×
Ad

Best Jio IPL Plans : ఐపీఎల్ లవర్స్‌కు పండగే.. ‌ఈ బెస్ట్ జియో ప్లాన్లతో హాట్‌స్టార్‌లో IPL వేలాన్ని ఫ్రీగా చూడొచ్చు.. ఫుల్ లిస్ట్..!

Best Jio IPL Plans : ఐపీఎల్ చూసేవారికోసం జియో అద్భుతమైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఐపీఎల్ వేలం లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీగా ఇలా చూడొచ్చు..

Best Jio IPL Plans

Best Jio IPL Plans : ఐపీఎల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 2025 ఐపీఎల్ వేలం మొదలైంది.. ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ చూడాలనుకుంటున్నారా? అయితే, మీరు జియోహాట్‌స్టార్‌లో ఫ్రీగా చూడొచ్చు. మీ దగ్గర జియో సిమ్ ఉంటే చాలు.. IPL 2025 వేలాలను లైవ్ లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ జియో హాట్‌స్టార్ యాక్సెస్‌ను ఉచితంగా ఎలా పొందాలంటే? మీకోసం బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి..

IPL ఫ్రీగా చూసేందుకు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే :
జియో రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్ :
జియో అందిస్తున్న ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB 4G డేటా, రోజుకు 100 SMS బెనిఫిట్స్ మరిన్నింటిని అందిస్తుంది. ఈ ప్లాన్ యూజర్లకు ఒక నెల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది, అలాగే అన్‌లిమిటెడ్ హైస్పీడ్ 5G డేటాను యాక్సెస్ అందిస్తుంది.

అంతేకాదు, ప్రీపెయిడ్ ప్లాన్ రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ జియోహోమ్ కోసం 2 నెలల ఫ్రీ ట్రయల్, జియో AI క్లౌడ్ కోసం 50GB ఫ్రీ స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది.

Read Also : Vi Insurance Plan : పండగ చేస్కోండి.. జస్ట్ రూ. 61తో మీ ఫోన్‌కు రూ. 25వేల బీమా.. డేటా బెనిఫిట్స్ కూడా.. Vi 3 ప్లాన్లు ఇవే..!

రూ.100 జియో ప్యాక్ :
మీరు ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్ కలిగి ఉంటే.. కేవలం జియోహాట్‌స్టార్ యాక్సెస్ మాత్రమే కావాలంటే.. మీరు రూ.100 జియో ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. 30 రోజుల పాటు జియోహాట్‌స్టార్ టీవీ/మొబైల్ యాక్సెస్‌తో పాటు అదనంగా 5GB 4G హైస్పీడ్ డేటాను అందిస్తుంది. కొత్త కనెక్షన్‌పై మీరు జియోహోమ్ రెండు నెలల ఫ్రీ ట్రయల్‌ను కూడా పొందవచ్చు.

రూ.190 జియో ప్యాక్ :
జియో అందిస్తున్న ఈ ప్యాక్ 90 రోజుల జియో హాట్‌స్టార్ మొబైల్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, 15GB హై స్పీడ్ 4G డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ చాలా బాగుంటుంది. మూడు ప్లాన్‌లలో ఏదైనా తీసుకోవచ్చు. లైవ్ స్ట్రీమ్‌ను ఫ్రీగా పొందవచ్చు.