Apple's Diwali 2024 Sale date announced with numerous offers
Apple Diwali 2024 Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పండుగ సేల్స్ తర్వాత, టెక్ దిగ్గజం ఆపిల్ దీపావళి సేల్ 2024 తేదీని కూడా ప్రకటించింది. రాబోయే సేల్‌లో ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఆపిల్ వాచ్ మరిన్నింటితో సహా ఆపిల్ ప్రొడక్టులపై ఆకట్టుకునే డీల్స్, డిస్కౌంట్‌లను అందించే అవకాశం ఉంది.
Read Also : Apple iPhone 17 Leak : ఆపిల్ ఐఫోన్ 17 ఫీచర్లు లీక్.. బిగ్ డిస్‌ప్లే, మరెన్నో అప్‌గ్రేడ్ ఆప్షన్లు ఉండొచ్చు..!
ఆసక్తిగల కొనుగోలుదారులు తమకు ఇష్టమైన ఆపిల్ ప్రొడక్టుల ధరను మరింత తగ్గించడానికి ట్రేడ్-ఇన్ ఫెసిలిటీ, బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. రాబోయే ఆపిల్ దీపావళి సేల్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ దీపావళి సేల్ 2024 :
ఆపిల్ దీపావళి సేల్ 2024 త్వరలో ప్రారంభం కానుంది. ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లోని టీజర్ ప్రకారం.. ‘ఆపిల్ పండుగ ఆఫర్ అక్టోబర్ 3న అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడే సేల్ తేదీని సేవ్ చేయండి’ అని చెబుతోంది. అయితే, కంపెనీ ఇంకా నిర్దిష్ట ప్రొడక్టులపై డీల్‌లు, డిస్కౌంట్‌లను వెల్లడించలేదు. కానీ, కొనుగోలుదారులు కంపెనీ పాపులర్ ప్రొడక్టులపై ఐఫోన్, మ్యాక్‌బుక్, ఆపిల్ వాచ్ వంటి వాటిపై డీల్‌లను పొందవచ్చు.
ఐఫోన్ కొనుగోలుపై బెనిఫిట్స్ ఇవే :
నో కాస్ట్ ఈఎంఐ : కొనుగోలుదారులు బ్యాంకుల నుంచి 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో తక్కువ మొత్తంలో నెలవారీ వాయిదాలను ఎంచుకోవచ్చు.
ఎక్స్ఛేంజ్ : కొనుగోలుదారులు తమ పాత ఫోన్‌పై ఆపిల్ ట్రేడ్-ఇన్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. కొత్త కొనుగోలుపై ఇన్‌స్టంట్ క్రెడిట్‌ని పొందవచ్చు.
ఆపిల్ మ్యూజిక్ : ఎంచుకున్న ఆపిల్ ఫోన్ల కొనుగోలుతో కొనుగోలుదారులు 3 నెలల పాటు ఆపిల్ మ్యూజిక్ ఫ్రీగా పొందవచ్చు.
కొనుగోలుదారులు మీ ఎయిర్‌పాడ్‌లు, ఎయిర్‌ట్యాగ్, యాపిల్ పెన్సిల్ (2వ జనరేషన్) లేదా ఐప్యాడ్‌ని ఎమోజీలు, పేర్లు లేదా సంఖ్యలను ప్రింట్ చేయొచ్చు. ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
మీరు ఐఫోన్ ధర తగ్గింపు కోసం ఎదురుచూస్తుంటే, ఇదే సరైన అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం రూ. 59,600కి అమెజాన్ లిస్టు చేసింది. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ ధరను రూ.41,999కి తగ్గించింది. అదనంగా, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ. 39,999కి తగ్గుతుంది.
Read Also : Motorola Moto G85 : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G85పై బిగ్ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?