Best smartphones in India under Rs 15k in February 2024
Best Phones in India 2024 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? 2024లో మొబైల్ మార్కెట్లో అనేక బడ్జెట్ ఫోన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. అందులో రూ. 15వేల లోపు ధరలో టాప్ బడ్జెట్ ఫోన్లు కూడా ఉన్నాయి. పోకో ఎమ్6 5జీ ఫోన్ నుంచి టెక్నో పోవా 5 ప్రో 5జీ, లావా స్టార్మ్ 5జీ బెస్ట్ బడ్జెట్ ఫోన్లు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫిబ్రవరిలో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల రూ. 15,000 లోపు ధరలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.
పోకో M6 5జీ ఫోన్ :
బ్యాంకు ఆఫర్లతో అవసరం లేకుండా ఆకట్టుకునే 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలా? పోకో M6 5జీ ఫోన్ ఒకటి ఉంది. కేవలం రూ. 10,499 అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఇంటర్నెట్ వేగంగా అందించడంలో సాయపడుతుంది. ఒక్క క్షణంలో మూవీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని తేలికపాటి గేమ్‌లు ఆడేందుకు అనుమతిస్తుంది.
పోకో ఎమ్6 5జీ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 8జీబీ వరకు ర్యామ్ కలిగి ఉంది. మీరు యాప్‌లు, గేమ్‌లను సులభంగా వినియోగించవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. లైటింగ్‌లో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. రూ. 15వేల లోపు ధరలో ఈ ఫిబ్రవరిలో మీరు కొనగలిగే అత్యుత్తమ బడ్జెట్ 5జీ ఫోన్‌లలో ఇదొకటి.
Poco M6 5G
టెక్నో పోవా 5 ప్రో 5జీ :
ఈ జాబితాలో తదుపరి ఫోన్ టెక్నో పోవా 5 ప్రో ఫోన్. ఈ 5జీ ఫోన్ బలమైన ప్రాసెసర్‌తో వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080తో వచ్చింది. ఈ ఎస్ఓసీ వెబ్ బ్రౌజింగ్ నుంచి కొన్ని లైట్ గేమింగ్ వరకు అన్నింటిని సులభంగా పూర్తి చేయొచ్చు. వేగవంతమైన 67డబ్ల్యూ ఛార్జింగ్ బ్యాటరీ.. ఛార్జ్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్లాష్‌లో పవర్ నింపుతుంది.
Tecno Pova 5 Pro
పోవా 5 ప్రో ఫోన్ 6.78-అంగుళాల పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంది. మృదువైన 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. గేమింగ్, మూవీలు లేదా యూఐలో స్క్రోలింగ్ చేయడానికి సరైనది. టెక్కీ అయినా గేమర్ అయినా టెక్నో పోవా 5 ప్రో మోడల్ అనేది రూ. 15వేల కన్నా తక్కువ ధరలో అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
లావా స్టార్మ్ 5జీ :
లావా స్టార్మ్ 5జీ ఫోన్ స్మూత్ 120హెచ్‌జెడ్ స్క్రీన్, శక్తివంతమైన డైమెన్సిటీ 6080 చిప్‌ను కలిగి ఉంది. గేమ్‌ల నుంచి క్యాట్ వీడియోల వరకు ఆకర్షణీయంగా ఉంటుంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీ దీర్ఘకాలం పాటు ఉంటుంది. ఛార్జింగ్ తక్కువగా ఉన్న సమయంలో 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ వేగంగా ఛార్జ్ అందిస్తుంది.
Lava Storm 5G
అదనంగా, కెమెరా ఫీచర్లు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. మంచి లైటింగ్ ఉంటే అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. బ్యాంకు ఆఫర్లతో పనిలేకుండా లావా స్టార్మ్ 5జీ ఫోన్ తక్కువ ఖర్చులో కేవలం రూ. 15వేల లోపు ధరలో సొంతం చేసుకోవచ్చు.