Aadhaar Update Online : మీ ఆధార్ కార్డులో అడ్రస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీని ఇలా ఈజీగా మార్చుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Aadhaar Update Online : మీ ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా? ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు (Aadhaar Card)లోని వివరాలను సులభంగా మార్చుకోవచ్చు. అడ్రస్ లేదా ఫోన్ నెంబర్, పుట్టిన తేదీని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Aadhaar Update Online : మీ ఆధార్ కార్డులో అడ్రస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీని ఇలా ఈజీగా మార్చుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Aadhaar Update Online _ How to change address, phone number, date of birth in Aadhaar card

Aadhaar Update Online : భారత ప్రభుత్వం జారీ చేసిన ఏకైక గుర్తింపు కార్డు ఆధార్ (Aadhaar). ఈ ఆధార్ కార్డులోని వ్యక్తిగత సమాచారాన్ని మార్చుకోవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను ఈజీగా అప్‌డేట్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో అడ్రస్, ఫోన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ (DOB) ఎలా మార్చాలో తెలుసా? ఇదిగో ఈ కింది విధంగా ప్రయత్నించండి..

* ఆధార్ కార్డులో (UIDAI) అధికారిక వెబ్‌సైట్‌ను (https://uidai.gov.in/) విజిట్ చేయండి. UIDAI అధికారిక వెబ్‌సైట్లో ‘My Aadhaar’ ట్యాబ్ క్రింద ఉన్న ‘Update Aadhaar’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

* ‘Update Demographics Data Online’పై Click చేయండి. ‘Update Aadhaar’ సెక్షన్‌లో ‘Update Demographics Data Online’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

* మీ ఆధార్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. ‘Send OTP’ బటన్‌పై Click చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని అందుకుంటారు.

* మీకు ఇచ్చిన ఫీల్డ్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి ‘Login’ బటన్‌పై Click చేయండి.

* మీరు అప్‌డేట్ చేయాలనుకునే అడ్రస్, ఫోన్ నంబర్, పేరు లేదా DOB వంటి ఫీల్డ్‌లను ఎంచుకోండి.

* మీరు ఒకేసారి అప్‌డేట్ చేయడానికి మల్టీ ఫీల్డ్‌లను ఎంచుకోవచ్చు.

Read Also : Update Aadhaar Card Online : జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు!

* మీరు చేయాలనుకునే మార్పులకు సపోర్టు ఇచ్చే డాక్యుమెంట్లతో స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి. ఉదాహరణకు, మీ అడ్రస్ అప్‌డేట్ చేయాలనుకుంటే.. యుటిలిటీ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌పోర్ట్ వంటి అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి. అదేవిధంగా, ఇతర ఫీల్డ్‌లను అప్‌డేట్ చేయడానికి UIDAI మార్గదర్శకాల ప్రకారం.. అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.

Aadhaar Update Online _ How to change address, phone number, date of birth in Aadhaar card

Aadhaar Update Online _ How to change address, phone number, date of birth in Aadhaar card

* మీరు చేసిన మార్పులను రివ్యూ చేయండి. ఆ డేటాను ధృవీకరించండి. ‘Submit’ బటన్‌పై Click చేయండి.

* స్క్రీన్‌పై కనిపించే లిస్టు నుంచి BPO సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి. ఆధార్ అప్‌డేట్ అభ్యర్థనలను నిర్వహించడానికి BPO సర్వీస్ ప్రొవైడర్‌లకు UIDAI ద్వారా అధికారం ఉంది.

* మీ అప్‌డేట్ రిక్వెస్ట్ నిర్ధారించి, ‘Submit’ బటన్‌పై Click చేయండి.

* ఆధార్ మార్పు రిక్వెస్ట్ సమర్పించిన తర్వాత.. మీ ప్రత్యేకమైన అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)తో Confirmation అందుకుంటారు. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం URNని జాగ్రత్తగా దగ్గర ఉంచుకోండి.

* మీరు UIDAI వెబ్‌సైట్‌లోని URNని ఉపయోగించి లేదా UIDAI మొబైల్ App ద్వారా మీ అప్‌డేట్ అభ్యర్థన స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.

ఆధార్ కార్డ్‌లోని వ్యక్తిగత డేటాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం (UIDAI) ద్వారా వెరిఫికేషన్ లోబడి ఉంటుందని గమనించాలి. అప్‌డేట్ అభ్యర్థన ఆమోదించిన తర్వాత, మీరు సవరించిన డేటాతో అప్‌డేట్ ఆధార్ కార్డ్‌ని అందుకుంటారు.

Read Also : Uber Cab Fare Charges : ఇదెక్కడి చోద్యం.. ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంటే.. కస్టమర్లపై ఉబర్ ఛార్జీల బాదుడు.. ఇందులో నిజమెంత?!