Infinix Smart 8 Plus Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? సరసమైన ధరకే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Infinix Smart 8 Plus : ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. భారత మార్కెట్లో రూ.7వేల లోపు సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఫీచర్లు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Infinix Smart 8 Plus Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? సరసమైన ధరకే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Infinix Smart 8 Plus with 6000mAh battery launched under Rs 7000

Infinix Smart 8 Plus : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నుంచి సరసమైన ధరకే సరికొత్త ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో జీ36 2.2 జీహెచ్‌జెడ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 50ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు 128జీబీ ర్యామ్ ఉంది. 6000ఎంఎహెచ్ బ్యాటరీ ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్‌‌ఫోన్ అని చెప్పవచ్చు. రూ.7వేల లోపు ధరలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Anant Ambani Pre-Wedding : అనంత్‌-రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుక.. నా రెండు కోరికలివే.. నీతా అంబానీ స్పెషల్‌ వీడియో మెసేజ్‌..!

ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ రూ. 6,999కి లాంచ్ అయింది. గెలాక్సీ వైట్, టింబర్ బ్లాక్, షైనీ గోల్డ్ అనే 3 కలర్ వేరియంట్‌లతో సహా అందుబాటులోకి వచ్చింది.

 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు :
ఇమేజింగ్ సామర్థ్యాల పరంగా స్మార్ట్ 8 ప్లస్‌లో 50ఎంపీ డ్యూయల్ ఏఐ కెమెరా, క్వాడ్-ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్‌తో అమర్చారు. ఈ సెటప్ వినియోగదారులకు లైటింగ్ పరిస్థితుల్లో కూడా అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది. అదనంగా, ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆకట్టుకునే సెల్ఫీలను తీసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ డిస్‌ప్లే స్మూత్, హిప్నోటిక్ 90హెచ్‌జెడ్ పంచ్-హోల్ డిస్‌ప్లేతో సమానంగా ఉంటుంది. మ్యాజిక్ రింగ్ స్క్రీన్‌పై బ్యాటరీ శాతం, ఛార్జింగ్ స్టేటస్, ఇన్-కాల్ టైమ్ వంటి అవసరమైన సమాచారాన్ని చూడవచ్చు.

స్మార్ట్ 8 ప్లస్‌కి సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్ మరింత ఆకర్షణీయమని చెప్పవచ్చు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ36 2.2 జీహెచ్‌జెడ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ డివైజ్ వేగవంతమైన పనితీరు, మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను అందిస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్‌తో స్టోరేజ్ సమస్య ఉండదు. ఎందుకంటే.. 128జీబీ ఇంటర్న్ స్టోరేజీని అందిస్తుంది, మైక్రో ఎస్‌డీ ద్వారా 2టీబీ వరకు విస్తరించవచ్చు. మెమ్‌ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా గరిష్టంగా 8జీబీ ర్యామ్ అందిస్తుంది.

Read Also : Facebook News Tab : ఫేస్‌బుక్ పబ్లిషర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ‘న్యూస్ ట్యాబ్’ కనిపించదు.. నో పేమెంట్..!