రియల్‌మీ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. Realme 15 సిరీస్ వచ్చేస్తోంది.. AI కెమెరాతో మిడ్‌రేంజ్‌లో సంచలనం..

AI కెమెరా, భారీ బ్యాటరీ, శక్తిమంతమైన ప్రాసెసర్, స్టైలిష్ డిజైన్‌తో Realme 15 సిరీస్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది.

Realme 15 5G and Realme 15 Pro 5G

మిడ్‌రేంజ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? కానీ కెమెరా క్వాలిటీ, బ్యాటరీ, పర్ఫార్మెన్స్‌లో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్నారా? అయితే మీ నిరీక్షణకు తెరపడబోతోంది. రియల్‌మీ తన సరికొత్త Realme 15 సిరీస్‌ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

ముఖ్యంగా, Realme 15 Pro 5G మోడల్, ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన AI కెమెరా ఫీచర్లతో వస్తోంది. దీనిని కంపెనీ ముద్దుగా “AI పార్టీ ఫోన్” అని పిలుస్తోంది. దీని విశేషాలేంటో చూద్దాం..

ఈ సారి రియల్‌మీ కెమెరా టెక్నాలజీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. Realme 15 Proలో ఉండే AI టెక్నాలజీ మ్యాజిక్ ఏంటంటే..

  • AIలో లైట్ ఫొటోగ్రఫీ: తక్కువ వెలుతురులో అంటే పార్టీలు, కాన్సర్ట్స్, డ్యాన్స్ ఫ్లోర్స్ వంటి ప్రదేశాల్లో కూడా అద్భుతంగా ఫొటోలు తీస్తుంది.
  • ఆటోమేటిక్ అడ్జస్ట్‌మెంట్: ఇది రియల్ టైమ్‌లో షట్టర్ స్పీడ్, కాంట్రాస్ట్, కలర్స్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల కదులుతున్నప్పుడు కూడా ఫొటోలు బ్లర్ అవ్వకుండా స్పష్టంగా వస్తాయి.

Realme 15 Pro 5G: ప్రో మోడల్‌లో స్పెషల్ ఏముంది?

ఈ మోడల్ సిరీస్‌లోనే హీరోగా నిలవనుంది. లీకుల ప్రకారం ఇందులో ఉండే ఫీచర్లు..

ర్యామ్, స్టోరేజ్: మీ అవసరాలకు తగ్గట్టు 4 వేరియంట్లలో లభించనుంది.

  • 8GB + 128GB
  • 8GB + 256GB
  • 12GB + 256GB
  • 12GB + 512GB (పవర్ యూజర్ల కోసం)

ఆకర్షణీయమైన రంగుల్లో..

  • ఫ్లోయింగ్ సిల్వర్ 
  • సిల్క్ పర్పుల్  
  • వెల్వెట్ గ్రీన్ 

Realme 15 5G: బడ్జెట్‌ ధరలో ఆల్ రౌండర్

బేస్ మోడల్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఇందులో ఉండబోయే అంచనా ఫీచర్లు ఇవే..

  • ప్రాసెసర్: శక్తిమంతమైన Snapdragon 7 Gen 4 చిప్‌సెట్.
  • బ్యాటరీ: 6,300mAh భారీ బ్యాటరీతో రోజంతా చార్జింగ్ టెన్షన్ ఉండదు.
  • చార్జింగ్: 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
  • కెమెరా: 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా.
  • డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే.
  • కలర్స్: సిల్వర్, గ్రీన్, సిల్క్ పింక్.

ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుత అంచనాల ప్రకారం, Realme 15 5G (బేస్ మోడల్) భారత మార్కెట్‌లో రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రో మోడల్ ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, జూలై చివరి నాటికి ఈ సిరీస్ మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

AI కెమెరా, భారీ బ్యాటరీ, శక్తిమంతమైన ప్రాసెసర్, స్టైలిష్ డిజైన్‌తో Realme 15 సిరీస్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది. ముఖ్యంగా ఇతర ప్రో వేరియంట్, ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.