Samsung Galaxy S24 Plus 5G
అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తోంది. ఇక మొబైల్ ఫోన్లలో ప్రధాన భాగంగా మారుతోంది. కెమెరా ఫీచర్లు, వాయిస్ కంట్రోల్, బ్యాటరీ ఆప్టిమైజేషన్, ట్రాన్స్‌లేషన్లు లాంటి అనేక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీని ఏఐను ఏ రీతిలో ప్రవేశపెడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫీచర్లతో అదరగొట్టేస్తున్న స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటే, 2025లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే..
శాంసగ్ Galaxy S24 Ultra
Galaxy AI అద్భుతంగా పనిచేస్తోంది. వాయిస్ ట్రాన్స్‌లేషన్, Generative Edit లాంటి AI ఫొటో ఎడిటింగ్, సమర్థవంతమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ ఫీచర్లతో వచ్చింది. Samsung, Google సంయుక్తంగా రూపొందించిన ఈ ఫోన్ డాక్యుమెంట్ రిక్వెస్ట్, కాల్ అనువాదం, ఇమేజ్ టచ్‌ప్ వంటి ఫీచర్లలో అదరహో అనిపిస్తోంది.
గూగుల్ Pixel 9 Pro
గూగుల్ నుంచి మరో శక్తిమంతమైన AI లాంచ్ ఇది. “Call Assist 2.0” తో కాల్ హ్యాండ్లింగ్, “Circle to Search” తో సమాచార సేకరణ, చిత్రాల్లో బ్లర్ తొలగింపు, ఆబ్జెక్ట్ మేనిప్యులేషన్ వంటి వాటితో పనిచేస్తోంది. గూగుల్ Gemini Nano AI మోడల్ ఆధారంగా దీన్ని తయారు చేశారు.
వన్‌ప్లస్ 13
స్మార్ట్ చార్జింగ్, ఇమేజింగ్ ఎన్‌హాన్స్‌మెంట్ వంటి ప్రత్యేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ప్రైవసీ ఫీచర్లు బాగా ఉన్నాయి. శక్తిమంతమైన Snapdragon చిప్‌సెట్, కెమెరా ఏఐలో వేగం అన్నీ ఉన్న అద్భుతమైన డివైస్ ఇది.
వివో X200 Pro
ఫొటోగ్రఫీకి ప్రాధాన్యమిచ్చే యూజర్లకు ఇది మంచి ఆప్షన్. Zeissతో కలిసి రూపొందించిన కెమెరా సిస్టమ్‌లో ఏఐ పోస్ట్ ప్రాసెసింగ్, పోర్ట్రైట్ లైటింగ్, రియల్ టైమ్ సీన్ గుర్తింపు లాంటి ఫీచర్లు DSLR స్థాయి ఫొటోలు అందిస్తాయి. Vivo AI అసిస్టెంట్ ట్రాన్స్‌లేషన్లు, స్మార్ట్ షెడ్యూలింగ్‌తో ప్రొఫెషనల్ యూజర్లకు మరింత బాగా పనికొస్తాయి.
ఐఫోన్ 16 Pro
Apple iOS 18 చివరి వెర్షన్లతో “Apple Intelligence”ను బాగా వాడేసింది. రైటింగ్ టూల్స్ మెనూలో టెక్స్ట్ సారాంశం అందించడం, రీరైటింగ్, ఆర్టికల్‌ను టేబుల్ లేదా బులెట్ పాయింట్లుగా మార్చడం సులభతరం చేసింది. ఫొటోస్ యాప్‌లో Clean Up టూల్ తో అనవసరమైన భాగాలను తొలగించవచ్చు. Image Playground ద్వారా కస్టమ్ ఎమోజీలు, AI విజువల్స్ రూపొందించవచ్చు.