Apple Foldable iPhone
Apple Foldable iPhone : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. టెక్ దిగ్గజం ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే, ఈ మడతబెట్టే ఐఫోన్ గురించి కొత్త లీకులు బయటకు వస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు ఆపిల్ ఈ ఫోల్డబుల్ ఫోన్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఐఫోన్ ఫీచర్లు, ధరపై కూడా అనేక లీకులు ఉన్నాయి.
నివేదికల ప్రకారం.. ఐఫోన్ ఫోల్డబుల్ డిజైన్, ఫీచర్లు, ధర విషయంలో కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ఇప్పటికే మీడియాలో అనేక పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో ఇప్పటివరకు అత్యంత సన్నని ఫోన్ ఇదే కావచ్చు. ఇందులో అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ హింజ్ ఉండవచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆపిల్ కంపెనీ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను గేమ్-ఛేంజర్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని సూచిస్తున్నాయి.
ఫోల్డబుల్ ఐఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (లీక్) :
ఆపిల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సంబంధించి అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి. ఐఫోన్ రిలీజ్‌కు ముందే.. ఫోల్డబుల్ ఐఫోన్ గురించి చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చి కువో ఈ ఫోల్డబుల్ ఐఫోన్ బుక్-స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంటుందని రివీల్ చేశారు.
ఐఫోన్ ఫోల్డ్ చేస్తే.. 5.5 అంగుళాల డిస్‌ప్లే, ఫోల్డ్ ఓపెన్ చేస్తే 7.8 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే ఉంటుంది. ఐఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు డివైజ్ మందం 9.5 మిమీ ఉంటుంది. అయితే ఫోల్డ్ ఓపెన్ చేస్తే డివైజ్ మందం 4.5మిమీ ఉంటుంది.
ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్‌లో టైటానియం, స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపయోగించవచ్చు. కేసింగ్ టైటానియం మిశ్రమంతో తయారు కానుంది. మడతబెట్టే ఐఫోన్‌లో ట్విన్ లెన్స్ కెమెరా సిస్టమ్ కూడా ఉండవచ్చు. టచ్ ఐడీ సెక్యూరిటీ ఈ ఫోన్‌కు మరింత సేఫ్టీని అందిస్తుంది. ఫేస్ ఐడీ ఉండదు.
ఎందుకంటే.. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ మందంగా ఉండొచ్చు. లో-ఇంటర్నల్ స్టోరేజీని అందించవచ్చు. “రియల్ ఏఐ-ఆధారిత ఫోన్”గా రానుంది. ఏఐ చాట్, మ్యాప్ వ్యూను భారీ స్క్రీన్‌పై ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. మల్టీ టాస్కింగ్‌లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
బ్యాటరీ లైఫ్, లాంచ్ డేట్ (అంచనా) :
ఆపిల్ మడతబెట్టే ఐఫోన్‌లో హై డెన్షిటీ బ్యాటరీని తీసుకురానుంది. కానీ, కచ్చితమైన బ్యాటరీ సామర్థ్యం రివీల్ చేయలేదు. భారీ ఫోల్డబుల్ డిస్‌ప్లే కోసం కంపెనీ పవర్ కెపాసిటీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్ 2026 చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ధర (అంచనా) :
ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ధరపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ ప్రీమియం మార్కెట్‌లో చేరే అవకాశం ఉంది. ఈ ఐఫోన్ ధర 2వేల డాలర్లు 2,500 డాలర్లు (సుమారు రూ. 2,17,000) మధ్య ఉండవచ్చు.
అత్యాధునిక టెక్నాలజీతో పాటు ప్రీమియం ఫీచర్లు కలిగిన ఫోల్డబుల్ ఐఫోన్ చౌకగా రాదని గమనించాలి. నివేదికలను పరిశీలిస్తే.. రాబోయే ఐఫోన్ పోల్డబుల్ ఫోన్ ప్రారంభ ధర 2,300 డాలర్లు (దాదాపు రూ. 1,98,000) అని సూచిస్తున్నాయి. హై-ఎండ్ కొనుగోలుదారులకు బెస్ట్ ఐఫోన్ అని చెప్పవచ్చు.