కొత్త ఫోన్ కొంటున్నారా? : రూ.5వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

Best Phones under 5000 in India : భారత మార్కెట్లో రూ.5000వేల లోపు బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఫీచర్లు లేకపోయినప్పటికీ బేసిక్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. 2021 ఏడాది మొబైల్ మార్కెట్లో రూ.5వేల బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు అనేక ఆకర్షణీమైన ఫీచర్లతో అందుబాటులోకి ఉన్నాయి. అందులో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ తో స్పీడ్, స్టేబిలిటీ పర్ఫార్మెన్స్ బాగున్నాయి.

ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల మారితే బేసిక్ ఫీచర్లలో 18:9 డిస్ ప్లే, డ్యుయల్ కెమెరాలు, 4G కనెక్టవిటీ, ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తున్నాయి. బేసిక్ స్మార్ట్ ఫోన్లలో రూ.5వేల లోపు బడ్జెట్ ఫోన్లు ఉన్నాయి. ఏయే బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు ఏ ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

1. నోకియా 2.1 :
నోకియా 2.1.. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఆండ్రాయిడ్ వన్ సర్టిఫికేషన్ తో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 425, 4000mAh బ్యాటరీ అమర్చారు. 1GB RAM సెటప్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో బెస్ట్ మొబైల్ ఫోన్ నోకియా 2.1.. రూ.5వేల లోపు బడ్జెట్ లో సొంతం చేసుకోవచ్చు. దీని ధర అమెజాన్ లో రూ.4,665 లకు అందుబాటులో ఉంది.
ఫీచర్లు :
స్ర్కీన్ సైజు : 5.5″ (720 x 1280)
కెమెరా : 8 | 5MP
ర్యామ్ : 1GB
బ్యాటరీ : 4000 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
Soc : Qualcomm MSM8917, Snapdragon 425
ప్రాసెసర్ : క్వాడ్

2. నోకియా 1:
నోకియా 1.. ఆండ్రాయిడ్ ఒరియో (గో ఎడిషన్) ఫోన్.. 1GB ర్యామ్, మీడియా టెక్ ప్రాసెసర్ ఉంది. లైట్ వైట్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై రన్ అవుతుంది. రూ.5వేల లోపు ఆండ్రాయిడ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి.. దీని ధర అమెజాన్ లో రూ.3,649లకు అందుబాటులో ఉంది.

ఫీచర్లు :
స్ర్కీన్ సైజు : 4.5″ (480 x 854)
కెమెరా : 5 | 2 MP
ర్యామ్ : 1GB
బ్యాటరీ : 2150 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
Soc : Mediatek MT6737M
ప్రాసెసర్ : క్వాడ్

3. షియోమీ రెడ్ మి గో :
ఆండ్రాయిడ్ గో ఫోన్లలో రెడ్ మి గో స్మార్ట్ ఫోన్ ఒకటి.. రూ.5వేల ధరలో బెస్ట్ ఫోన్. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. గూగుల్ గో యాప్స్ ద్వారా ష్యూట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. తద్వారా ర్యామ్, స్టోరేజీ స్పేస్ తక్కువగా వినియోగించుకోవచ్చు. దీని ధర మార్కెట్లో రూ.5,990లకే లభ్యం అవుతోంది.
ఫీచర్లు :
స్ర్కీన్ సైజు : 5″ (720 X 1280)
కెమెరా : 8 | 5 MP
ర్యామ్ : 1GB
బ్యాటరీ : 3000 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
Soc : Qualcomm Snapdragon 425
ప్రాసెసర్ : క్వాడ్

4. శాంసంగ్ గెలాక్సీ M01 Core ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ M01 కోర్.. స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ రెడ్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 5.3 అంగుళాల HD Plus రెజుల్యుషన్ డిస్ ప్లే ఆప్షన్ కలిగి ఉంది. 3000mAh బ్యాటరీతో 11 గంటల పాటు వీడియో ప్లే చేసుకోవచ్చు. 1GB ర్యామ్, 16GB స్టోరేజీ కలిగి ఉంది. మరో రూ.1000 వరకు బడ్జెట్ పెట్టుకోగలిగితే 2GB ర్యామ్, 32GB స్టోరేజీ కలిగిన డివైజ్ సొంతం చేసుకోవచ్చు. దీని ధర మార్కెట్లో రూ.5998 లభ్యం అవుతోంది.
ఫీచర్లు :
స్ర్కీన్ సైజు : 5.14″ (720 x 1480)
కెమెరా : 8 | 5 MP
ర్యామ్ : 2GB
బ్యాటరీ : 3000 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
Soc : Mediatek MT6739WW
ప్రాసెసర్ : క్వాడ్- కోర్

5. రిలయన్స జియో ఫోన్ :
జియోఫోన్ పూర్తి స్మార్ట్ ఫోన్ కాదు.. అలా అని ఫీచర్ ఫోన్ కూడా కాదు.. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి యాప్స్ యాక్సస్ చేసుకోవచ్చు. జియో ష్యూట్ యాప్స్ కూడా యాక్సస్ ఆప్షన్ ఉంది. 4G వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. రూ.1500 లోపు ఫోన్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తం నగదు రిఫండ్ చేస్తుంది కంపెనీ. రూ.5వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లలో ఇదొకటి. దీని ధర అమెజాన్ మార్కెట్లో రూ.1500లకు లభ్యం అవుతోంది.
ఫీచర్లు :
స్ర్కీన్ సైజు : 2.4″ (240 x 320)
కెమెరా : 2 | 0.3 MP
ర్యామ్ : 512MB
బ్యాటరీ : 2000 mAh
ఆపరేటింగ్ సిస్టమ్ : KAI OS
Soc : SPRD 9820A/QC8905
ప్రాసెసర్ : Dual Core