ATM Fees Hike : మే 1 నుంచి కొత్త రూల్స్.. ఏటీఎంలో డబ్బులు తీస్తే దబిడి దిబిడే.. లిమిట్ దాటితే ఛార్జీల మోతే..!

ATM Fees Hike : మే 1 నుంచి ఏటీఎం కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఏటీఎంలో డబ్బులను విత్ డ్రా చేసే లిమిట్ దాటితే ఛార్జీలు పడనున్నాయి. కొత్త ఛార్జీల ప్రకారం ఎంత ఛార్జీలు పడనున్నాయో తెలుసా?

ATM Fees Hike

ATM Fees Hike : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఇకపై పరిమితికి మించి డబ్బులు ఏటీఎంలో నుంచి విత్‌‌డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే.. వచ్చే మే 1, 2025 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

వాస్తవానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏటీఎం ఛార్జీల పెంపును ఆమోదించింది. ఈ మార్పు వచ్చే నెల నుంచి వర్తిస్తుంది. ఏటీఎం ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి? ఏయే కస్టమర్లు ఏ మేరకు ప్రభావితమవుతారు? ఎంత మొత్తంలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందో పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Read Also : SIP Formula : ఈ SIP ఫార్ములాతో నెలకు రూ.14వేలు పెట్టుబడి పెట్టండి చాలు.. కేవలం 16ఏళ్లలో రూ. కోటికిపైగా సంపాదించవచ్చు!

ఏటీఎం ఫీజు ఎంత పెరిగింది? :
కొత్త నిబంధనల ప్రకారం.. ఉచిత లావాదేవీ పరిమితి దాటాక ప్రతి ఏటీఎం విత్‌డ్రాకు ఇప్పుడు రూ. 23 వసూలు చేయనుంది. ప్రస్తుత రూ. 21 నుంచి రూ. 2 పెరిగింది. ఈ పెరిగిన రుసుము మే 1, 2025 నుంచి వర్తిస్తుంది. ఏటీఎం ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ మార్పు లేదు :
కస్టమర్లు ఇప్పటికీ తమ బ్యాంకు ఏటీఎంల నుంచి ప్రతి నెలా 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లను పొందవచ్చు. మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 ఫ్రీ లావాదేవీలు, మెట్రోయేతర నగరాల్లో 5 ఉచిత లావాదేవీల సౌకర్యం ఎప్పటిలానే కొనసాగుతుంది. అయితే, మీరు తరచుగా ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తే మాత్రం పెరిగిన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

చిన్న బ్యాంకులపైనే ఎక్కువగా ప్రభావం :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏటీఎం ఛార్జీల పెరుగుదల చిన్న బ్యాంకులపైనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చిన్న బ్యాంకులు పరిమిత సంఖ్యలో ఏటీఎంలు కలిగి ఉంటాయి. పెద్ద బ్యాంకుల నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటాయి.

ఇలాంటి పరిస్థితిలో ఫ్రీ లిమిట్ అయిపోయిన తర్వాత వారి కస్టమర్లు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఏటీఎం ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు తమ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మారిపోతారు.

Read Also : Samsung Galaxy S24 Ultra : అదిరిపోయే డిస్కౌంట్.. ఇలా చేస్తే.. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోన్ రూ.21వేలకే.. డోంట్ మిస్!

ఏటీఎం ఛార్జీలు ఎందుకంటే? :
వైట్-లేబుల్ అంటే థర్డ్ పార్టీ ఏటీఎం ఆపరేటర్లు, బ్యాంకులు చాలా కాలంగా ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన నిర్వహణ ఖర్చుల కారణంగా ఇప్పుడు ఏటీఎం నిర్వహణలో నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆర్బీఐకి ఛార్జీలను పెంచాలని సిఫార్సు చేసింది. దాంతో కేంద్ర బ్యాంకు ఆమోదం తెలిపింది.

బ్యాంకు కస్టమర్లు ఏం చేయాలి? :
మీరు ఏటీఎం అరుదుగా లేదా నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగిస్తుంటే.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, మీరు తరచుగా ఏటీఎం ఉపయోగిస్తుంటే.. మీ హోమ్ బ్యాంక్ ఏటీఎంని ఉపయోగించవచ్చు. లేదంటే డిజిటల్ పేమెంట్లు చేసుకోవడమే బెటర్.