Best Phones in India : మార్చి 2024లో భారత్‌లో రూ. 15వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Best Phones in India : ఈ మార్చి 2024లో భారత మార్కెట్లో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Phones in India : మార్చి 2024లో భారత్‌లో రూ. 15వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Best phones in India under Rs 15k in March 2024: Tecno Pova 5 Pro 5G and 3 more

Best phones in India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మార్చి 2024లో భారత మార్కెట్లో రూ. 15వేల లోపు కొనగలిగే అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వివిధ బ్రాండ్‌లకు సంబంధించిన మరెన్నో ఆప్షన్లు ఉన్నాయి. ప్రాసెసర్‌లు, లాంగ్ లైఫ్ బ్యాటరీలు, ఆకట్టుకునే కెమెరాలతో పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ లేదా కెమెరా క్వాలిటీతో మరింత ఆకట్టకునేలా ఉన్నాయి.

మీ బడ్జెట్‌కు సరిపోయే కచ్చితమైన ఫోన్‌ కొనేందుకు చూస్తుంటే.. ఈ మార్చిలో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి. ఈ జాబితాలో టెక్నో పోవా 5 ప్రో సహా మొత్తం మూడు ఇతర ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

Read Also : Jio New 5G Smartphone : గుడ్ న్యూస్.. రూ. 10వేల లోపు ధరలో కొత్త జియో 5G స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది!

టెక్నో పోవా 5 ప్రో 5జీ :
టెక్నో పోవా 5 ప్రో 5జీ ఫోన్ ఆకర్షణీయమైన లుక్‌తో వస్తుంది. ఇందులోని మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ని అందిస్తుంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వేగవంతమైన 68డబ్ల్యూ ఛార్జింగ్ అందిస్తుంది. పోవా 5 ప్రో మోడల్ 6.78-అంగుళాల పెద్ద ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. మీరు టెక్ ఔత్సాహికులైనా సాధారణ గేమర్ అయితే టెక్నో పోవా 5 ప్రో మోడల్ రూ. 15వేల కన్నా తక్కువ ధరలో కొనుగోలు చేయొచ్చు.

మోటో జీ34 5జీ :
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. రోజువారీ పనులకు బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. 4జీబీ, 8జీబీ అనే రెండు ర్యామ్ ఆప్షన్లలో వస్తుంది. మల్టీ టాస్కింగ్ అవసరాలకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మోటో జీ34 5జీ మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. పోవా 5 ప్రో ఫోన్ వంటి ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. మోటోరోలా జీ34 5జీ మోడల్ బ్యాక్ 50ఎంపీ ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. క్లీన్, అప్-టు-డేట్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

పోకో M6 5జీ :
మార్చి 2024 మార్కెట్‌లో పోకో ఎం6 5జీ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ మోడల్ కేవలం రూ. 9,999తో ప్రారంభమవుతుంది. అత్యుత్తమ 5జీ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఫోన్‌తో వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ పొందవచ్చు. ఫ్లాష్‌లో మూవీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తేలికపాటి గేమింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు. పోకో ఎం6 5జీ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్ కలిగి ఉంది. కెమెరా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఫీచర్-ప్యాక్డ్ 5జీ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులకు పోకో ఎం6 5జీ ఫోన్ రూ. 15వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

లావా స్టార్మ్ 5జీ :
లావా స్టార్మ్ 5G సరసమైన ధరలో కొనుగోలు చేయొచ్చు. 120Hz డిస్‌ప్లేతో గేమింగ్, బ్రౌజింగ్ చేసినా వీడియోలు చూసినా అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ గేమింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. బ్యాటరీ లైఫ్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ రోజంతా పవర్ అందిస్తుంది. కెమెరా లైటింగ్‌‌తో ఆకట్టుకునే ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. లావా స్టార్మ్ 5జీ కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు.

Read Also : Infinix Smart 8 Plus Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? సరసమైన ధరకే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?