Apple Wonderlust Event : ఆపిల్ ‘వండర్‌లస్ట్’ లాంచ్ ఈవెంట్.. ఐఫోన్లతో సహా ఏయే కొత్త ప్రొడక్టులు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలంటే?

Apple Wonderlust Event : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ వండర్ లస్ట్ లాంచ్ ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 12న ఆపిల్ ఈవెంట్ జరుగనుంది. అనేక ఆపిల్ కొత్త ప్రొడక్టులకు సంబంధించి అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.

Apple ‘Wonderlust’ Event Tomorrow _ How to Watch Livestream, What to Expect

Apple Wonderlust Event : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ‘వండర్‌లస్ట్’ లాంచ్ (Apple Wonderlust Event) ఈవెంట్ సెప్టెంబర్ 12న మంగళవారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐఫోన్ మేకర్ గత ఏడాది మాదిరిగానే సెప్టెంబర్ లాంచ్ ఈవెంట్ తేదీని ధృవీకరించింది. అయితే, ఆపిల్ కొత్త ప్రొడక్టుల పరంగా ఏమి ఆశించాలనే దాని గురించి ఔత్సాహికులకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే, గత కొన్ని నెలలుగా అనేక నివేదికలు ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు కొత్త ఆపిల్ వాచ్, వాచ్ అల్ట్రా మోడళ్లను లాంచ్ కానున్నట్టు సూచించాయి. ఆపిల్ ఈవెంట్‌లో కంపెనీ తన రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ రిలీజ్ తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

ఆపిల్ ‘వండర్లస్ట్’ ఈవెంట్.. లైవ్ స్ట్రీమిగ్ ఎలా చూడాలి? :
ఆపిల్ లాంచ్ ఈవెంట్ మంగళవారం రాత్రి 10:30 గంటలకు కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో ప్రారంభం కానుంది. మీరు ఆపిల్ అధికారిక YouTube ఛానెల్, Apple.com వెబ్‌సైట్ ద్వారా (Apple Wonderlust Event) ఈవెంట్‌ను చూడవచ్చు. Apple TV+, Apple డెవలపర్ యాప్‌ల ద్వారా కూడా లైవ్ వీక్షించవచ్చు. YouTube ప్లేయర్ ద్వారా ‘వండర్‌లస్ట్’ లాంచ్ ఈవెంట్‌ను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. మంగళవారం ఈవెంట్ ప్రారంభం కాగానే లైవ్ స్ట్రీమింగ్ మొదలవుతుంది.

Read Also : Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.6,999కే సొంతం చేసుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

ఆపిల్ ఏయే ప్రొడక్టులు ఉండొచ్చుంటే? :
రాబోయే ఆపిల్ లాంచ్ ఈవెంట్‌లో అత్యంత ముఖ్యమైన ప్రొడక్టు ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. ఇందులో iPhone 15, iPhone 15 Plus , iPhone 15 Pro, iPhone 15 Pro Max ఉన్నాయి. సాధారణ, ప్రో మోడల్‌ల అప్‌డేట్ చేసిన ప్రాసెసర్‌ల వంటి సాధారణ హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో పాటు కొత్త EU కామన్ ఛార్జర్‌కు అనుగుణంగా USB టైప్-C పోర్ట్‌కు అనుకూలంగా కొత్త హ్యాండ్‌సెట్‌లను ఆపిల్ అందిస్తోంది. ఆపిల్ యాజమాన్య లైటనింగ్ పోర్ట్‌ పూర్తిగా నిలిపివేస్తోంది. ఈ ఫోన్‌లు వేగవంతమైన ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ కూడా అందిస్తాయి. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడళ్లలోని మ్యూట్ స్విచ్‌ను కొత్త ‘యాక్షన్ బటన్’తో రీడిజైన్ చేస్తోంది.

Apple ‘Wonderlust’ Event Tomorrow _ How to Watch Livestream, What to Expect

ఆపిల్ రెండు ప్రో మోడల్‌లు గత వెర్షన్ల మాదిరిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌కు బదులుగా టైటానియం ఛాసిస్‌ను కలిగి ఉండవచ్చు. ఇటీవలి నివేదికల ప్రకారం iPhone 15 సిరీస్ ఈ ఏడాదిలో అన్ని మోడళ్లలో డైనమిక్ ఐలాండ్, అప్‌గ్రేడ్ 48MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కస్టమర్‌లు తమ పాత స్మార్ట్‌వాచ్ నుంచి అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తుంటే.. ఆపిల్ వాచ్ సిరీస్ 9, సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ అల్ట్రా అందించవచ్చు. ఈ రెండు స్మార్ట్‌వాచ్ మోడల్‌లు ఒక అధునాతన S9 చిప్‌ను కలిగి ఉండవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ పర్ఫార్మెన్స్, సామర్థ్యం పరంగా గత మోడల్ కన్నా భారీ అప్‌గ్రేడ్‌లతో రావొచ్చు.

ఆపిల్ ఈవెంట్‌లో USB టైప్-C పోర్ట్‌తో రాబోయే డివైజ్ iPhone 15 సిరీస్ మాత్రమే కాకపోవచ్చు. ఇటీవలి నివేదికల్లో కంపెనీ AirPods Pro (Gen 2) రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌ల రిఫ్రెష్ వెర్షన్‌ను ఛార్జింగ్ పోర్ట్‌తో లాంచ్ చేస్తుందని సూచిస్తున్నాయి. గతంలో ఫస్ట్ జనరేషన్ మోడల్‌ను కంపెనీ MagSafe-సపోర్టింగ్ ఛార్జింగ్ కేసుతో తిరిగి ప్రవేశపెట్టింది. లేటెస్ట్ మోడల్ రాబోయే iPhone 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు USB టైప్-Cకి సపోర్టు అందిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.

ఆపిల్ రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లలో iOS 17, iPadOS 17, macOS 14, tvOS 17, watchOS 10 , macOS Sonoma గురించి మరిన్ని వివరాలను అందించే అవకాశం ఉంది. ‘వండర్‌లస్ట్’ తర్వాత కొన్ని రోజుల్లో యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. ఈ అప్‌డేట్‌ల లేటెస్ట్ బీటా వెర్షన్‌లను పరీక్షించడానికి మీ డివైజ్‌లను ఎన్‌రోల్ చేసి ఉంటే.. స్టేబుల్ ఛానెల్‌కి తిరిగి పొందడమే కాకుండా ఫైనల్ వెర్షన్లను కూడా పొందవచ్చు.

Read Also : iPhone 15 Details Leak : వచ్చే వారమే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఈవెంట్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు