Best 5G Smartphones
Best 5G Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారతీయ మార్కెట్లో రూ. 30వేల కన్నా తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాండ్‌లు, ప్రీమియం-గ్రేడ్ కెమెరాలు, పవర్‌ఫుల్ చిప్‌సెట్‌లు, ఫాస్ట్-ఛార్జింగ్ బ్యాటరీలతో పోటీ పడుతున్నాయి.
బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫోన్లను కోరుకునే కొనుగోలుదారులకు ఈ సీజన్‌లో అనేక 5G ఫోన్లు లభ్యమవుతున్నాయి. డిసెంబర్ 2025లో రూ. 30వేల కన్నా తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పుడు చూద్దాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. క్లియర్ డిజైన్ కలిగి ఉంది. 3 పాంటోన్ కలర్ ఆప్షన్లలో ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 ప్రొటెక్షన్ రేటింగ్ కలిగి ఉంది. 6.7-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ pOLED ప్యానెల్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అన్నీ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ మోటోరోలా ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీతో వస్తుంది. బ్యాక్ సెటప్‌లో OISతో 50MP సోనీ ఎల్‌వైటీఐఏ 700C మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా 3x ఆప్టికల్ జూమ్‌ను అందించే 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. మోటోరోలా 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు 3 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తుంది.
ఐక్యూ నియో 10R ఫోన్ రూ. 26,999 ధరతో పర్ఫార్మెన్స్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ఏఐ, ఎరేస్, ఏఐ ట్రాన్స్‌లేషన్ ఏఐ ఫొటో ఎన్‌హాన్స్ వంటి ఏఐ అసిస్టెన్స్ టూల్స్ సూట్‌ను అందిస్తుంది.
ఈ వివో ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. బ్యాక్ సైడ్ OISతో కూడిన 50MP సోనీ IMX882 సెన్సార్ 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలను అందిస్తుంది. భారీ 6,400mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15తో వస్తుంది.
ఈ వివో ఫోన్ రూ. 29,999 ధరకు లభిస్తోంది. వివో V60e కెమెరా సెంట్రలైజడ్ ఆప్షన్ కలిగి ఉంది. 6.77-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ బిలియన్ కన్నా ఎక్కువ కలర్ ఆప్షన్లకు సపోర్టు ఇస్తుంది.
డైమండ్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 200MP ప్రైమరీ కెమెరా OIS, 30x జూమ్‌తో, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో సపోర్ట్ వస్తుంది.
వివో ఐ ఆటో-ఫోకస్‌తో కూడిన 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ప్రియులకు వస్తుంది. ఈ ఫోన్ ఫెస్టివల్ పోర్ట్రెయిట్, ఫోర్ సీజన్ పోర్ట్రెయిట్ మోడ్‌లతో సహా అనేక క్రియేటివిటీ ఏఐ ఫీచర్లను అందిస్తుంది.
90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీ, IP68,IP69 సర్టిఫికేషన్, NFC, IR బ్లాస్టర్ 360-డిగ్రీల యాంటెన్నా సిస్టమ్ ఫీచర్ లిస్టును అందిస్తుంది.
రియల్‌మి 15 5G ఫోన్ ఏఐ అప్ గ్రేడ్‌తో ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్లస్ చిప్‌సెట్‌ను అందిస్తుంది. 12GB వరకు ర్యామ్ అందిస్తుంది. భారీ 7,000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సోనీ IMX882 సెన్సార్‌తో డ్యూయల్ 50MP కెమెరా సిస్టమ్ మెయిన్ ఫొటోగ్రఫీతో వస్తుంది.
అయితే, 50MP సెల్ఫీ కెమెరా 4K వీడియో క్యాప్చర్ అందిస్తుంది. స్పెషల్ ఫీచర్లలో ఏఐ ఎడిట్ జెనీ, వాయిస్ కమాండ్‌లతో ఫొటోలను ఎడిట్ చేయొచ్చు.
బ్యాక్ గ్రౌండ్ మార్చడం నుంచి మ్యాజిక్‌గ్లో 2.0 గ్లేర్ రిమూవర్ వంటి అదనపు ఫీచర్లతో క్రేయేటివిటీని అందిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 ఫోన్ లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్, డైమెన్సిటీ 8350 అపెక్స్ చిప్‌సెట్, 12GB వరకు LPDDR5X ర్యామ్ ద్వారా ఆధారితమైన ఈ ఫోన్ ఆక్సిజన్ OS 15పై రన్ అవుతుంది. 4 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో వస్తుంది.
6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 50MP OIS ఎనేబుల్డ్ సోనీ మెయిన్ కెమెరా 4K HDR వీడియోను అందిస్తుంది.
అయితే, 7,100mAh బ్యాటరీ గేమింగ్ సమయంలో హీటింగ్ లేకుండా బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వాయిస్ స్క్రైబ్ , కాల్ అసిస్టెంట్ వంటి ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి.