Best Phones in India 2024 : ఈ ఏప్రిల్‌లో భారత్‌లో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best phones in India : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మొబైల్ మార్కెట్లో రూ.15వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనేసుకోండి.

Best phones in India 2024 : భారత మార్కెట్లో రూ. 15వేల లోపు ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. 2024 ఏప్రిల్ నెలలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను ఎంచుకోవచ్చు. వివిధ బ్రాండ్‌ల ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో పాటు ఫోన్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ లేదా కెమెరా క్వాలిటీ పరంగా మీ అవసరాలకు సరిపోయే ఫోన్ అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏప్రిల్‌లో మీరు భారత్‌లో రూ. 15వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో రియల్‌మి 12 5జీ ఫోన్ నుంచి మోటోరోలా జీ34 5జీ ఫోన్, పోకో ఎం6 ప్రో 5జీ, లావా స్ట్రామ్ 5జీ ఫోన్ మొత్తం 4 ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Read Also : Best Phones in India : మార్చి 2024లో భారత్‌లో రూ. 15వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

రియల్‌మి 12 5జీ ఫోన్ :
రియల్‌మి 12 5జీ ఫోన్ చూశారా? ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులను వేగంగా పూర్తి చేయగలదు. మీరు ఫోన్ వేగంగా వెబ్ బ్రౌజ్ చేయవచ్చు. సోషల్ మీడియాను ఈజీగా స్ర్కోల్ చేయవచ్చు. కొన్ని తేలికపాటి గేమ్‌లను కూడా సులభంగా ఆడవచ్చు. ఒకవేళ బ్యాటరీ డ్రెయిన్ అయితే రియల్‌మి 12 ఫోన్ 5000ఎంఎహెచ్ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Realme 12 5G

రియల్‌మి 12 5జీ ఫోన్ భారీ 6.72-అంగుళాల డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమర్చింది. మీరు గేమింగ్ ఆడినా లేదా వీడియోలు చూస్తున్నా లేదా మెనుల ద్వారా స్క్రోల్ చేస్తున్నా అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మీరు సోషల్ మీడియా ఔత్సాహికులైనా సాధారణ గేమర్ అయినా రియల్‌మి 12 అనేది రూ. 15వేల కన్నా తక్కువ ధర పరిధిలో ఒక అద్భుతమైన ఆప్షన్. ఈ ధర రూ. 2వేల తగ్గింపు తర్వాత రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి. మీరు షాపింగ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోండి.

మోటోరోలా G34 5జీ :
ఈ జాబితాలో రెండో ఫోన్ మోటోరోలా G34 5G మోడల్.. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌తో ఆధారితమైనది. అంటే.. మీరు సోషల్ మీడియాలో ఈజీగా బ్రౌజ్ చేయవచ్చు. మీ స్నేహితులకు మెసేజ్ పంపవచ్చు. కొన్ని గేమ్‌లను కూడా ఎలాంటి స్లో లేకుండా వేగంగా ఆడవచ్చు. మల్టీ టాస్కింగ్ కూడా ఫర్వాలేదనే చెప్పాలి. జీ34 ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అందులో4జీబీ లేదా 8జీబీ ర్యామ్ మీ అవసరాలకు తగినట్టుగా ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. సూపర్ స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.5 అంగుళాలు, స్క్రోలింగ్, వీడియోలను చూడవచ్చు.

Motorola G34 5G

ఈ ధర పరిధిలోని కొన్ని ఇతర ఆప్షన్ల మాదిరిగా అత్యధిక రిజల్యూషన్ కాకపోవచ్చు. కానీ, మోటోరోలా G34 ఫోన్ సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. అదనంగా, 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా మంచి కాంతిలో అద్భుతమైన షాట్‌లను తీస్తుంది. జీ34 ఫోన్ బ్లోట్‌వేర్ లేకుండా సరికొత్త ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్‌వేర్‌ను రన్ చేస్తుంది. రోజంతా ఫోన్ ఛార్జింగ్ రావడానికి 18W ఛార్జింగ్‌తో కూడిన భారీ 5000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. మొత్తం మీద మోటోరోలా జీ34 ఫోన్ నమ్మకమైన ఫోన్ కావాలనుకునే వారికి సరసమైన ధరలో బెస్ట్ 5జీ ఫోన్ అనమాట..

పోకో M6 ప్రో 5జీ ఫోన్ :
మోటోరోలా జీ34 5జీ మాదిరిగానే ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ జాబితాలోని నెక్స్ట్ ఫోన్ పోకో M6 ప్రో 5జీ ఇదే.. ఈ ఫోన్ కేవలం రూ. 10,999తో ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ కొనుగోలుపై అనేక ఆఫర్‌లను పొందవచ్చు. పోకో M6 ప్రో అనేది ఫోన్ క్వాలిటీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఫోన్. ఈ ఫోన్ నుంచి ఒక్క క్షణంలో మూవీలను డౌన్‌లోడ్ చేయడం, వెబ్‌ని బ్రౌజ్ చేయడం లేదా కొన్ని సాధారణ గేమ్‌లను ఆడటం చేయొచ్చు. ఇవన్నీ మీ బడ్జెట్‌కు మించవని గమనించాలి.

Poco M6 Pro 5G

పోకో M6 ప్రో స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. మీ ఫోన్‌లో మల్టీ టాస్కింగ్ చేయడం లేదా టన్నుల కొద్ది యాప్‌లను స్టోర్ చేసినా ఎలాంటి సమస్య ఉండదు. అదనంగా, కెమెరా మంచి లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫొటోలను తీయగలదు. మీరు బ్యాంక్‌ ఆఫర్లపై ఆధారపడని ఫీచర్-ప్యాక్డ్ 5జీ ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ నెలలో 15వేల కన్నా తక్కువగా మార్కెట్‌లో పోకో M6 ప్రో బలమైన పోటీదారుగా చెప్పవచ్చు.

లావా స్టార్మ్ 5జీ :
లావా స్టార్మ్ 5జీ కూడా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వేగంగా ఉంటుంది. ఆకర్షణీయమైన 120Hz డిస్‌ప్లేతో పాటు గేమింగ్ చేస్తున్నా, సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నా లేదా వీడియోలు చూస్తున్నా అద్భుతంగా ఉంటుంది. లావా స్టార్మ్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమన్షిటీ 6080 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.

Lava Storm 5G

రోజువారీ పనులు మాత్రమే కాకుండా లైట్ గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. ఈ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, వేగవంతమైన 33డబ్ల్యూ ఛార్జర్‌ కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువకాలం మన్నికను అందిస్తుంది. అదనంగా, కెమెరా మంచి లైటింగ్‌లో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. స్టైలిష్‌గా, సరదాగా ఉండే భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ జాబితాలో ఏదైనా ఫోన్ కోసం చూస్తుంటే.. లావా స్టార్మ్ 5జీ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Best Phones in India 2024 : ఈ ఫిబ్రవరిలో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు