Best Camera Phones : ఓసారి ఇలాంటి ఫోన్లను ట్రై చేయండి.. రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఏ ఫోన్ కొంటారంటే?

Best Camera Phones : మీరు రూ. 15 వేల బడ్జెట్‌లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు కావాలా? ఆగస్టు 2025లో టాప్ 3 బెస్ట్ కెమెరా ఫోన్లపై ఓసారి లుక్కేయండి.

Best Camera Phones

Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. బెస్ట్ కెమెరా ఫోన్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. భారీ డిస్‌ప్లే, గేమింగ్ చిప్‌సెట్, భారీ బ్యాటరీ (Best Camera Phones) ప్యాక్‌తో వస్తాయి. తద్వారా ఈ ఫోన్‌లను పూర్తిగా ఛార్జ్ చేశాక రోజంతా ఈజీగా వినియోగించుకోవచ్చు.

ఈ ఫోన్‌ ద్వారా ఫాస్ట్ ఛార్జర్‌తో త్వరగా ఛార్జ్ చేయవచ్చు. ఈ బెస్ట్ కెమెరా ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ ఆగస్టులో రూ. 15వేల లోపు ధరలో టాప్ 3 బెస్ట్ కెమెరా ఫోన్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. ఐక్యూ Z9x 5G :
ఐక్యూ Z9x 5G ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ + 2MP డెప్త్ సెన్సార్‌ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. రెండు వైపులా కెమెరాలు అద్భుతమైన ఫొటో క్వాలిటీని అందిస్తాయి. ఈ ఐక్యూ ఫోన్‌లో 6.72 అంగుళాల IPS LCD డిస్‌ప్లే పొందవచ్చు. చాలా మంచి 120 రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ఈ ఐక్యూ ఫోన్‌లో చాలా అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ ఫోన్ విభిన్న ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో వస్తుంది. 4GB లేదా 6GB లేదా 8GB ర్యామ్ ఆప్షన్లతో పొందవచ్చు. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కూడా పొందవచ్చు.

Read Also : Oppo Find X8 Pro Sale : ఒప్పోనా మజాకా.. అతి చౌకైన ధరకే ఒప్పో ఫైండ్ X8 ప్రో.. అమెజాన్‌‌లో ఇలా కొన్నారంటే..!

మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఈ ఐక్యూ ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీతో వస్తుంది. 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. కంపెనీ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది. ఈ ఫోన్‌ను కేవలం రూ. 11,355కు సొంతం చేసుకోవచ్చు.

Best Camera Phones : 2. మోటో G64 5G :

మోటో G64 5G ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌ పొందవచ్చు. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ద్వారా అందిస్తుంది.
ఈ ఫోన్‌లో మీరు మీడియాటెక్ డైమన్షిటీ 7025 గేమింగ్ ప్రాసెసర్‌ పొందవచ్చు. గేమింగ్ సమయంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

బ్యాక్ సైడ్ 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెండు వైపులా ఉన్న కెమెరాలు చాలా మంచి పిక్చర్ క్వాలిటీని అందిస్తాయి. DSLR క్లిక్ చేసిన ఫొటోలు, వీడియోల మాదిరిగా కనిపిస్తుంది. మీరు 33W ఫాస్ట్ ఛార్జర్‌తో 6000mAh లాంగ్ బ్యాటరీని పొందవచ్చు. మీరు ఈ మోటో ఫోన్‌ను కేవలం రూ. 12,999కు పొందవచ్చు.

3. శాంసంగ్ గెలాక్సీ M16 5G :
శాంసంగ్ గెలాక్సీ M16 5G ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ 50MP ప్రైమరీ + 50MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌లో 5000mAh జెయింట్ బ్యాటరీ కలిగి ఉంది.

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ కూడా ఉంది. మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ అమోల్డ్ FHD ప్లస్ రిజల్యూషన్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్‌ను కేవలం రూ. 11,499కు పొందవచ్చు.