రూ.10 వేలలోపే 5G స్మార్ట్‌ఫోన్లు.. ఈ 3 మోడళ్లను అస్సలు మిస్ అవ్వద్దు..
వీటిని Amazonలో నో కాస్ట్ EMI ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.

భారత్‌లో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ స్పీడ్ నెట్‌వర్క్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లోనూ ఉండాలనుకుంటే ఖరీదైన ఫోన్‌ను కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతి తక్కువ బడ్జెట్‌లో కూడా అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి.
మీరు కూడా రూ.10,000 లోపు బెస్ట్ 5G ఫోన్ కోసం చూస్తుంటే, మార్కెట్‌లోని మూడు బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. వీటిని Amazonలో నో కాస్ట్ EMI ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.
Acer Super ZX 5G
ల్యాప్‌టాప్‌లతో మనకు సుపరిచితమైన Acer, ఇప్పుడు బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దుమ్మురేపుతోంది. పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది మంచి ఆప్షన్.
ముఖ్యమైన ఫీచర్లు
ప్రాసెసర్: శక్తిమంతమైన Dimensity 6300 ప్రాసెసర్ రోజువారీ పనులను, గేమింగ్‌ను స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది.
కెమెరా: 64MP ప్రధాన కెమెరా ఉంది. స్పష్టమైన ఫొటోలను అందిస్తుంది.
డిస్‌ప్లే: Full HD డిస్‌ప్లే వీడియోలు, సినిమాలు చూడటానికి అద్భుతంగా ఉంటుంది.
బ్యాటరీ: 5000mAh బ్యాటరీ ఉంది. ఒక రోజంతా ఛార్జింగ్ ఉంటుంది.
ధర: సుమారు రూ.10,999 (Amazon).
ఎవరికి ఇది బెస్ట్? రూ.11,000 బడ్జెట్‌లో మంచి ప్రాసెసర్, మంచి కెమెరా, బ్రాండెడ్ ఫోన్ కోరుకునేవారికి Acer Super ZX 5G మంచి ఆప్షన్.
Samsung Galaxy M06 5G
శాంసంగ్ బ్రాండ్‌లో స్లిమ్ డిజైన్‌తో ఒక బేసిక్ 5G ఫోన్ కావాలనుకునే వారికి Galaxy M06 ఒక మంచి ఆప్షన్.
ముఖ్యమైన ఫీచర్లు
బ్రాండ్ వాల్యూ: శాంసంగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఎంట్రీ-లెవల్ 5G ఫోన్ ఇది.
బ్యాటరీ: 5000mAh బ్యాటరీతో వచ్చింది. రోజంతా ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
ఆపరేటింగ్ సిస్టమ్: లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో వస్తుంది, కాబట్టి మీకు తాజా ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.
యూజర్ రేటింగ్: 3.8 స్టార్లతో మంచి యూజర్ ఫీడ్‌బ్యాక్ ఉంది.
ధర: సుమారు రూ.8,499 (Amazonలో నో కాస్ట్ EMIపై లభిస్తుంది).
Tecno POP 9 5G
తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజ్, మంచి మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునేవారికి Tecno POP 9 5G ఒక ఆల్ రౌండర్ ప్యాకేజ్.
ముఖ్యమైన ఫీచర్లు
స్టోరేజ్: 4GB RAM, 128GB స్టోరేజ్.
ఆడియో: డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్‌తో సినిమా, మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది.
పెర్ఫార్మెన్స్: 4 సంవత్సరాల వరకు ఫోన్ లాగ్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుందని కంపెనీ చెప్పింది.
డిజైన్: IP54 స్ప్లాష్ ప్రొటెక్షన్.. చిన్న చిన్న నీటి తుంపర్ల నుండి ఫోన్‌ను కాపాడుతుంది.
యూజర్ రేటింగ్: 4 స్టార్లతో వినియోగదారుల నుంచి మంచి స్పందన పొందింది.
ధర: సుమారు రూ.8,399 (Amazonలో 30% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది).
ఎక్కువ సినిమాలు చూసేవారికి, పాటలు వినేవారికి, ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే విద్యార్థులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
చివరిగా, మీకు మంచి కెమెరా, పెర్ఫార్మెన్స్ కావాలంటే కొంచెం బడ్జెట్ పెంచి Acer కొనొచ్చు. బ్రాండ్ నమ్మకం ముఖ్యమైతే Samsung, లేదా తక్కువ ధరలో ఆల్-రౌండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ కావాలంటే Tecno POP 9 మీకు సరైన ఆప్షన్.