Asia Cup India vs Pakistan 2025
Asia Cup India vs Pakistan 2025 : ఆసియా కప్ 2025లో భారత్ తిరుగులేని జట్టుగా దూసుకుపోతుంది. ఇప్పటివరకూ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసింది. సూపర్ ఫోర్ ఫేస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు భారత జట్టు రెడీ అవుతోంది. సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
గ్రూప్ దశలో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. కొన్ని వారాల తర్వాత ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య సూపర్ ఫోర్ దశలో (Asia Cup India vs Pakistan 2025) మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 21న) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌ను SonyLIVలో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.
అయితే, ఈ మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ ప్రియులకు సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలి. కానీ, మీరు జియో యూజర్ అయితే ఇది మీకోసమే.. అనేక జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లలో SonyLIV యాక్సెస్ పొందవచ్చు. ఆసియా కప్ 2025 కూడా ఫ్రీగా చూడొచ్చు.
Read Also : Solar eclipse 2025 : అకాశంలో అద్భుతం.. ఈరోజే సూర్యగ్రహణం.. ఏయే సమయంలో చూడొచ్చు? భారత్‌లో మనకు కనిపిస్తుందా?
జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే :
మీకు స్ట్రీమింగ్ యాక్సెస్ కోసం జియో ప్లాన్‌లలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.
రూ. 445 ప్లాన్ : రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, SonyLIV, Zee5, వ్యాలిడిటీ 56 రోజులు.
రూ. 175 ప్లాన్ : 28 రోజుల పాటు 10GB డేటా, SonyLIVతో సహా 10 OTT యాప్‌లకు యాక్సెస్
రూ. 1,049 ప్లాన్ : రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, SMS, ప్లస్ SonyLIV, Zee5 సబ్‌స్క్రిప్షన్‌లతో ప్రీమియం ప్లాన్.
భారత్ సూపర్ ఫోర్ షెడ్యూల్ ఆసియా కప్ 2025 :
సెప్టెంబర్ 21 (ఆదివారం) : ఇండియా vs పాకిస్తాన్ రాత్రి 7:30, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్
సెప్టెంబర్ 24 (బుధవారం): ఇండియా vs బంగ్లాదేశ్ రాత్రి 7:30, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్
సెప్టెంబర్ 26 (శుక్రవారం): భారత్ vs శ్రీలంక, రాత్రి 7:30, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్