Mobile Recharge Plans
Mobile Recharge Plans : మొబైల్ యూజర్లకు బిగ్ బ్యాడ్ న్యూస్.. అతి త్వరలో భారీగా మొబైల్ రీఛార్జ్ ధరలు పెరగనున్నాయి. ప్రధాన టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వచ్చే ఏడాది 2026లో మొబైల్ ప్లాన్‌ల ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. మోర్గాన్ స్టాన్లీ కొత్త రిపోర్టు ప్రకారం.. డిసెంబర్ 2025లో మొబైల్ రీఛార్జ్ రేట్లు పెరుగుతాయని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు టెలికాం కంపెనీలు 2026లో మొబైల్ రీఛార్జ్ రేట్లను పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి.
2026లో 4G, 5G ప్లాన్‌ల ధరలు 16 శాతం (Mobile Recharge Plans) నుంచి 20 శాతం వరకు పెరగవచ్చు. దీని ప్రభావంతో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు భారీగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. రీఛార్జ్ ధరల పెంపుతో 2027 ఆర్థిక సంవత్సరంలో టెలికం కంపెనీల ఆదాయాలు కూడా పెరుగుతాయి.
ఒక్కో కస్టమర్‌కు సగటు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఏఆర్‌పీయూ, రీఛార్జ్ రేట్ల పెంపుతో టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఎక్కువ ప్రయోజనం పొందనుంది. వోడాఫోన్ ఐడియా, జియో, ఎయిర్‌టెల్ వంటి పెద్ద కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి
గతంలో ధరల పెరుగుదల ఎంతంటే? :
గత కొన్ని ఏళ్లలో టెలికాం కంపెనీలు 3 సార్లు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. టెలికం కంపెనీలు తమ బిజినెస్ కోసం 5G నెట్‌వర్క్‌లలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. 2019లో మొబైల్ రీఛార్జ్ ధరలు 15 శాతం నుంచి 50 శాతానికి పెరిగాయి. ఆ తర్వాత, 2021లో 20 శాతం నుంచి 25 శాతం పెరుగుదల కనిపించింది. గత 2024లో ఈ మొబైల్ రీఛార్జ్ ధరలు 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి.
Read Also : Samsung Galaxy S25 5G : కిర్రాక్ ఆఫర్ భయ్యా.. ఈ శాంసంగ్ 5G ఫోన్ చాలా చీప్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు :
టెలికాం రిపోర్టు ప్రకారం.. గతంలో 2026లో నిపుణులు 15 శాతం పెరుగుదలను అంచనా వేశారు. కానీ, మోర్గాన్ స్టాన్లీ ఇప్పుడు ఇంకా ఎక్కువగానే అంచనా వేసింది. కస్టమర్లు అధిక ధరల ప్లాన్‌లను ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు టెలికం కంపెనీలు చౌకైన ప్లాన్‌లను ఎత్తేస్తున్నాయి. ఖరీదైన ప్లాన్‌లకు OTT వంటి బెనిఫిట్స్ అందిస్తున్నాయి. వినియోగదారుల జేబులపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది.
మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు ప్రకారం.. గత మొబైల్ ధరల పెంపుతో ఎయిర్‌టెల్ భారీగా లాభపడింది. ఈ టెలికం దిగ్గజం ఆదాయం లాభాలు ఇతర కంపెనీల కన్నా ఎక్కువగా పెరిగాయి. ఇదే జోరుతో ముందుకు కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో 5G కవరేజ్ ఇప్పుడు 90 శాతానికి చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగానికి కంపెనీలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి. రిపోర్టు ప్రకారం, ARPU 2032 నాటికి రూ. 370 నుంచి రూ. 390కి చేరుకోవచ్చు.
ఎయిర్‌టెల్ వైస్ చైర్మన్ ఎండీ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. దేశీయ కస్టమర్లపై వచ్చే ఆదాయం GBకి అయ్యే ఖర్చుతో ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని అన్నారు. అందుకే ధరలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్లాన్ స్ట్రక్చర్‌ను మార్చడం వల్ల ARPU ఆటోమాటిక్‌గా పెరుగుతుంది. ప్రస్తుతానికి చాలా ఎయిర్‌టెల్ ప్లాన్‌లు ఒకే విధంగా ఉన్నాయి.
Vi ఏం చెబుతుంది? :
జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రధాన టెలికం దిగ్గజాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేదానిపై ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుందని వోడాఫోన్ ఐడియా సీఈఓ అభిజిత్ కిషోర్ అన్నారు. ధరల పెరుగుదల తప్పనిసరి. కానీ, టారిఫ్ ధరల పెంపు ఎప్పుడు అనేది ఇంకా రివీల్ చేయలేదు.
మొత్తానికి రీఛార్జ్ ధరల పెంపుతో టెలికాం కంపెనీల మొత్తం ఆదాయాలతో దేశీయ జీడీపీలో ఫిలిప్పీన్స్‌ను అధిగమించే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ మొబైల్ టారిఫ్ ధరల భారం వినియోగదారులపై పడుతుంది. ఖరీదైన ప్లాన్ల కోసం కస్టమర్లు భారీగా ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది.