Best Phones 2026 : రూ.35వేల లోపు ఏ ఫోన్ కొనాలి? మోటోరోలా, వివో, వన్‌ప్లస్ ఫోన్లలో ఏది బెటర్? ఫుల్ డిటెయిల్స్

Best Phones 2026 : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో అనేది కంపెనీ పాపులర్ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. లాంచ్ అయిన వెంటనే కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, వివో వి60ఇ, వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్లలో ఏ ఫోన్ కొంటే బెటర్ ఇప్పుడు తెలుసుకుందాం..

Best Phones 2026

  • మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, మీడియాటెక్ డైమన్షిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌
  • వివో వి60e మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌
  • వన్‌ప్లస్ నార్డ్ 5 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌
  • మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో వర్సెస్ వివో వి60ఇ వర్సెస్ వన్‌ప్లస్ నార్డ్ 5

Best Phones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో బాగా పాపులర్ ఫోన్. లాంచ్ అయిన కొద్దిరోజులకే ఎక్కువ మంది కొనేశారు. అయితే, ఈ కేటగిరీలో వివో , వన్‌ప్లస్ నుంచి పాపులర్ మిడ్-రేంజ్ ఫోన్‌లు మార్కెట్లో ఉన్నాయి. మోటోరోలా ఫోన్‌కు గట్టి పోటీని ఇస్తున్నాయి.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, వివో వి60e, వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్‌లతో నేరుగా (Best Phones 2026) పోటీపడుతుంది. వివో V60eలో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ ఉండగా, వన్‌ప్లస్ నార్డ్ 5 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రూ. 35వేల లోపు ధరలో ఈ 3 ఫోన్లలో ఏ ఫోన్ పవర్‌ఫుల్ అనేది ఇప్పుడు వివరంగా పోల్చి చూద్దాం..

డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.7-అంగుళాల సూపర్ HD pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. వివో V60e ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1600 నిట్స్ లోకల్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ 1800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.83-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

సాఫ్ట్‌వేర్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. వివో V60e ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 15పై రన్ అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ 5 ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 15పై రన్ అవుతుంది.

ప్రాసెసర్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో వస్తుంది. వివో V60e ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

Read Also : Vivo X Fold 3 Pro : వివో ఆఫర్ అదుర్స్.. ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌పై ఏకంగా రూ. 33వేలు డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

రియర్ కెమెరా :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో 50MP రియర్ ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 10MP టెలిఫోటో కెమెరా ఉంది. వివో వి60eలో ఎఫ్/1.88 అపర్చర్‌తో 200MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5 రియర్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. వివో V60eలో కూడా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో కూడా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. వివో V60e ఫోన్ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,500mAh బ్యాటరీని అందిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 5 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,800mAh బ్యాటరీని అందిస్తుంది.

ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర సుమారుగా రూ. 32వేల నుంచి ప్రారంభమవుతుంది. వివో V60e ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 నుంచి ప్రారంభం కాగా, వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999 నుంచి అందుబాటులో ఉంటుంది.