భారత్‌లో గూగుల్ స్టోర్ ప్రారంభం: Pixel ఫోన్లపై కళ్లుచెదిరే ఆఫర్లు.. ఇప్పుడే కొనేస్తే..

డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లతో లభిస్తున్నాయి.

గూగుల్ భారత్‌లో తన అధికారిక ఆన్‌లైన్ గూగుల్ స్టోర్ ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు గూగుల్ ఫోన్లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఉత్పత్తులను నేరుగా గూగుల్ నుంచే కొనుగోలు చేయవచ్చు. ఇతర రిటైలర్ల ప్రమేయం లేకుండా అసలైన ఉత్పత్తులు, ఆకర్షణీయ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటాయి.

Pixel 9 సిరీస్‌పై ప్రత్యేక ఆఫర్లు

Pixel 9 సిరీస్ ఫోన్లు ఇప్పుడు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లతో లభిస్తున్నాయి.

Pixel 9: రూ.5,000 స్టోర్ డిస్కౌంట్, రూ.7,000 క్యాష్‌బ్యాక్‌తో ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.67,999.

Pixel 9 Pro: రూ.10,000 డిస్కౌంట్ + రూ.10,000 క్యాష్‌బ్యాక్‌తో తుది ధర రూ.89,999.

Pixel 9 Pro XL: మొత్తం రూ.20,000 డిస్కౌంట్లతో, ధర రూ.1,04,999.

Pixel 9 Pro Fold: రూ.1,52,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. (మొత్తం రూ.20,000 డిస్కౌంట్లతో).

వడ్డీలేని EMI సౌకర్యాలు కూడా ఉన్నాయి. Pixel 9 నెలకు రూ.2,833, Pixel 9 Pro Fold నెలకు రూ.6,375 EMIతో ప్రారంభం.

ఎక్స్చేంజ్ బోనస్: పాత ఫోన్‌ను మార్చుకుంటే రూ.15,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

Pixel 8 Pro, Pixel 8a పై భారీ ఆఫర్లు

Pixel 8 Pro: రూ.37,000 డిస్కౌంట్, రూ.7,000 క్యాష్‌బ్యాక్‌తో కేవలం రూ.62,999 ధరలో లభ్యం.

Pixel 8a: రూ.15,000 స్టోర్ డిస్కౌంట్, రూ.3,000 క్యాష్‌బ్యాక్‌తో ఇప్పుడు ధర రూ.34,999.

Pixel Watch 3, Pixel Buds Pro 2

Pixel Watch 3: ధర రూ.39,900. డిస్కౌంట్ లేదు, కానీ రూ.5,000 Google Store క్రెడిట్ లభిస్తుంది.

Pixel Buds Pro 2: ధర రూ.22,900, రూ.3,000 స్టోర్ క్రెడిట్‌తో.

ఈ రెండింటికి వడ్డీలేని EMI సౌకర్యం ఉంది. Watch 3 నెలకు రూ.3,325, Buds నెలకు రూ.1,908 EMIతో పొందవచ్చు.

గూగుల్ స్టోర్ క్రెడిట్, ఎక్స్చేంజ్ ఆఫర్లు

ఈ Pixel ఫోన్లకు గూగుల్ స్టోర్ క్రెడిట్ కూడా లభిస్తుంది

Pixel 9 – రూ.5,000

Pixel 9 Pro, Pro XL, Pro Fold – రూ.10,000 లేదా రూ.12,000

పాత ఫోన్‌ మార్పిడితో రూ.20,000 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.