Techie Tenant Interview : బెంగళూరు టెక్కీకి వింత అనుభవం.. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ.. జాబ్ ఇంటర్వ్యూ కన్నా చాలా టఫ్..!

Techie Tenant Interview : బెంగళూరులో ఇంటి కోసం వెతుకుతున్న ఓ టెక్కీకి వింత అనుభవం ఎదురైంది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ మాదిరిగా అద్దె ఇంటి యజమాని చేసిన ఇంటర్వ్యూ తనకు చాలా కఠినంగా అనిపించిందని వాపోయాడు.

Techie Tenant Interview : బెంగళూరు టెక్కీకి వింత అనుభవం.. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ.. జాబ్ ఇంటర్వ్యూ కన్నా చాలా టఫ్..!

Bengaluru techie says his tenant interview was longer than a business meeting

Techie Tenant Interview : బాబోయ్.. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే చాలా కష్టం.. అంతకన్నా ఉద్యోగం దొరకడం చాలా ఈజీ అన్నట్టుగా ఉంది టెక్కీల పరిస్థితి. సాధారణంగా ఏ ఉద్యోగానికైనా వెళ్తే ముందుగా ఆ జాబ్ ఇంటర్వ్యూను క్రాక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఉద్యోగం పొందగలరు. కానీ, బెంగళూరులో ఉద్యోగాన్ని సంపాదించినంతగా అద్దె ఇంటిని సంపాదించడం అంత ఈజీ కాదు.

ఎందుకంటే.. అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే, అద్దె ఇల్లు అడిగిన వెంటనే ఇచ్చే పరిస్థితి ఉండదు. అక్కడి సిటీలో అద్దెకు ఇంటిని తీసుకోవడమంటే కత్తి మీద సాము లాంటిదని చెప్పవచ్చు. ఒకవేళ అద్దెకు ఇల్లు కావాలంటే కచ్చితంగా ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సిందే.  నగరంలో ఇంటి కోసం వెతికేందుకు చాలామంది తీవ్ర అవస్థలు పడుతున్న ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

Read Also : Samsung Galaxy Tab S9 Series : S పెన్‌తో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 సిరీస్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

కొన్నిసార్లు ఇంటి యజమానులు ఇంటర్ పాస్ మెమో చూపించమని అడుగుతారు. అదే టెక్కీలు అయితే తమ లింక్‌డిన్ ప్రొఫైల్‌లను చూపించమంటారు. చాలా సందర్భాలలో ఇంటి యజమానులు హై క్వాలిఫైయిడ్ అద్దెదారులకు మాత్రమే ఇళ్లను అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇలాంటి పరిస్థితే ఓ బెంగళూరు టెక్కీకి ఎదురైంది. గత రెండు నెలలుగా అద్దె ఇంటిని వెతుకున్న ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు.. తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు.

ఇంటిని అద్దెకు ఇచ్చే క్రమంలో తనను ఓ ఇంటి యజమాని గంటల తరబడి ఇంటర్వ్యూ చేశాడని, అది తనకు ఒక బిజినెస్ మీటింగ్ కన్నా ఎక్కువ సమయమేనని అన్నాడు. అంతేకాదు.. తన భార్య లింక్‌డిన్ అకౌంట్ కూడా చెక్ చేసినట్టు తెలిపాడు. అద్దెదారుల విషయానికి వస్తే.. ఇంటి యజమానికి నిర్దిష్ట ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో పేర్కొన్నాడు. అలా బెంగళూరులో అద్దె ఇంటి కష్టాలను ఒక్కొక్కటిగా వెలిబుచ్చాడు.

Bengaluru techie says his tenant interview was longer than a business meeting

Techie Tenant Interview : Bengaluru techie says his tenant interview was longer than a business meeting

‘అద్దె ఇల్లు యజమాని చేసిన ఇంటర్వ్యూ.. బిజినెస్ మీటింగ్ కన్నా సుదీర్ఘమైనది. చాలా కష్టమైనది కూడా. ఇటీవల బెంగళూరులో అద్దె ఇల్లు కోసం వెతికాను. ఒక ఇంటి యజమానిని కలవగా.. ముందుగా నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు’ అని టెక్కీ రాసుకొచ్చాడు. అద్దె ఇంటర్వ్యూకి ముందుగా.. ఇంటి యజమాని తన భార్యకు సంబంధించిన డేటా పాయింట్ల జాబితాను తనకు పంపాలని అడిగాడట..

ఈ జాబితాలో దంపతుల లింక్‌డిన్ ప్రొఫైల్‌లు కూడా ఉన్నాయి. షార్ట్‌లిస్ట్ అయిన తర్వాత ఈ జంటను ఫోన్ కాల్ ద్వారా సంప్రదించాడని టెక్కీ వివరించాడు. ఈ ఫోన్ కాల్ ఇంటర్వ్యూ చాలా పొడవుగా ఉందని, తన పేరు, ​​కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఏ బిజినెస్ చేస్తుంటారు? వంటి వాటి గురించి సుదీర్ఘమైన ప్రశ్నలు అడిగారని తెలిపాడు.

లింక్‌డిన్ ప్రొఫైల్‌ చెక్ చేసిన ఇంటి యజమాని :
ఇల్లు అద్దెకు అడిగిన జంట వద్ద సరిపడా డబ్బు ఉందా? లేదాని నిర్ధారించుకోవాలని భావించాడు. అందులో భాగంగానే అద్దె ఎవరూ చెల్లిస్తారని అడగగా.. ఆ టెక్కీ తన భార్య అద్దె చెల్లిస్తుందని ఇంటి యజమానికి చెప్పాడు. వెంటనే ఇంటి యజమాని టెక్కో భార్య లింక్‌డిన్ ప్రొఫైల్‌ను కూడా చెక్ చేశాడు. అయితే, టెక్కీ భార్య ప్రొఫైల్ ప్రస్తుత జాబ్ రోల్ ఏంటి అనేది అప్‌డేట్ చేయలేదు. అది చూసిన తర్వాత ఇంటి యజమాని ఎక్కుమంది కుటుంబ సభ్యులు కలిగిన వారికి మాత్రమే తన ప్లాట్ అద్దె ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.

అంతేకాదు.. ఇంటి యజమాని తనకు కొన్ని వ్యాపార చిట్కాలను ఇచ్చాడని టెక్కీ చెప్పుకొచ్చాడు. ఇలా తమ మధ్య సంభాషణ చాలా సమయం పాటు కొనసాగిందని తెలిపాడు. చివరికి అద్దె ఇల్లు తీసుకోవడానికి ఆసక్తి ఉన్న మరికొంత మందికి కాల్ చేసిన తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లో తనకు ఏదైన విషయం చెబుతానని అన్నాడు.

Read Also : Netflix Password Sharing : భారత్‌లో నెట్‌‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు.. ఈ ప్లాన్లతో ఫ్రీ మెంబర్‌షిప్ పొందవచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!