Avoid doing these 5 things or WhatsApp will ban your account
Whatsapp Alert : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ అకౌంట్ వాడేటప్పుడు ఈ 5 విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ఓ నివేదిక హెచ్చరిస్తోంది. లేదంటే వాట్సాప్ అకౌంట్ వెంటనే బ్యాన్ అయ్యే అవకాశం ఉందని అంటోంది. వాట్సాప్ యూజర్ల భద్రత, సెక్యూరిటీకి సంబంధించి ప్రశ్నలు వచ్చినప్పుడు WhatsApp ఎల్లప్పుడూ రాడార్‌లో ఉంటుంది.
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ తరచుగా స్కామర్‌లు, హ్యాకర్లకు లక్ష్యంగా మారుతుంది. ప్లాట్‌ఫారంపై ఫేక్ వార్తలను కూడా వ్యాప్తి చేసే హానికరమైన కార్యకలాపాలను కంట్రోల్ చేసేందుకు WhatsApp తరచుగా సెక్యూరిటీ అప్‌డేట్స్, ప్రైవసీ సర్వీసులను రిలీజ్ చేస్తుంటుంది.
స్కామర్‌లు, ఇతర అనుమానాస్పద అకౌంట్ల నుంచి యూజర్లను సురక్షితంగా ఉంచడానికి ఇన్‌స్టంట్-మెసేజింగ్ యాప్ భద్రతా చర్యలు, స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని అమలు చేస్తోంది. వాట్సాప్ అకౌంట్ వినియోగదారు స్పామ్‌లో చిక్కినప్పుడు.. స్కామ్‌లు లేదా ప్లాట్‌ఫారమ్ ద్వారా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినప్పుడు, కంపెనీ వినియోగదారు నంబర్‌ను బ్లాక్ చేస్తుంది. అంతేకాదు ఆ వాట్సాప్ అకౌంట్ నిషేధిస్తుంది.
Avoid doing these 5 things or WhatsApp will ban your account
WhatsApp నెలవారీ యూజర్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం.. ఆగస్టు నెలలో 2.3 మిలియన్లకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. కానీ కొన్నిసార్లు, వాట్సాప్ అకౌంట్లు పొరపాటున నిషేధానికి గురవుతుంటాయి. వినియోగదారులు తెలియకుండా ప్రైవసీ విధానానికి విరుద్ధంగా ఏదైనా చేసే అవకాశం ఉందని, వాట్సాప్‌లో మెసేజ్‌లు, మీడియాను పంపేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. వాట్సాప్ యూజర్ అకౌంట్లను నిషేధించకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన టిప్స్ ఫాలో అవ్వండి.
WhatsAppలో మీ అకౌంట్ బ్యాన్ చేయకుండా చిట్కాలు ఇవే :
మీ వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు అది రియల్ లేదా ఫేక్ అనేది తెలియకుండా ఫార్వార్డ్ చేయవద్దు. వాట్సాప్ ఇప్పటికే మెసేజ్‌ల ఫార్వార్డింగ్‌ను ఒకేసారి ఐదు చాట్‌లకు లిమిట్ చేసింది. మెసేజ్ ఇప్పటికే ఫార్వార్డ్ అయి ఉంటే.. యూజర్లు గరిష్టంగా ఒక గ్రూప్‌తో సహా ఐదు చాట్‌లకు ఫార్వార్డ్ చేయవచ్చు.
అప్పుడు మీరు స్పామర్‌గా ఫిల్టర్ అవుతారని గుర్తించాలి. ఆటోమేటెడ్ లేదా బల్క్ మెసేజ్‌లను ఎప్పుడు పంపవద్దు. వాట్సాప్ మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని, అవాంఛిత మెసేజ్‌లను పంపే అకౌంట్లను గుర్తించి నిషేధించడానికి యూజర్లకు నివేదికలను పంపుతోంది.
Avoid doing these 5 things or WhatsApp will ban your account
వాట్సాప్‌లో మెసేజ్‌లను లిమిట్‌గా పంపాలని సూచిస్తోంది. మెసేజ్‌లను పంపడాన్ని తరచుగా ఉపయోగించడం వలన యూజర్లు మీ మెసేజ్‌లను రిపోర్టు చేయవచ్చు. మీ అకౌంట్ అనేక సార్లు రిపోర్టు చేసినట్టు అయితే WhatsApp మీ అకౌంటును నిషేధిస్తుంది. ప్రైవసీని ఎల్లప్పుడూ సెట్ చేసుకోవాలి.
యూజర్లు కొన్ని గ్రూపులకు దూరంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని మెసేజ్ చేయాలని కోరితే వారికి అసలే పంపొద్దు. మీరు ఇతర యూజర్ల ద్వారా రిపోర్టు చేయవచ్చు. అనేకసార్లు రిపోర్టు చేసే WhatsApp మీ అకౌంట్ తర్వాత బ్లాక్ చేయవచ్చు. WhatsApp సర్వీసు నిబంధనలను ఉల్లంఘించవద్దు.
అసత్యాలను ఎప్పుడూ పంపవద్దు లేదా చట్టవిరుద్ధమైన, పరువు నష్టం కలిగించే, భయపెట్టే లేదా వేధించే మెసేజ్‌లను పంపవద్దు. WhatsApp సర్వీసుల విభాగంలో అన్ని యూజర్ మార్గదర్శకాలను పేర్కొంది. అనుకోకుండా WhatsAppలో మీ అకౌంట్ బ్యాన్ అయితే మీరు ఈమెయిల్ ద్వారా కంపెనీని సంప్రదించవచ్చు లేదా రివ్యూ కోసం అభ్యర్థించవచ్చు. మీ అకౌంట్ బ్యాన్ అయితే WhatsApp మీకు మెయిల్, నోటిఫికేషన్ పంపుతుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..