Best Phones: రూ.32,000లోపే ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్లు.. ఈ రెండు ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే..

ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల పనితీరు, బ్యాటరీ, వీడియో రికార్డింగ్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి.

అన్ని రకాల ఫీచర్లు ఉండి రూ.32,000 కంటే తక్కువ ధరకే లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా? అయితే, iQOO Neo 10, iQOO Neo 10R గురించి తెలుసుకోవాల్సిందే. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల పనితీరు, బ్యాటరీ, వీడియో రికార్డింగ్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి.

పర్ఫార్మన్స్‌
iQOO Neo 10 3.2 GHz క్లాక్ స్పీడ్‌తో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌, అడ్రినో 825 GPUతో వచ్చింది. అలాగే, iQOO Neo 10R 3 GHz క్లాక్ స్పీడ్, అడ్రినో 735 తో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3తో అందుబాటులో ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్లు LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్‌తో వచ్చాయి. నియో 10 రియల్‌ పర్ఫార్మన్స్‌లో బెటర్‌గా ఉంది.

డిస్ప్లే
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 1260×2800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చాయి. స్క్రీన్ సైజు, రిజల్యూషన్, పిక్సెల్ అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ, నియో 10R 4500 నిట్‌లతో పోలిస్తే iQOO నియో 10.. 5500 నిట్‌ల అధిక పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. రెండు ఫోన్‌లు పంచ్-హోల్ స్క్రీన్‌లతో వచ్చాయి.

బ్యాటరీ, ఛార్జింగ్
iQOO నియో 10.. 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వచ్చింది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. ఇది కేవలం 19 నిమిషాల్లో 50% ఛార్జ్‌ చేస్తుంది. నియో 10R 6400mAh లి-అయాన్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చింది. ఇది 26 నిమిషాల్లో 50% ఛార్జ్‌ చేస్తుంది.

కెమెరా
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల బ్యాక్‌ సైడ్‌ కెమెరా ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. 50MP వైడ్-యాంగిల్ ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో ఇవి వచ్చాయి. iQOO నియో 10 ఓమ్ని-డైరెక్షనల్ PD ఆటోఫోకస్‌తో ఉంటుంది. అయితే నియో 10Rలో ఈ ఫీచర్‌ మాత్రం లేదు. ఫ్రంట్‌ సైడ్ రెండు స్మార్ట్‌ఫోన్లు 32MP వైడ్-యాంగిల్ లెన్స్‌తో వచ్చాయి.

డిజైన్, సాఫ్ట్‌వేర్
డిజైన్ పరంగా రెండు ఫోన్‌లు దాదాపు ఒకే రకమైన సైజు, పంచ్-హోల్ డిస్‌ప్లేలతో వచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో IP65 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్సీ ఉంది. ఈ రెండు ఫోన్‌లు Funtouch OS వాడి Android 15తో వచ్చాయి. 3 సంవత్సరాల OS అప్‌గ్రేడ్లను పొందవచ్చు.