ్చిపెట్టాడు. కాసేపటికే ఆమె తన చేతికి ధరించిన ఆపిల్ వాచ్ ద్వారా 911 హెల్ప్‌లైన్‌కు డయల్ చేసింది. ఏదోలా సమాధిలో నుంచి ఆమె బయటకు వచ్చింది. 42 ఏళ్ల యంగ్ సూక్ అన్‌ను సీటెల్‌కు నైరుతి దిశలో 60 మైళ్ల దూరంలో ఉన్న సమాధిలో ఆమెను భర్త పాతిపెట్టాడు.

Apple Watch Features, woman buried alive, buried alive in grave

ఆపిల్ వాచ్ ద్వారా లొకేషన్ ట్రాక్ చేసిన పోలీసులు సూక్‌ అనే మహిళను రక్షించారు. అయితే ఆమెను ఎవరో కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. దాంతో ఆ మహిళ తన భర్త చంపడానికి ప్రయత్నించాడని అని తెలిపింది. మహిళను గుర్తించిన సమయంలో ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆమె మెడకు డక్ట్ టేప్ చుట్టేసి ఉందని గుర్తించారు. ఆమె కాళ్లు, చేతులు తలపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఒకే సమయంలో ఆపిల్ వాచ్ కూడా 20 ఏళ్ల కుమార్తెకు ఎమర్జెన్సీ నోటిఫికేషన్‌ను పంపింది. వెంటనే ఆ వాచ్ గురించి తెలిసిన భర్త దాన్ని సుత్తితో పగలగొట్టాడు. చివరికి పోలీసులు భార్య ఫిర్యాదుతో భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు.

కొన్ని రోజుల క్రితం.. ఆపిల్ వాచ్ 12 ఏళ్ల వయస్సులో అరుదైన క్యాన్సర్‌ను కనుగొన్న సంగతి తెలిసిందే. ఆపిల్ వాచ్ అసాధారణ స్థితిలో హై హార్ట్ రేట్ గురించి ఆ అమ్మాయికి అలర్ట్ చేసింది. పదేపదే నోటిఫికేషన్లు రావడంతో బాలికను ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమెకు మొదట అపెండిక్స్ కోసం చికిత్స అందించారు. ఆమె అపెండిక్స్‌పై కణితి ఉందని గుర్తించారు. చాలా అరుదైన క్యాన్సర్ సంబంధిత న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్‌తో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత బాలికకు ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించారు. ఇప్పుడు ఆ బాలిక కోలుకుంటోంది. ఆపిల్ వాచీ లేకుంటే అమ్మాయి కండిషన్ మరింత దిగజారిపోయేదని వైద్యులు తెలిపారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G Services : ఈ నగరాల్లోని ఎయిర్‌టెల్ యూజర్లకు ఫ్రీగా 5G సర్వీసులు.. మీ ఫోన్లో 5G వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు