Asus ROG Phone 7 Series : భారత్‌కు ఆసుస్ లేటెస్ట్ గేమింగ్ 5G ఫోన్.. స్పెషల్ ఫీచర్లతో ROG ఫోన్ 7 సిరీస్.. ధర ఎంతంటే?

Asus ROG Phone 7 Series : కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి (Asus) కంపెనీ నుంచి సరికొత్త గేమింగ్ ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో (Asus ROG Phone 7) సిరీస్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర ఎంతంటే..

Asus ROG Phone 7 Series : భారత మార్కెట్లోకి ఆసుస్ (Asus) నుంచి లేటెస్ట్ గేమింగ్ ఫోన్‌ ప్రవేశపెట్టింది. (ROG Phone 7 Series) పేరుతో కంపెనీ రెండు మోడల్స్ తీసుకొచ్చింది. ఈ రెండూ వేర్వేరు ధరలతో వచ్చాయి. ఈ కొత్త 5G ఫోన్‌లు Qualcomm టాప్-ఎండ్ ప్రాసెసర్, కూలింగ్ సిస్టమ్‌లతో పాటు, స్పీకర్‌లతో వచ్చింది. గత వెర్షన్ల కన్నా 50 శాతం ఎక్కువ సౌండ్ సిస్టమ్ కలిగి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఆసుస్ డిస్ప్లే, స్పెషిఫికేషన్లు, బ్యాటరీ యూనిట్‌ను మార్చలేదు. ఆసుస్ అందించే లేటెస్ట్ గేమింగ్ ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆసుస్ ROG ఫోన్ 7 సిరీస్ ఫీచర్లు :
ఆసుస్ ROG ఫోన్ 7 సిరీస్ అల్టిమేట్ వెర్షన్ 6.78-అంగుళాల OLED డిస్‌ప్లేతో 1,500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వచ్చింది. ఈ ఫోన్ ప్యానెల్ 165Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. హుడ్ కింద, 6,000mAh బ్యాటరీ ఉంది. కంపెనీ 65W సపోర్టును అందిస్తుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో 33W ఛార్జర్‌ను మాత్రమే అందిస్తుంది. డివైజ్‌లు వెనుకవైపు కూడా అదే ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఇందులో 50-MP మెయిన్ కెమెరా, 13-MP అల్ట్రావైడ్ సెన్సార్, 5-MP మాక్రో కెమెరా ఉన్నాయి. యూనిట్‌లు ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తాయి.

Read Also : Aadhaar Update Online : మీ ఆధార్ కార్డులో అడ్రస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీని ఇలా ఈజీగా మార్చుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Asus ROG ఫోన్ 7 అల్టిమేట్.. స్పెషల్ ఫీచర్ :
స్టాండర్డ్ వెర్షన్‌తో పోల్చితే.. అల్టిమేట్ వెర్షన్ కొంచెం ఖరీదైనదిగా చెప్పవచ్చు. ఈ వెర్షన్ ఫోన్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ యాక్సెసరీతో వస్తుంది. ఏరోయాక్టివ్ కూలర్ 7 ద్వారా మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌కి చిన్న ఎయిర్ ఇన్‌లెట్‌ను కలిగి ఉంది. దీన్నే ఏరోయాక్టివ్ పోర్టల్ అని పిలుస్తారు. ఓపెన్ అవుతుంది. ఫోన్ వేడిని తగ్గిస్తుంది. తద్వారా ఫోన్ కూలింగ్ అయ్యేలా చేస్తుంది. కూలింగ్ ప్లేట్స్ ద్వారా వేడిగాలిని బయటకు వెళ్లేలా చేస్తుంది. ఆసుస్ యాక్సెసరీ యూజర్లకు 20 శాతం అదనపు థర్మల్ సామర్థ్యాన్ని అందిస్తుందని పేర్కొంది.

Asus ROG Phone 7 Series launched in India with 165Hz display, AeroActive cooler, 6,000mAh battery, and more

ఏరోయాక్టివ్ కూలర్ 7 యాక్సెసరీలో 77 శాతం ఎక్కువ బాస్ వాల్యూమ్‌ను అందించే సబ్ వూఫర్ ఉందని ఆసుస్ చెబుతోంది. ఈ ఫోన్ డ్యూయల్ ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్‌లకు అదనంగా ఉంటుంది. యూజర్లకు కంట్రోలర్ అందించడానికి 4 ఫిజికల్ బటన్‌లను కూడా కలిగి ఉంది. RGB లైటింగ్ కూడా ఉంది. ఈ డివైజ్ డస్ట్, వాటర్ రిసిస్టెన్స్ కోసం IP54 రేట్ కలిగి ఉంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ కూడా ఉంది. ఆసుస్ ROG ఫోన్ 7 ప్రామాణిక వెర్షన్‌ను కొనుగోలు చేసే యూజర్లు గేమింగ్ యాక్సెసరీని కొనుగోలు చేయాలంటే అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఆసుస్ ROG ఫోన్ 7 : ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన Asus ROG ఫోన్ 7 (12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్) ధర రూ.74,999గా ఉంది. ROG ఫోన్ 7 అల్టిమేట్ 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.99,999గా ఉంది. ఆసుస్ ఇండియా (Asus India) ఆన్‌లైన్ స్టోర్‌, ఆసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో ఎంపిక చేసిన ROG స్టోర్‌లు, విజయ్ సేల్స్ ఆన్‌లైన్ (Vijay Sales Online), ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

Read Also : Flipkart Summer Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.12,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

ట్రెండింగ్ వార్తలు