Asus Zenbook Duo : డ్యూయల్ స్ర్కీన్ డిస్‌ప్లేతో కొత్త అసుస్ జెన్‌బుక్ డుయో 14 ల్యాప్‌టాప్.. ఫీచర్లు, ధర వివరాలివే!

Asus Zenbook Duo Launch : హై స్పెసిఫికేషన్‌ల కోసం చూస్తున్న కస్టమర్‌లు ఇంటెల్ కోర్ అల్ట్రా 9 సీపీయూలతో మోడల్‌లను ఎంచుకోవచ్చు. దీని ధర రూ. 2,19,990 నుంచి ప్రారంభమవుతుంది.

Asus Zenbook Duo : డ్యూయల్ స్ర్కీన్ డిస్‌ప్లేతో కొత్త అసుస్ జెన్‌బుక్ డుయో 14 ల్యాప్‌టాప్.. ఫీచర్లు, ధర వివరాలివే!

Asus ZenBoook Duo 14 with dual OLED displays launched in India

Asus Zenbook Duo (2024) : భారత మార్కెట్లో అసుస్ నుంచి సరికొత్త డ్యూయల్ స్ర్కీన్ ల్యాప్‌టాప్ వచ్చేసింది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ 1,59,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే, అసుస్ వైడ్ రేంజ్ ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు, డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ అప్‌గ్రేడ్ వెర్షన్‌తో వచ్చింది. ఈ డివైజ్ అసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొత్త పవర్‌ఫుల్ స్పెషిఫికేషన్లు, మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంది.

Read Also : Ola electric Scooter : హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా కన్నా చౌకైన ధరకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 95కి.మీ టాప్ రేంజ్..!

భారత్‌లో అసుస్ జెన్‌బుక్ డుయో (2024) లాంచ్, ధర, ఫీచర్లు ఇవే :
అసుస్ జెన్‌బుక్ డుయో (2024) ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌తో కూడిన బేస్ మోడల్ ధర రూ. 1,59,990 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ మోడల్‌ను కూడా కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 1,99,990గా నిర్ణయించింది. హై స్పెసిఫికేషన్‌ల కోసం చూస్తున్న కస్టమర్‌లు ఇంటెల్ కోర్ అల్ట్రా 9 సీపీయూలతో మోడల్‌లను ఎంచుకోవచ్చు. దీని ధర రూ. 2,19,990 నుంచి ప్రారంభమవుతుంది.

అసూస్ జెన్‌బుక్ డుయో (2024) 1,900 x 1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో డ్యూయల్ ఫుల్-హెచ్‌డీ+ ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్‌లతో సహా ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ స్క్రీన్‌లు 100 శాతం డీసీఐ:పీ3 కలర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. హుడ్ కింద, ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌ల ద్వారా పవర్ అందిస్తుంది. గరిష్టంగా 32జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 2టీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజీ బ్యాకప్‌తో వస్తుంది.

జెన్‌బుక్ డుయో (2024)లో వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, రెండు థండర్‌బోల్డ్ 4 పోర్ట్‌లు, సింగిల్ యూఎస్‌బీ 3.2 జెనరేషన్ 1 టైప్-ఎ పోర్ట్, హెచ్‌డీఎంఐ 2.1 పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఉన్నాయి. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ల్యాప్‌టాప్‌లు విండోస్ 11 హోమ్‌తో ప్రీ-ఇన్‌స్టాల్ అవుతాయి. అదనపు ఫీచర్ల విషయానికొస్తే.. జెన్‌బుక్ డుయో (2024) ఫేస్ ఐడెంటిటీ, వీడియో కాల్‌ల కోసం ఫుల్-హెచ్‌డీ ఏఐసెన్స్ ఐఆర్ కెమెరాతో పాటు యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో రెండు హార్మోన్ కార్డాన్-ట్యూన్డ్ స్పీకర్‌ల ద్వారా ఆడియో క్వాలిటీని అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 75WHr లిథియం పాలిమర్ బ్యాటరీతో ఆధారితమైనది. యూఎస్‌బీ టైప్-సి ద్వారా 65డబ్ల్యూ వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Apple iPhone 14 Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఎక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే?