Best Affordable Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

Best Affordable Smartphones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రూ. 10వేల ధరలో ఉన్న టాప్ ఫోన్‌లలో రెడ్‌మి ఎ2, రెడ్‌మి 12సీ, శాంసంగ్ గెలాక్సీ ఎ04, రియల్‌మి నార్జో ఎన్53, ఐటెల్ పీ55 5జీ మోడల్స్ ఉన్నాయి.

Best Affordable Smartphones under Rs.10K this November 2023

Best Affordable Smartphones : కొత్త 5జీ ఫోన్ కొంటున్నారా? పండుగ సీజన్ తర్వాత కూడా ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు ఇంతకు ముందు ఆఫర్లను మిస్ చేసుకుంటే బెస్ట్ కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్‌ను అందించే రూ. 10వేల లోపు ధరలో సరసమైన స్మార్ట్‌ఫోన్లను పొందవచ్చు. ఈ ధర పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేయండి.

రెడ్‌మి ఎ2 (4జీబీ ర్యామ్, 64జీబీ రోమ్) :
ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 6,799కి అందుబాటులో ఉంది. హై-పర్ఫార్మెన్స్ మీడియాటెక్ హెలియో జీ36 ప్రాసెసర్, 7జీబీ ర్యామ్ (3జీబీ వర్చువల్ ర్యామ్‌తో సహా) 64జీబీ స్టోరేజీని కలిగి ఉంది. అంతేకాదు.. స్క్రాచ్-రెసిస్టెంట్ గ్లాస్, 120హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 400నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన పెద్ద 16.5సెం.మీ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Redmi A2

Read Also : UPI Transaction Limit : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? గూగుల్ పే నుంచి పేటీఎం దాకా రోజుకు ఎంత డబ్బు పంపొచ్చు?

కెమెరా సెటప్‌లో పోర్ట్రెయిట్ మోడ్‌తో కూడిన 8ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ డివైజ్‌లో బాక్స్‌లో 10డబ్ల్యూ ఛార్జర్‌తో 5000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ప్రత్యేకమైన మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో 1టీబీ వరకు విస్తరించదగిన స్టోరేజీకి సపోర్టు ఇస్తుంది. 4జీ+4జీ కనెక్టివిటీతో డ్యూయల్ సిమ్ (నానో+నానో) డ్యూయల్ స్టాండ్‌బైని అందిస్తుంది.

రెడ్‌మి 12సి (4జీబీ ర్యామ్, 128జీబీ రోమ్) :
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,299 వద్ద అందుబాటులో ఉంది. రెడ‌మి 12సి హై-పర్పార్మెన్స్ గల మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ (2జీహెచ్‌జెడ్ వరకు) గేమింగ్ కోసం 1జీహెచ్‌జెడ్ జీపీయూతో వస్తుంది. అలాగే,4+3జీబీ (వర్చువల్ ర్యామ్) ఎల్‌పీడీడీఆర్4ఎక్స్, పోర్ట్రెయిట్, నైట్ మోడ్‌తో కూడిన 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, 5ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ డివైజ్ స్క్రాచ్-రెసిస్టెంట్ గ్లాస్, ఓలియోఫోబిక్ కోటింగ్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన పెద్ద 17సెం.మీ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఛార్జర్ ఇన్-బాక్స్‌తో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై సపోర్టునుఅందిస్తుంది.

Redmi 12C

శాంసంగ్ గెలాక్సీ ఎ04 :
ఈ గెలాక్సీ ఫోన్ రూ. 8,499 ధరతో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ04 శక్తివంతమైన మీడియాటెక్ హెలియో పీ35 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ని 2.3జీహెచ్‌జెడ్ క్లాక్‌తో కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12లో వన్ యూఐ కోర్ 4.1తో రన్ అవుతుంది. 13ఎంపీ+2ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ డివైజ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ (720 x 1600 పిక్సెల్‌లు), 269 పీపీఐ, 16ఎమ్ కలర్ ఆప్షన్లలో 16.55సెం.మీ (6.5-అంగుళాల) ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 5000ఎంఎహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది.

Samsung Galaxy M04

రియల్‌మి నార్జో ఎన్53 :
ఈ రియల్‌మి నార్జో ఫోన్ ధర ప్రస్తుతం రూ.8,999కు అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ 64జీబీ రోమ్ స్టోరేజీని అందిస్తుంది. 33డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50ఎంపీ ఏఐ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. యూనిసెక్ టీ612 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

realme narzo N53

ఐటెల్ పీ55 5జీ :
ఈ ఐటెల్ పీ55 5జీ ఫోన్ ధర రూ.9,999కు సొంతం చేసుకోవచ్చు. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఎన్ఆర్సీఏ సపోర్టుతో శక్తివంతమైన 5జీ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ రోమ్ (మెమొరీ ఫ్యూజన్‌తో 12జీబీకి విస్తరించవచ్చు). 90హెచ్‌జెడ్ 6.6 హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, యూఎమ్‌సీపీ స్టోరేజ్, ఐవానా చాట్‌జీపీటీ అసిస్టెంట్, 180హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 50ఎంపీ సేల్ఫ్ ఏఐ 8ఎంపీ, డ్యూయల్ కెమెరా 8ఎంపీలను అందిస్తుంది.

itel P55 5G

Read Also : Best Smartphones 2023 : ఈ నవంబర్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!